తెలుగుదేశం పార్టీలో చింతమనేని ప్రభాకర్ అంటే మాస్ లీడర్. దెందులూరులో వరుసగా గెలుస్తూ వస్తూ అనూహ్యంగా గత ఎన్నికల్లో జగన్ గాలిలో ఓడిపోయారు. తన ఓటమిని ఆయన ఇప్పటికీ ఒప్పుకోరు. తనపై ఎన్ని కేసులు పడినా ఆయన తనదైన శైలిలో రాజకీయం చేస్తూనే ఉంటారు. మరి ఈ సారి పరిస్థితి ఎలా ఉంది ? . ఆయన మళ్లీ గెలిచేలా ప్రజాభిప్రాయాన్ని మార్చుకున్నారా ?
దెందులూరు అంటే.. గోదావరి జిల్లాలతో పాటు ఏపీ మొత్తం స్పెషల్ క్రేజ్ కనిపిస్తుంది. దీనికి కారణం చింతమనేని ప్రభాకర్. అయితే గత ఎన్నికల్లో వైసీపీ వేవ్‌తో.. దెందులూరులో ఎగిరే జెండా రంగు మారిపోయింది. టీడీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ చింతమనేని ప్రభాకర్.. ఫ్యాన్ గాలిని తట్టుకోలేక ఓటమిపాలయ్యారు. ఏలూరు జిల్లాలో హాట్ కేకు లాంటి ఈ సీటులో.. ఈసారి రాజకీయం మరింత కాక రేపుతోంది.
దెందులూరు.. ఏలూరు జిల్లాలోనే కాదు.. ఏపీ మొత్తం తెలిసిన పాపులర్ అసెంబ్లీ సెగ్మెంట్. అందుకు.. ఇక్కడ నడిచే రాజకీయమే కారణం. తెలుగుదేశం నేత చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. దెందులూరు ఎక్కువగా వార్తల్లో ఉండేది. ఇందుకు.. వివాదాలు, విమర్శలు, ఆరోపణలు, సవాళ్లతో.. ఫుల్ హీట్ మీద ఉండేది ఈ సెగ్మెంట్. ఇప్పటికీ.. అదే వాతావరణం ఉన్నా.. రాజకీయంగా కాస్త టెంపరేచర్ తగ్గింది. ఊరమాస్ డైలాగులతో ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తే.. అదే స్థాయిలో తిప్పికొడుతూ.. ముందుకు సాగుతున్నారు వైసీపీ నేతలు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. దెందులూరు రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. ఇక్కడ.. కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలే.. ఎక్కువగా ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ ఉంటారు. ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే.. 14 సార్లు కమ్మ సామాజికవర్గం నేతలే ఎమ్మెల్యేలుగా గెలిచారంటే.. వాళ్ల ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో.. కమ్మ కమ్యూనిటీకి కేరాఫ్ అడ్రస్ దెందులూరు అని చెప్పొచ్చు.
ఏలూరు పట్టణానికి నలువైపులా వ్యాపించి ఉన్న ఈ నియోజకవర్గంలో.. 4 మండలాలున్నాయ్. అవి.. దెందులూరు, పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్. మొత్తం.. 2 లక్షల 20 వేల మందికిపైనే ఓటర్లు ఉన్నారు. ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో.. ఒక్కసారి తప్ప.. మిగతా అన్ని సార్లు కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అయినప్పటికీ.. ఇక్కడ కమ్మ వాళ్ల ఓట్ బ్యాంక్ తక్కువగానే ఉంది. కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్లే.. . ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ సెగ్మెంట్‌ని.. తెలుగుదేశం మార్చారు చింతమనేని ప్రభాకర్. 2009, 2014లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ.. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్‌లో కొఠారు అబ్బయ్య చౌదరిపై చింతమనేని ఓటమిపాలయ్యారు.
కొఠారు రామచంద్రరావు రాజకీయ వారసుడిగా.. విదేశాల్లో స్థిరపడిన అబ్బయ్య చౌదరి ని పిలిపించి.. దెందులూరు బరిలో దించి మరీ గెలిపించారు. పైగా.. ఆయన సీఎం జగన్‌కు సన్నిహితుడు కూడా కావడం కాస్త కలిసొచ్చింది. నియోజకవర్గ ప్రజలతో పాటు యువతను కూడా ఆకట్టుకొని.. దూకుడు మీద ఉన్న చింతమనేని ప్రభాకర్‌కు కళ్లెం వేశారని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో.. కొఠారు అబ్బయ్యకు.. 95 వేల ఓట్లు రాగా.. టీడీపీ నుంచి పోటీ చేసిన చింతమనేనికి.. 78 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకే మళ్లీ టికెట్ దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ తరఫున మళ్లీ పోటీ చేసే అభ్యర్థి.. చింతమనేనే అని పార్టీ శ్రేణులతో పాటు లోకల్ పబ్లిక్ కూడా భావిస్తున్నారు. దాంతో.. రాబోయే ఎన్నికల్లో మరోసారి టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందనే టాక్ నడుస్తోంది. చింతమనేనికి జనంలో మంచి పేరుంది. ఎలాగైనా సరే.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో.. ఈసారి టీడీపీ క్వీన్ స్వీప్ చేయబోతోందని.. 3 ఎంపీ స్థానాలను కూడా గెలవబోతుందని.. చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.
ఇక.. వైసీపీ మాత్రం.. సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. చింతమనేని ప్రభాకర్ మాత్రం.. దెందులూరులో మళ్లీ పసుపు జెండా ఎగరేసేందుకు ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. దాంతో.. నియోజకవర్గంలో ఢీ అంటే ఢీ అనే విధంగా పరిస్థితులు నెలకొన్నాయి. దెందులూరుపై.. మాగంటి బాబు కుటుంబానికి కూడా మంచి పట్టు ఉంది. ప్రస్తుతం ఆయన తెలుగుదేశంనే కొనసాగుతుండటంతో.. నియోజవర్గంలో టీడీపీకి మరింత బలం పెరగింది. ఇప్పటికైతే హోరాహోరీ ఉంది. జనసేనతో పొత్తుతో టీడీపీకి అడ్వాంటేజ్ ఉందని చెప్పుకోవచ్చు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…