2024 పెద్ద సంచలనం కాబోతోందా. వైసీపీ కంచుకోట బద్దలు కాబోతోందా. గుడివాడ వైసీపీ నేతల్లో గుబులు పట్టుకుందా. కొడాలి నాని పరాజయం ఖాయమా. అందుకు టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద స్కేచ్చే వేశారా..
కొడాలి నాని.. ఎవరినైనా ఏకవచనంతో సంబోధించే నాయకుడు. టీడీపీ అంటే అసలు లెక్కచేయకుండా మాట్లాడే లీడర్.బూతుల మంత్రి అని ముద్రపడిపోయిన నాని నిత్యం చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంటారు. అందుకే ఈ సారి గుడివాడలో కొడాలి నానిని ఓడించేందుకు చంద్రబాబు గట్టి అంగబలం, అర్థబలం ఉన్న కేండేట్ ను రంగంలోకి దించుతున్నారు. ఈసారి నానిని ఇంటికి పరిమితం చేసే వ్యూహాలు రచిస్తున్నారు…
టీడీపీలో క్రియాశీలంగా పనిచేస్తున్న ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త వెణిగెళ్ల రాము పేరు గుడివాడ నియోజకవర్గంలో బలంగా వినిపిస్తోంది. ఏ పనికైనా నేను ఉన్నాను అంటూ ముందుకు వస్తున్న వెనిగెళ్ల రాము పట్ల పార్టీ కేడర్లోనూ అభిమానం రోజురోజుకూ పెరిగిపోతోంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే, పైర్ బ్రాండ్ కొడాలి నాని మరోసారి గెలవకూడదని భావిస్తున్న టీడీపీ కేడర్ చంద్రబాబు ఏమి చెబితే అదే శిరోధార్యమనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలోనే టీడీపీ అధినేత వెనిగెళ్ల రాము పేరును ఖరారు చేసి గట్టిగా ప్రయత్నించాలని ఉపదేశం చేసినట్లుగా చెబుతున్నారు. టైమ్ వచ్చినప్పుడు అధికారికంగా ప్రకటిస్తానని ప్రస్తుతానికి జనంలో ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలని చంద్రబాబు ఆదేశించినట్లు రాము అనుచరులు చెబుతున్నారు. 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై చంద్రబాబు ఓ క్లారిటీకి వచ్చారని అందులో గుడివాడ ఒకటని పార్టీ వర్గాలు అంటున్నాయి.
నిజానికి గెలుస్తామన్న నమ్మకం టీడీపీ వర్గాల్లో ఇప్పుడిప్పుడే కలుగుతుండొచ్చు. ఇంతకాలం గుడివాడలో బతికి బట్ట కట్టే అవకాశం లేదని తెలుగుదేశంలో కొందరు లీడర్లు గట్టిగా పోరాడారు.చాలా రోజులుగా రావి వెంకటేశ్వరరావు గుడివాడను తన నియోజకవర్గంగా భావించి పార్టీని డెవలప్ చేస్తూ పోయారు. చంద్రబాబుకు కూడా ఆయనంటే అభిమానం ఉంది. కాకపోతే విజయావకాశాలు, ఎవరికి జనం ఓటేసే అవకాశం ఉంది… ఎవరు ఎక్కువ ఖర్చు చేయగలరనే అంశాల ఆధారంగా కొడాలి నానిపై వెనిగెళ్ల రాము అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. వేల కోట్ల ఆసామి కొడాలి నానిని ఢీకొట్టాలంటే డబ్బు వెదజల్లగలిగే ప్రత్యర్థి ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. పైగా లోకల్ గా డబ్బులు పోగెయ్యడంతో పాటు బయట నుంచి నిధులు తీసుకురాగలిగిన నాయకుడై ఉండాలని కూడా లెక్కలేసుకున్నారు. అలాంటి సందర్భంలోనే రాము రైట్ కేండేట్ అని తేలిపోయింది. ఒక సందర్భంలో గుడివాడలో తాడో పేడో తేల్చుకునేందుకు బావమరిది నందమూరి బాలకృష్ణను పోటీ చేయించాలని చంద్రబాబు అనుకున్నారట. మరీ రిస్క్ అవుతుందని భావించి తర్వాత నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.
రావి వెంకటేశ్వరరావు అలిగితే ఎలా అన్న ప్రశ్న కూడా టీడీపీ పెద్దల్లో కలిగిన మాట వాస్తవం. అందుకు చంద్రబాబు స్వయంగా ఆయన్ను పిలిపించి మాట్లాడారు. కొడాలి నానిని ఓడించాల్సిన అనివార్యతను వివరించారు. ఎన్నికల తర్వాత మరోరూపంలో అకామడేట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఏమో అవకాశాన్ని బట్టి రాము ఎమ్మెల్యేకు పరిమితం కావచ్చు… రావి వెంకటేశ్వరరావు మంత్రి కూడా కావచ్చు
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..