ఏపీలో భారీ పోలింగ్ – రిజల్ట్ ఇదేనా ?

By KTV Telugu On 15 May, 2024
image

KTV TELUGU :-

ఆంధ్రప్రదేశ్ లో హై వోల్టేజ్  పోలింగ్ జరిగింది. లోక్ సభ ఎన్నికల కన్నా అసెంబ్లీ ఎన్నికలే కీలకం కావడంతో ఆ కోణంలోనే  పోలింగ్ జరిగింది. జాతీయ అంశాలు అసలు చర్చకు రాలేదు. ఎంపీ అభ్యర్థులూ హైలెట్ కాలేదు.  ఉదయం స్మూత్ గా జరిగిన పోలింగ్  మ్ధధ్యాహ్నం సమయంలో ఘర్షణలకు దారి తీసింది. అయినా పోలింగ్ 82 శాతం  వరకూ జరిగినట్లుగా తెలుస్తోంది. యువత, వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్  చేశారు. మరి ఈ ఓటింగ్ ఎవరికి అనుకూలం  ?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ పై నిన్నటి వరకూ చర్చ జరిగిదింది. ఇప్పుడు పోలింగ్ కూడా పూర్తయింది. పోలింగ్ సరళిని విశ్లేషించుకుని మరీ చాలా మంది ఎవరిదో గెలుపు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఏకాభిప్రాయం రావడం లేదు  మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఓట్లు వేశారు కాబట్టి వైసీపీకే విజయం అని కొంత మంది చెబుతున్నారు. కానీ  ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు ఇలాంటి సమీకరణాలు పని  చేయవని.. వృద్ధులు, మహిళలలు వైసీపీకే ఓటేస్తారని ఎలా చెబుతారని.. వైసీపీకి ఎదురుగాలి వీచిందని కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే ఏ వర్గాన్ని ఓ పార్టీకి అంటకట్టేయడం అనేది రాజకీయాల్లో తొందరపాటు అవుతుంది. ఓటు వేయడానికి అనేక ప్రయారిటీలు ఉంటాయి. కులం, మతాన్ని మించిన అంశాలు ఉంటాయి. ముఖ్యంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేయడానికి ఇలాటి అంశాలు ఎన్నో ప్రభావం  చూపిస్తాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది అదే.

ఏపీలో పోలింగ్ ముగియగానే వైసీపీ చీఫ్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. భారీగా పోలింగ్ జరగడం అంటే  ప్రభుత్వ వ్యతిరేకత  ఎక్కువగా ఉండటం వల్లనే అన్న అభిప్రాయాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారు. ఈ సారి అరుదైన సందర్భం పాజిటివ్ ఓటు అని ఆయన చెప్పుకొచ్చారు. అరుదైన సందర్భం అని సజ్జల అన్నప్పుడే.. వైఎస్ఆర్‌సీపీ గెలిస్తే అద్భుతమేనని ఆయన చెప్పినట్లుగా అర్థం చేసుకోవచ్చు. పాజిటివ్ ఓటింగ్ వచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. నిజానికి ప్రభుత్వాలకు పాజిటివ్ ఓటింగ్ అనేది దాదాపుగా అసాధ్యం. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అలాంటి ఫీట్ సాధించింది. ఎందుకంటే.. పుల్వామా ఎటాక్ ను ఉపయోగించుకుని దేశభక్తి సెంటిమెంట్ ను పెంచడం వల్ల సాధ్యమయింది. కానీ  వైసీపీకి అలాంటి సెంటిమెంట్ ఈ సారి కనిపించలేదు. 2019  ఎన్నికల సమయంలో చంద్రబాబు, ఆయన సామాజికవర్గంపై ప్రజల్లో వ్యూహాత్మకంగా వ్యతిరేకత పెంచగలిగారు. కానీ ఈ సారి అలాంటి మామూమెంట్ ను వైసీపీ బిల్డ్ చే్యలేకపోయింది. ప్రజల ఖాతాల్లో డబ్బులేశాం కాబట్టి వారు ఓట్లు వేస్తారని గట్టి నమ్మకం పెట్టుకున్నారు.

అయితే ప్రజలు లేదా  ఓటర్లు కేవలం డబ్బులు తమ ఖాతాల్లో పడ్డాయా లేవా అన్న అంశానికే పరిమితం  అవుతారని అనుకోవడం భ్రమే అవుతుంది. వైసీపీ తన మేనిఫెస్టోనూ కూడా గొప్పగా చెప్పలేదు.  వైసీపీకి మద్దతు పలికేందుకు అంత పరుగులు పెట్టి ఓటర్లు రావడానికి అవసరమయ్యే ఒక్క పాజిటివ్ కారణం  కూడా బలమైనది లేదు.  చివరికి తమ మేనిఫెస్టో అద్భుతమని.. దాన్ని చూసి ఓట్లేస్తారని కూడా చెప్పే పరిస్థితి  వైసీపీలో లేదు. ఎందుకంటే మేనిఫెస్టోలో ఏమీ లేదు. వృద్ధుల పెన్షన్ అయినా పెంచుతామని హామీ ఇవ్వలేదు. చంద్రబాబు తాను  సీఎం అవగానే  నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు. వృద్ధులు అనుకూలంగా మారితే… టీడీపీకే మారాలి కానీ వైసీపీకి కాదన్న అంచనాలు ఉన్నాయి. అందుకే వైసీపీ మేనిఫెస్టోను ఆ పార్టీ కూడా పెద్దగా  ప్రచారం చేసుకోలేకపోయింది.

పోనీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారా అంటే.. కనీసం ఓటు  వేయడానికి వెళ్లే రోడ్లు కూడా దారుణంగా ఉన్నాయి. అత్యున్నత పరిపాలన అందించారా అంటే.. ప్రజలు దాడులు చేస్తారనే భయంతో  పరదాలు కట్టుకుని తిరిగే పరిపాలన చేశారు. పోనీ పథకాల డబ్బులు అయినా ఇచ్చారా అంటే  అదీ లేదన్న విమర్శళు ఉన్నాయి.   గత ఆరు నెలలు ప్రజలకు ఒక్క  రూపాయి కూడా పథకాల డబ్బులు ఇవ్వలేదు. పోలింగ్  ముందు  రోజు ఖాతాల్లో జమ చేస్తామని హడావుడి చేశారు కానీ అది సాధ్యం కాదని ముందే తెలిపోయింది. దాంతో ఓటర్ల ఖాతాల్లో జబ్బులు చేయలేకపోయారు.  నీ ప్రజలకు శాంతిభద్రతలపై భరోసా ఇచ్చారా.. అదీ కూడా లేదు.   అందరికీ ప్రశాంతమైన జీవనం హామీ ఇచ్చారా అంటే.. అదీ లేదు. మహిళల ఓటింగ్ పై ప్రభావం చూపే అనేక అంశాలు ఉంటాయి. ఏ పార్టీకైనా ఏకపక్షంగా ఓట్లు పడతాయని అంచనా వేయడం కష్టమే.

పోలింగ్ సరళిను చూస్తే ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎక్కడా హడావుడి చేయలేకపోయారు. రేసులో ఉన్నామన్న భావన కూడా కల్పించలేకపోయారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు కానీ వెనుకబడిపోయారు. ప్రకాశం, నెల్లూరు  జిల్లాల్లో స్వయంకృతాపరాథంతోనే ఎక్కువ సీట్లు నష్టపోతారన్న అంచనాలు ఉన్నాయి. ఇక రాయలసీమలో మాత్రం సంస్థాగతమైన బలం ఉండటంతో ఎక్కువ సీట్లు వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. అయితే అక్కడ కూడా షర్మిల ఎంత నష్టం చేస్తారోనన్న ఆందోళన ఆ పార్టీలో ఉంది. అంతిమంగా ఈ ఎన్నికల్లో పోలింగ్ సరళి.. వైఎస్ఆర్‌సీపీకి అత్యంత కఠినంగా ఉంటుందని అంచనాకు రావొచ్చు. అంతిమంగా జగన్ పాలన ఉండాలా వద్దా కోణంలోనే ఓటింగ్ జరిగిందని అనుకోవచ్చు.

జాతీయ మీడియా సంస్థలు వేసిన ప్రీపోల్ సర్వేలకు అనుగుమంగానే పోలింగ్ సరళి ఉంది.  ఎగ్జిట్ పోల్స్ చివరి విడత పోలింగ్ తర్వాత వస్తాయి. అప్పటికే మొత్తం ఎనాలసిస్ చేసుకుంటే ఓ క్లారిటీకి రావొచ్చు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి