ముగ్గురు ఐపీఎస్‌లపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు

By KTV Telugu On 17 September, 2024
image

KTV TELUGU :-

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో పోలీసు అధికారులపై వేటు పడింది. ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీని సస్పెండ్ చేసింది సర్కార్. ఇప్పటికే ఇబ్రహీంపట్నం సీఐ ముత్యాల సత్యనారాయణ, అప్పటి విజయవాడ వెస్ట్ ఏసీపీగా పని చేసిన హనుమంతరావుపై సస్పెన్షన్ విధిస్తూ డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు.

జెత్వానీ కేసులో ఏపీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఎస్ హెచ్ఓగా పని చేసిన ముత్యాల సత్యనారాయణ, విజయవాడ వెస్ట్ ఏసీపీని సస్పెండ్ చేస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

అయితే పాత్రధారులు, సూత్రధారులను వదిలేసి మాపై వేటు వేయడం ఏంటని కిందస్థాయి సిబ్బంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నటి కేసులో పూర్తి స్థాయి విచారణ చేసిన విజయవాడ పోలీసులు.. దీనికి సంబంధించిన నివేదికను డీజీపీకి ఇచ్చారు. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదికను ఇచ్చారు డీజీపీ. అనంతరం ఏపీ డీజీపీ ద్వారకాతిరుమలరావుతో డిస్కస్ చేసింది ప్రభుత్వం. అనంతరం ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటు వేసింది. జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ గా పని చేసిన కాంతిరాణా టాటా, డీసీపీగా పని చేసిన విశాల్ గున్నిలపై వేటు పడింది.

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరీ జత్వానీ కేసుకు సంబంధించి ప్రభుత్వం ఆదివారం ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటు వేసింది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని డీజీపీ సస్పెండ్ చేశారు. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఏపీ ప్రభుత్వం వేటు వేసింది. ముంబై నటి జెత్వానీ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ PSR ఆంజనేయులు (PSR Anjaneyulu), విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా టాటా (Kanti Rana), ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీపై (Vishal Gunni) సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఫైల్‌పై సీఎం చంద్రబాబు తాజాగా సంతకం చేశారు. ఈ మేరకు జీవో నెంబర్లు 1590, 1591, 1592 విడుదల చేశారు. డీజీపీ నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు వేశారు. కాగా, ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను డీజీపీ సస్పెండ్ చేశారు.

వైసీపీ హయాంలో ముంబయి నటి కాదంబరీ జత్వానీని తప్పుడు కేసులో అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేశారని ముగ్గురు ఐపీఎస్ అధికారులపై అభియోగాలున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఓసారి విజయవాడ వచ్చి వెళ్లిన కాదంబరీ ఇటీవలే మరోసారి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని.. వైసీపీ నేత విద్యాసాగర్‌తో పాటు ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నిలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏకంగా ఐపీఎస్ అధికారులపైనే తీవ్రస్థాయిలో ఆరోపణలు రావడంతో డీజీపీ ద్వారకా తిరుమలరావు దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. ఆయన ఆదేశాలతో విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు.. ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో కాదంబరీ జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులపై నమోదైన కేసు ఫైళ్లను పరిశీలించారు. కేసు నమోదు, దర్యాప్తులో అనేక లోపాలున్నట్లు గుర్తించారు. దీనిపై నివేదికను డీజీపీకి సమర్పించారు. ఈ క్రమంలో ముగ్గురు ఐపీఎస్‌లపైనా తాజాగా వేటు పడింది.

వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌తో పోలీసులే తప్పుడు ఫిర్యాదు ఇప్పించారని ముంబై నటి కాదంబరీ జత్వానీ పోలీసులకు తెలిపారు. అప్పటికప్పుడు కేసు నమోదు చేసి తనతో పాటు తన తల్లిదండ్రులను కూడా ముంబైలో అరెస్ట్ చేశారన్నారు. దీని వెనుక కుట్ర కోణం ఉందని అన్నారు. దీనిపై విచారించి న్యాయం చేయాలని కోరారు. అంతకు ముందు సోషల్ మీడియాలో ఆమె ఓ వీడియో విడుదల చేశారు.

మొత్తంగా ముంబై నటికి వేధింపుల కేసును సీరియస్ గా తీసుకుంది చంద్రబాబు సర్కార్. ఇందులో బాధ్యులపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ముందు ముందు ఇంకా ఎవరెవరిపై చర్యలు ఉంటాయో అనే టెన్షన్ పోలీసు అధికారుల్లో నెలకొంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి