ఆ సామాజికవర్గంతో పేర్ని నాని కి చుక్కెదురా

By KTV Telugu On 5 August, 2023
image

KTV Telugu ;-

అందరూ చూపు మచిలీపట్నం పైనే, వివాదాలకు ,విభేదాలకు పెట్టింది పేరు.కృష్ణా జిల్లా నియోజకవర్గాల్లో బందరు హాట్ సీట్లలో ఒకటి. ఇక్కడ బందర్ లడ్డు ఎంత ఫేమస్సో, ఎమ్మెల్యే కూడా అంతే ఫేమస్. వైసీపీ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు, జగన్ మీద ఈగ కూడా వాళ్ళనివ్వని, నేత మాజీ మంత్రి పేర్ని నాని. కానీ ఆయన ఈసారి పోటీ చేస్తారా…? లేక ఆయన కుమారులు పేర్ని కిట్టుని బరిలో దింపుతారా …?కొల్లు రవీంద్ర వచ్చే ఎన్నికల్లో వైసిపిని,ఎలా ఢీ కొట్టబోతున్నారు…?వైసీపీ టీడీపీ హోరాహోరీ పోటీలో విజయం ఎవరిది…?

మచిలీపట్నం రాజకీయం రోజురోజుకీ వేడెక్కుతుంది.ఒకపక్క ఎమ్మెల్యే,గడపగడపకి మన ప్రభుత్వం అంటూ ప్రతి గడుపును టచ్ చేస్తుంటే,మరోపక్క టిడిపి కూడా రకరకాల కార్యక్రమాలతో,బాదుడే బాదుడు, ఇదేం కర్మ మన రాష్ట్రానికి, అంటూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.ఈ రెండు పార్టీలకు దీటుగా జనసేన, బీజేపీ ప్రభావం చూపాలని ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాయి. ప్రస్తుతం మచిలీపట్నం నియోజకవర్గం నుంచి, పేర్ని నాని ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి, కొల్లు రవీంద్ర పై ఘన విజయం సాధించారు.ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం రెండున్నరేళ్లు జగన్ క్యాబినెట్లో, మంత్రిగా పనిచేశారు. వైసీపీలో జగన్ కి అత్యంత సన్నిహితుల్లో ఒకరు పేర్ని.నాని తన కొడుకు రాజకీయ భవితవ్యం సెట్ చేసేందుకు, రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం పేర్ని కిట్టు అనునిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజలతో మమేకమవుతున్నారు. ఇక టిడిపి నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన నుంచి బండి రామకృష్ణ పోటీగా ఉన్నారు. కాని జనసేన టిడిపి పొత్తు కుదిరితే ఒకరు, తమ సీటు త్యాగం చేయక తప్పదు.

సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని,రెండేళ్ల క్రితమే చెప్పారు .ఇక తను రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండగానే తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుకి, బాటలు వేయలనదే ఆయన ప్లాన్.కానీ పేర్ని కిట్టు కి మచిలీపట్నంలో ప్రత్యర్థులను ఎదుర్కునీ గెలవగల సత్తా ఉందా…? జనసేన, టీడీపీ కలిస్తే మళ్లీ పేర్ని నాని ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందా…?

బందరు పోర్టు శంకుస్థాపన సమయంలో,సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే, తాను పోటీ చేయనని తేల్చి చెప్పారు పేర్ని నాని.వచ్చే ఎన్నికల్లో, వారసులకు మాత్రం టికెట్ ఇచ్చేది లేదని, అంతకుముందే సీఎం చెప్పిన సరే,తన మనసులో మాట నేరుగా నిండు సభలో, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు బందరు ఎమ్మెల్యే.దీనికి కారణం తన కుమారుడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేయడం,సీఎం దగ్గర నానికి మంచి పలుకుబడి ఉండటమే, కారణమని చెబుతున్నారు విశ్లేషకులు. అధికార పార్టీ రాజకీయాలు ఇలా ఉంటే. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం ఈసారి బందర్ సీటు మాదే ,ప్రభుత్వం మాదే అని భీమా వ్యక్తం చేస్తున్నారు.ఇక బందర్ టిడిపిలో గ్రూపులు లేకపోవడం కూడా కొల్లు రవీంద్ర కి కలిసి వచ్చే అవకాశం అని చెబుతున్నారు. గత ఎన్నికల్లో జనసేన కాపు సామాజిక వర్గం ఓట్లను చేల్చడం వలన,రవీంద్ర ఓడిపోయారని భావనలో ఉంది టిడిపి. ఈసారి పొత్తు కుదుర్చుకొని,చిత్తు చేస్తామని చెబుతోంది. దీనికి తోడుగా ప్రతినిత్యం క్యాడర్ కి అందుబాటులో ఉంటున్నారు కొల్లు రవీంద్ర. గతంతో పోల్చుకుంటే,కొల్లు రవీంద్ర ,ఇప్పుడు మాస్ లీటర్ గా కనిపిస్తున్నారు. బీసీ వర్గానికి నాయకత్వం వహిస్తున్న రవీంద్ర పైన, హత్యాయత్నం కేసు పెట్టి, జైలుకు పంపడం అటు బందరు ప్రజలు, ముఖ్యంగా టిడిపి క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారు.ఒకవేళ పేర్ని కిట్టు పోటీ చేస్తే మాత్రం రవీంద్ర అనుభవంతో గెలిచేయోచ్చు అంటున్నారు విశ్లేషకులు.మత్స్యకార వర్గానికి సంబంధించిన కొల్లు రవీంద్రకు ఆ వర్గం ఓట్లు అదనపు బలంగా చెప్పుకోవచ్చు.ఇక జనసేన, టిడిపి పొత్తు దాదాపుగా ఖరారు అయినట్లే అని చెప్పవచ్చు.ప్రతిసారి సందర్భం లేకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నీ విమర్శించడం ,కాపు సామాజిక వర్గం కూడా పేర్నికి వ్యతిరేకంగా ఉండటం కొల్లు రవీంద్ర కి శుభ పరిణామం. కానీ, కొంతకాలంగా మాజీ ఎంపీ కొనకల్ల నారాయణ వర్గానికి, కొల్లు రవీంద్ర వర్గానికి విభేదాలు ఉన్నమాట వాస్తవమే ఇవి ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర, కొనకళ్ళ వర్గానికి విభేదాలు తొలగిపోతాయా…? టిడిపి,జనసేన పొత్తుతో కాపు సామాజిక వర్గం రవీంద్రకు సపోర్ట్ చేస్తారా…? రవీంద్రా అనుభవం ముందు పేర్ని నాని కుమారుడు పేరుని కిట్టు నిలబడగలనా…?

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..