కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగి..టిడిపిలో గౌరవ ప్రదంగా మెలిగిన ఓ సీనియర్ నేతకు ఇపుడు టెకెట్ దొరకని పరిస్థితిఈసారి తనకే టిక్కెట్ అనే ధీమాలో ఉన్న ఆ పసుపు నేత ఇప్పుడు డైలమాలో పడ్డారట . సొంత పార్టీ కాకపోతే పొత్తులో ఉన్న పార్టీ నుంచైనా పోటీలో నిలవడం గ్యారంటీ అని ఫిక్సైపోయిన ఆ నాయకుడి ఆశలు గల్లంతైపోయాయట . క్యాడర్ ను రంగంలోకి దించి అధిష్టానం పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించినా పెద్దగా వర్కవుట్ కాలేదట . అందుకే నిన్న మొన్నటి వరకూ రోజూ ఏదో ఒక డ్రామాతో పొలిటికల్ స్క్రీన్ పై హడావిడి చేసే ఆయన ఇప్పుడు కనిపించడం మానేశాడట . ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అస్త్రసన్యాసం చేసిన ఆ సీనియర్ పొలిటీషియన్ ఎవరు…లెట్స్ వాచ్ దిస్ స్టోరీ!
కృష్ణాజిల్లా టీడీపీ నేతల్లో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టెన్షన్ పెరిగిపోతోందట. ఈసారి పక్కాగా పోటీచేసేది మేమే అని నిన్న మొన్నటి వరకూ బల్లగుద్ది మరీ చెప్పుకు తిరిగిన నేతలకు సైతం ఈసారి టిక్కెట్ కష్టం అనేలా పరిస్థితులు ఉన్నట్లు జోరుగా చర్చ నడుస్తోందట. దీంతో సీటు గ్యారంటీ అనుకున్న నేతల్లో ఆందోళన కనిపిస్తోదట. తాజాగా అవనిగడ్డ నియోజకవర్గ ఇంఛార్జి మండలి బుద్ధ ప్రసాద్ తీరు చూస్తుంటే క్యాడర్ కు కూడా ఇదే డౌటొస్తోందట. రాజకీయ నేపధ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన బుద్ధ ప్రసాద్ కాంగ్రెస్ లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి…రాష్ట్రవిభజన తర్వాత హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి …సైకిలెక్కేశారు..
ఈ క్రమంలో టీడీపీ తరపున 20014లో పోటీ చేసి బుద్ధప్రసాద్ గెలిచారు. కానీ2019 ఫ్యాన్ సునామీలో వైసీపీ నేత సింహాద్రి రమేష్ బాబు చేతిలో బుద్ధప్రసాద్ చిత్తుగా ఓడిపోయారట.ఐతే 2024లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న బుద్ధప్రసాద్ కు ఇప్పుడు అసలుకే ఎసరొచ్చిందట. టీడీపీ, జనసేన పొత్తు ఉన్నప్పటికీ అవనిగడ్డ విషయంలో మాత్రం తనకే ఫస్ట్ ఛాయిస్ ఇస్తారని మొన్నటి వరకూ బుద్ధప్రసాద్ భావించారు.. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బుద్ధప్రసాద్ ఆశలు సన్నగిల్లిపోతున్నాయి.
కృష్ణాజిల్లాలో జనసేన ఆశించే స్థానాల్లో అవనిగడ్డ కూడా ఒకటి. ఐతే బుద్ధప్రసాద్ తనకున్న పరిచయాలతో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధిగానైనా తనకే అవకాశం వస్తుందని ఆశించారట. అలా కాని పక్షంలో తాను రాజకీయాల్లోంచి తప్పుకుని…తన కుమారుడిని జనసేన పార్టీలో చేర్పించైనా అవనిగడ్డ టిక్కెట్ ను చేజారకుండా చూసుకోవాలని భావించారట. ఐతే ఇంతవరకూ బాగానే ఉంది కానీ మండలి ఆశలపై జనసేన ఆశావాహులు నీళ్లు చల్లేశారు. ప్రస్తుతం అవనిగడ్డ టిక్కెట్ కు కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ దగ్గర్నుంచి చోటా మోటా లీడర్లతో కలుపుకుని ఓ నలుగురైదుగురు ట్రై చేస్తున్నారు..
తమలో ఎవరికోఒకరికి ఇవ్వాలి కానీ టీడీపీలో నుంచి వచ్చే వారికో…టీడీపీలో ఉన్న వారికో టిక్కెట్ ఇవ్వడానికి వీల్లేదని జనసేన నాయకులు పవన్ కు తేల్చిచెప్పేశారట. దీంతో పవన్ కళ్యాణ్ కూడా అవనిగడ్డ టిక్కెట్ జనసేనకు కేటాయించాల్సిందేనని పట్టుదలతో ఉండటంతో చంద్రబాబు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని అంటున్నారు. ఈ పరిణామాలతో ఇప్పుడు మండలి బుద్ధప్రసాద్ డైలమాలో పడ్డారు.. ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత ప్రాధాన్యం అని లోకేష్ చెప్పిన మాటలు విని మొన్నటివరకూ ఏమీలేకపోయినా…ఏదో జరిగిపోయిందన్న సీన్ క్రియేట్ చేసి హడావిడి చేసిన బుద్ధప్రసాద్ ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు.
రోజూ రోడ్డెక్కి ధర్నాలు , దీక్షలు , నిరసనలు అంటూ గోల చేసే బుద్ధప్రసాద్ ఇప్పుడు గుమ్మం దాటడం మానేశారు.. పెళ్లిళ్లు…పుట్టినరోజులు…ఎవరైనా చనిపోతే పలకరింపులు వంటి కార్యక్రమాలకు తప్ప ఏరకమైన పార్టీ కార్యక్రమాల్లోనూ మండలి కనిపించడం లేదు . ఐతే ఇప్పుడు ఇదే అవనిగడ్డ టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. నాయకుడే చేతులెత్తేస్తే ఇక తమ గతేంకానూ అని క్యాడర్ గుసగుసలు ఆడుకుంటున్నారు. ఎలాగూ తనకు టిక్కెట్ రాదని తేలిపోయింది కాబట్టి మండలి పూర్తిగా అస్త్రసన్యాసం చేసేశారని … ఇక టీడీపీ దుకాణం బంద్ అయిపోయినట్లేనన్న టాక్ ఇప్పుడు అవనిగడ్డలో జోరుగా వినిపిస్తోంది .
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…