భూమి గుండ్రంగా ఉంటుందంటారు. రాజకీయాల్లో కూడా అదే జరిగే అవకాశం ఉందా. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ కు సపోర్టు చేస్తారా.. అది సాధ్యమేనా.. అందులోనూ బీఆర్ఎస్ పార్టీతో లోపాయకారి స్నేహం ఉన్న వైసీపీ వెళ్లి కాంగ్రెస్ కు మద్దతివ్వడమే.. తెలంగాణలో ఈ పరిణామానికి కారణం ఏమిటి..
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పార్టీ మారడాలు, కొత్త పార్టీలో చేరడాలు రోజువారీగా జరుగుతున్నాయి. ఎవరికి వారు తమ పార్టీ బలంగా ఉందని, మిగతా పార్టీలు వీకైపోయాయని ప్రచారం చేసుకుంటున్నాయి. వచ్చిన వారందరినీ ఆహ్వానిస్తామని, కొత్త వారిని చేర్చుకుంటామని కూడా ప్రకటనలిచ్చేస్తున్నాయి. ఈ తరుణంలోనే వైసీపీ ఎంపీ అయిన అఖిల భారత బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యకు కాంగ్రెస్ పార్టీ గాలం వేసింది. తెలంగాణ ఇంఛార్జ్ అయిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాణిక్ రావు ఠాక్రే, రాజకీయ కురువృద్ధుడు వీ. హనుమంతరావును వెంటపెట్టుకుని వెళ్లి ఆర్. కృష్ణయ్యను కలిశారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రకటించేశారు. కాంగ్రెస్ అధికారానికి వచ్చిన వెంటనే బీసీ కుల గణన చేపడతామని హామీ పలికారు. కృష్ణయ్య డిమాండ్లన్నింటినీ నెరవేర్చేందుకు వెనుకాడాబోమని, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తే చాలని కోరారు. బీసీల మద్దతు ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుందని, అందుకే కృష్ణయ్య మద్దతు కోరుతున్నామని చెప్పారు.
కృష్ణయ్యకు ఆలోచనలు తరచూ మారుతుంటాయి. ఆయన ఒక పార్టీకి సంఘీభావంగా ఎక్కువ రోజులు ఉండలేదు. టీడీపీలో చేరి కొన్ని రోజుల తర్వాత దూరం జరిగారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ ఆయన్ను పిలిచి మరీ రాజ్యసభ సభ్యత్వమిచ్చారు. అలాగని వైసీపీలో క్రియాశీలంగా ఉన్న సందర్భమూ కనిపించడం లేదు. ఎక్కువ సమయం హైదరాబాద్ కే ఆయన పరిమితమయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఆయన్ను కలుస్తున్నారంటే.. అందుకు ఆయన్న అంగీకరించి పిలిచినట్లే అనుకోవాలి. కృష్ణయ్య అనుమతితోనే ఠాక్రే ఆయన ఇంటికి వెళ్లినట్లుగా భావించాలి. ఇదీ ఒక కోణం.వైసీపీ అధినేత కూడా ఈ భేటీని ఆమోదించారా లేక కృష్ణయ్య సొంత వ్యవహారంగా పరిగణించాలా అన్నది మరో కోణం. అందుకే కృష్ణయ్య నుంచి ఠాక్రేకు డైరెక్ట్ సమాధానం రాలేదని చెబుతున్నారు. బహుశా ఓ సారి జగన్ తో సమావేశామై ఆయన అభిప్రాయమేమిటో తెలుసుకోవాలనుకున్నారని కృష్ణయ్య అనుచరులు అంటున్నారు. జగన్, కేసీఆర్ మంచి మిత్రులైనప్పుడు జగన్ డైరెక్టుగా కాంగ్రెస్ కు మద్దతిచ్చే అవకాశం ఉండదు. కాకపోతే బీసీ సంఘం పరంగా కృష్ణయ్య కాంగ్రెస్ కు మద్దతిచ్చే అవకాశాలు ఉండొచ్చని కొందరు వాదిస్తున్నారు. అదీ బీసీ సంక్షేమంపై ఇతర పార్టీల తీరు ఎలా ఉందో చూసుకుని
కృష్ణయ్య స్పందించే అవకాశాలుంటాయనే చెప్పాలి..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..