పప్పు నుంచి నిప్పు అయ్యారా ?

By KTV Telugu On 23 December, 2023
image

KTV TELUGU :-

కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీని పప్పు అని ఎలా ట్రోల్ చేసి..  ఆయన ఇమేజ్ ను తగ్గించారో… ఏపీలో లోకేష్ ను అలాగే వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. ఏడాది కిందటి వరకూ అలాగే  అన్నారు. కానీ ఇప్పుడు వైసీపీ నేతలు కూడా అలా విమర్శలు చేయలేకపోతున్నారు.  లోకేష్ వేష, భాషలు మారిపోయాయి. పాదయాత్రతో ఆయన ప్రజల ముందు తనను తాను ఆవిష్కరించుకున్నారు. పప్పు కాదని నిప్పు అని నిరూపించినట్లుగా అయిందని టీడీపీ వర్గాలంటున్నాయి.  లోకేష్ తన ఇమేజ్‌ను మార్చుకోగలిగారా ?

2023 ప్రారంభంలో   నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు అంటే.. చాలా మంది లైట్ తీసుకున్నారు. ఎందుకంటే అప్పటికి ఆయనకు ఉన్న ఇమేజ్ అలాంటిది.  స్టాన్‌ఫర్డ్‌లో చదువుకుని నీట్‌గాషేవ్ చేసుకుని పాలిటిక్స్ చేస్తే.. పప్పు అనే ముద్ర వేసేందుకు విపక్ష నేతలు పోటీపడ్డారు. ఆ ఇమేజ్ తొలగించుకుంటూ.. తెలుగులో తన ప్రసంగ స్టైల్‌ను పూర్తిగా మార్చుకుని ఒక్కో అడుగు ముందుకు వేస్తూ సాగారు.  పాదయాత్ర ఎప్పుడూ సింపుల్ కాదు.. ఎవరు చేసినా ఆ ఎఫెక్ట్ ను తక్కువ అంచనా వేయలేరు. నేరుగాప్రజలతో మమేకం కావడం కన్నా ఓ రాజకీయ నాయకుడికి మేలు చేసే మరో రాజకీయ కార్యక్రమం ఉండదు. అందుకే స్వాతంత్ర్య పోరాటాల నుంచి పాదయాత్రలు అనేవి ఓ ప్రత్యేకమైన రాజకీయ వ్యూహంగా మారిపోయాయి. లోకేష్ కూడా తన ఇమేజ్ ను మార్చుకుని ప్రజానాయకుడినని నిరూపించుకునేందుకు ఈ మార్గాన్నే ఎంచుకున్నారు.

సాఫీగా వచ్చే ఏ విజయానికైనా జీవిత కాలం తక్కువే. కష్టపడి .. మెట్టు మెట్టుగా ఎక్కి సాధించుకున్న విజయమే స్థిరంగా ఉంటుంది. మానసిక ధైర్యాన్నిస్తుంది. ఆ విజయానికి మనం అర్హులమనే అభిప్రాయాన్ని…నమ్మకాన్ని కలిగిస్తుంది. పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరయ్యి.. వారి అభిమానాన్ని సంపాదించుకుని.. తనపై ఇప్పటి వరకూ ఉన్న అనుమానాలను పటాపంచలు చేసే ప్రయత్నాన్ని లోకేష్ చేశారు.  లోకేష్ సామర్థ్యం.. ప్రతిభ గురించి టీడీపీ నేతలు  గొప్పగా చెబుతారు.  కానీ ప్రజాస్వామ్యంలో గుర్తించాల్సింది ప్రజలు. వారికి లోకేష్ తాను ఎంత సమర్థుడ్నో చూపించాల్సి ఉంటుంది. తాను మంత్రిగా ఉన్నప్పుడు పనితీరు మాత్రమే చూపించారు.. కానీ ఆ పని తీరు రాజకీయంగా ప్లస్ కాదు.. రాజకీయం వేరే. ఇప్పుడు లోకేష్ ఆ రాజకీయంలోనూ తాను దిట్ట నిరూపించునేందుకు పాదయాత్ర చేశారు.

బాగా చదువుకున్నా.. . నిజంగా నాయకుడు అంటే సాఫ్ట్ గా ఉండకూడదన్న ఓ అభిప్రాయం ప్రజల్లో ఉంది. తాను అంత సాఫ్ట్ కాదని నిరూపించేందుకు లోకేష్ ప్రయత్నించారు.  కానీ అది కూడా తనదైన పద్దతిలోనే.  దూకుడుగా మాట్లాడినా..  దౌర్జన్యంగా చేసినట్లుగా అనిపించినా…    తప్పును ఎదుర్కొనే విషయంలో తగ్గనని నిరూపించేలాగానే మారిపోయారు. తాను నీట్ గా షేవ్ చేసుకున్నంత మాత్రాన  చేతకానివాడిని కాదని..  తన వేష, భాషలే కాదు.. మాటలను కూడా మార్చి నిరూపించారు. ఒకప్పుడు చిన్న మాట తడబడితే…  ట్రోల్ చేయడానికి వేల మంది రెడీగా ఉండేవారు. ఇప్పుడు లోకేష్ వారికి అలాంటి  అవకాశం ఇవ్వ లేదు..

నారా లోకేష్ ఇమేజ్ ను.. యువగళం పాదయాత్ర పూర్తిగా మార్చేసింది. కుప్పం నుంచి ప్రారంభమైన యాత్ర సాఫీగా సాగలేదు.  అనేక ఆటంకాలు సృష్టించి…  యువగళానికి  ఓ క్రేజ్ తీసుకు వచ్చారు జగన్ రెడ్డి.  చివరికి మైకులు..   నిలబడేందుకు ఉపయోగించుకునే స్టూల్ కూడా లాగేసుకున్నారు. కానీ యువగళాన్ని మాత్రం నొక్కేయలేకపోయారు. చివరికి చంద్రబాబును అరెస్ట్ చేసి.. ఏదో సాధించామనుకున్నారు..కానీ లోకేష్‌ను నేషనల్ లెవల్‌లో పాపులర్ చేశారు. ఆయన ఢిల్లీలో వ్యవహారాలను ఒంటి చేత్తో చక్కబెట్టగలరన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించారు. ఆయన నాయకత్వ సామర్త్యంపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచారు. ఇప్పుడు లోకేష్..  అన్నింటినీ అధిగమించిన నాయకుడు…  తనపై వందల కోట్లు వెచ్చించి చేసిన తప్పుడు ప్రచారానికి సమాధానాలిచ్చిన నాయకుడు..  వచ్చే ఎన్నికల్లో టీడీపీకి విజయమంటూ లభిస్తే ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి