ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో రోజుకు రెండు సర్వేలు వస్తున్నాయి. మెజార్టీ సర్వేలు టీడీపీ, జనసేన కూటమికి అనుకులంగా ఉన్నాయి. ఒకటి రెండు సర్వేలు వైసీపీకి ఎడ్జ్ ఇస్తున్నాయి. ఐనా సర్వేల మధ్య తేడాలు ఉండటంతో అనుమానాలు పెరుగుతున్నాయి. అసలు ఈ సర్వేలు ఏం చెబుతున్నాయి…
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ పై పడింది. అక్కడ ఎవరు గెలుస్తారన్న చర్చ మొదలైంది. జగన్ పనైపోయింది, ఇక టీడీపీ- వైసీపీ మాత్రమే అధికారానికి వస్తాయన్నది యెల్లో మీడియా సృష్టేనా లేకపోతే అందులో నిజానిజాలు ఉన్నాయా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. దానితో రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవారంతా సర్వేలను ఫాలో అవుతూ తెగ టెన్షన్ పడిపోతున్నారు. అసలు సర్వేల్లో ఏముంది. తాజాగా వచ్చిన సర్వేలు ఏం చెబుతున్నాయని చూసుకుంటే.. ఇటీవల చంద్రబాబును కలిసిన బిహారీ బాబు ప్రశాంత్ కిషోర్ ఒక సర్వే చేశారని ప్రాచారం జరుగుతోంది. ఆయన సర్వే ప్రకారం ఏపీలోని 175 స్థానాల్లో టీడీపీ-జనసేన కూటమికి 143 స్థానాలు దక్కుతాయి. వైసీపీ 32 స్థానాలతో సరిపెట్టుకుంటుంది. ఇక స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ జరిపిన సర్వే ప్రకారం టీడీపీ – జనసేన కూటమికి 90 నుంచి 105 సీట్లు వస్తాయి. వైసీపీకి 67 నుంచి 80 రావచ్చు. జన్మత్ పోల్స్ అనే సంస్థ చేసిన సర్వే ప్రకారం వైసీపీకి 113 నుంచి 115 స్థానాలు దక్కుతాయి. టీడీపీ -జనసేన 50 నుంచి 52 స్థానాలు పొంది మళ్లీ ఓటమిని మూటగట్టుకుంటుంది..
సర్వేల మధ్య తేడానే ప్రశ్నార్థకమవుతుంది. ఎవరికి వారు తమ విశ్వనీయతకు సంబంధించిన ఉదాహరణలిస్తూ తాజా సమాచారం కూడా నిజమేనని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ సర్వేలు వంత శాతం నిజమని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు..
ప్రశాంత్ కిషోర్ సర్వేగా చెబుతున్న దానిలో జిల్లాల వారీగా సమాచారం కూడా ఉంది. అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ వైసీపీకి తక్కువ సీట్లే ప్రశాంత్ కిషోర్ సర్వే చూపించింది. ఒక్క జగన్ సొంత జిల్లాలోని పది స్థానాల్లో మాత్రం వైసీపీకి సగం అంటే ఐదు స్థానాల వరకు వచ్చే వీలుందని తెల్చింది. ఇక స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సర్వే విషయానికి వస్తే ఆ సంస్థ తెలంగాణ ఎన్నికల్లోనూ సర్వే చేసింది. ఎన్నికలకు నెల ముందు చేసిన సర్వే ప్రకారం తెలంగాణలో ఉన్న 119 స్థానాల్లో కాంగ్రెస్ కు 59 నుంచి 67 స్థానాలు వస్తాయని, బీఆర్ఎస్ కు 39 నుంచి 44 స్థానాలు వస్తాయని తేల్చింది. ఆ సంస్థ చెప్పినట్లుగానే కాంగ్రెస్ కు 64, బీఆర్ఎస్ కు 39 సీట్లు వచ్చాయి. ఇక జన్మత్ పోల్స్ కూడా తెలంగాణ ఫలితాలను దాదాపుగా అంచనా వేసింది. ఇవి కాకుండా ఇండియా టీవీ సర్వే అంటూ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. లోక్ సభ ఎన్నికల వరకే సర్వే జరిపింది. దాని ప్రకారం వైసీపీకి 18 లోక్ సభా స్థానాలు, టీడీపీ నేతృత్వ కూటమికి ఏడు స్థానాలు వస్తాయట…
సర్వేలు నిజమేనా అని అనుమానాలు కలగడానికి అనేక కారణాలున్నాయి. రోజుకో సర్వే రావడం, ఒకదానికి మరోకటి పొంతనలేకుండా ఉండటం ప్రధాన కారణమని చెప్పాలి. ప్రతీ రాజకీయ పార్టీ వ్యూహకర్తలు, సర్వే సంస్థలను పెట్టుకుంటున్నాయి. పార్టీలే మైండ్ గేమ్ ఆడుతూ సర్వేల పేరుతో ప్రచారం చేసుకుంటున్నారన్న చర్చ కూడా ఉంది. అందుకే సర్వేలను నమ్మకూడదని, ప్రజా నాడి వేరుగా ఉంటుందని వాదించే వాళ్లూ ఉన్నారు. పైగా ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు గందరగోళంలో ఉన్నాయి. బీజేపీతో మిగతా రెండు పార్టీలు జతకడతాయా లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. జనసేన, టీడీపీ పొత్తులో సీట్ల సర్దుబాటు ఏమవుతుందో అర్థం కావడం లేదు అలాంటప్పుడు సర్వేలపై గందరగోళం ఎందుకన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. పైగా ప్రశాంత్ కిషోర్ సర్వే ఫేక్ అన్న ప్రచారం కూడా మొదలైంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…