ఏపీ బీజేపీ లో లేడీ బాస్ స్ట్రాటజీ

By KTV Telugu On 28 August, 2023
image

KTV TELUGU :-

ఆంధ్ర ప్రదేశ్ బిజెపిలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాషాయం పార్టీ పై పచ్చాని రంగేసేస్తున్నారు  కొత్త అధ్యక్షురాలు పురంధేశ్వరి. బిజెపిలోని టిడిపి అనుకూల నేతలు.. మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు వ్యతిరేకులు అయితే చాలు  అత్యధిక ప్రాధాన్యత ఖాయమని చాటి చెబుతున్నారు. పొరపాటున సోము వీర్రాజు హయాంలో  ఓ వెలుగు వెలిగిన వారయితే ఇక వారి భవిష్యత్తు చీకటే అన్నట్లుగా వ్యవహారాలు నడుస్తున్నాయి. పురంధేశ్వరి ఇదంతా ఎందుకు చేస్తున్నారు? పార్టీ అధిష్టానమే ఈ దిశగా  దిశా నిర్దేశనం చేసిందా? లేక టిడిపి అధినేత చంద్రబాబు నాయుడితో రహస్య డీల్ ఏమైనా కుదిరిందా? అన్న అనుమానాలు వస్తున్నాయంటున్నారు రాజకీయ పండితులు.

ఏపీ బీజేపీ లో లేడీ బాస్ స్ట్రాటజీ

ఎపి బిజెపి రాష్ట్ర కార్యవర్గానికి అనుబంధ సంఘాలతో కలుపుకుని దాదాపు 48 మందితో కొత్త కమిటీని  ప్రకటించారు పార్టీ  అధ్యక్షురాలు పురందేశ్వరి. అధ్యక్షులు మారినపుడు  ఏ పార్టీలో అయినా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. అది సహజం . కానీ ఏపీ బిజెపిలో చోటు చేసుకున్న మార్పులు మాత్రం ఆ పార్టీ నేతలకే మింగుడు పడ్డం లేదు. కొత్త కమిటీ జాబితాని చూసిన తర్వాత బిజెపి శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి.పార్టీకి మొదటి నుంచి కష్టపడిన వారికి కాకుండా ఫిర్యాదుల బ్యాచ్ కి కీలక పదవులు దక్కడంపై సర్వత్రా విమర్సలు విన్పిస్తున్నాయి.

డిల్లీ వరకు వెళ్లి ఫిర్యాదు

ముఖ్యంగా బిజెపి తాజా మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి వ్యతిరేకంగా డిల్లీ వరకు వెళ్లి ఫిర్యాదు చేసిన ఎస్ కె బాజీ, సిఎచ్ కుమార్ స్వామిలకి కీలక పదవులు దక్కాయి…సోము వీర్రాజుకి వ్యతిరేకంగా పనిచేసిన ఎస్ కె బాజీకి మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశమిచ్చారు..ఉమ్మడి కృష్ణా అధ్యక్షుడిగా పనిచేస్తూ సోము వీర్రాజు హయాంలో కొన్ని నెలల క్రితం జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగించిన   సిఎచ్.కుమార స్వామికి కిషాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షిడిగా నియమించడం పార్టీలో చర్చనీయాంశమవుతోంది. సోముపై ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేసినపుడే ఈ ఇద్దరి నేతలకి అధిష్టానం క్లాస్ పీకింది.  అటువంటిది సోముకి , పార్టీకి వ్యతిరేకంగా ఢిల్లీలో గళం విప్పిన ఆ ఇద్దరి నేతలకి కీలక పదవులు దక్కడం పార్టీ నేతలనే ఆశ్చర్యంలో ముంచెత్తింది.

అలాగే సోము వీర్రాజుకి విదేయులుగా ఉన్న నాయకులకి ప్రాదాన్యత లేని పదవులు కట్టబెట్టారు…గత కమిటీలో ప్రదాన కార్యదర్శులుగా  పనిచేసిన వేటుకూరి సూర్యనారాయణ రాజు,విష్ణువర్దన్ రెడ్డి, పివిఎన్ మాధవ్ లకి ఉపాధ్యక్ష పదవులతో సరిపెట్టారు. ఇక విశాఖపట్నంలో గత ఎన్నికల సమయంలో పురందేశ్వరికి సహకారమందించిన కాశీ విశ్వనాధ రాజుకి కీలకమైన‌ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు.దీంతో పాటు సొంత సామాజిక వర్గానికి చెందిన గారపాటి తపనా చౌదరికి రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పదవి  ఇచ్చుకున్నారు.

పార్టీ శ్రేణులు ఆగ్రహం

తెలుగుదేశం పార్టీ వాయిస్ కి దగ్గరగా మాట్లాడేవారికి కీలక పదవులు దక్కడం పార్టీలో అసంతృప్తి రేపుతోంది…ఇటీవల వరకు టిడిపిలో ఉండి బిజెపిలో చేరిన అరకు మాజీ ఎంపి కొత్తపల్లి గీతకి రాష్ట్ర ఉపాద్యక్షురాలిగా అవకాశం కల్పించడంపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
గత అయిదేళ్లూ టిడిపిలో ఒక వెలుగు వెలిగి చివర్లో బిజెపిలో చేరిన సాదినేని యామినీ శర్మకి కీలకమైన అధికార ప్రతినిది పదవి ఇచ్చారు
బిజెపిలో ఉంటూ ఎపుడూ చంద్రబాబు వాయిస్ వినిపించే  వాకాటి నారాయణ రెడ్డి, చందూ సాంబశివరావులు ఇద్దరికీ కూడా రాష్ట్ర
ఉపాధ్యక్ష పదవులు దక్కాయి.

వచ్చే ఏడాది ఎపిలో ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారికి గుర్తింపు వస్తుందని ఆశపడిన నాయకులకి మొండిచేయి చూపడంపై పార్టీలో కాకరేపుతోంది…అధికారం ఉన్నంతసేపూ టిడిపిలో ఉండి…ఆ తర్వాత బిజెపి పంచన చేరిన నేతలకి అగ్రతాంబూలమివ్వడం పార్టీ శ్రేణులకి రుచించడం లేదు…టిడిపి బి టీమ్ గా పనిచేసేవారికి రాష్ట్ర కార్యవర్గంలో ఎన్నికల వేళ కీలక‌పదవులు కట్టబెట్డడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి