నాగబాబుకు కీలక పదవి – టీడీపీ రాజ్యసభ సభ్యుల ఖరారు

By KTV Telugu On 30 September, 2024
image

KTV TELUGU :-

ఏపీ నుంచి రాజ్యసభకు ముగ్గురు ఎంపిక కానున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ సభ్యులు ముగ్గురు రాజీనామా చేసారు. అసెంబ్లీలో ఉన్న సంఖ్య బలం ఆధారంగా మూడు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. ఆ ముగ్గురి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే దాని పైన ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి జనసేన..రెండు టీడీపీకి దక్కనున్నాయి.

ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం తరువాత వరుసగా ఆ పార్టీ నేతలు రాజీనామా చేస్తున్నారు. అటు రాజ్యసభలో..ఇటు మండలిలో కూటమి సభ్యుల సంఖ్యా బలం తక్కవగా ఉండటంతో ప్రస్తుతం ఈ రెండు సభల్లోని వైసీపీ సభ్యుల పైన ఫోకస్ చేసారు. అందులో భాగంగా రాజ్యసభ సభ్యులు ఆర్ క్రిష్ణయ్య, బీదా మస్తాన రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసారు. మరో ఎంపీ సైతం త్వరలో రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతోంది.

ఈ మగ్గురూ బీసీ వర్గానికి చెందిన వారే. అయితే, తిరిగి నియామకం పైన మాత్రం చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒక స్థానం జనసేనకు ఖాయమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మెగా బ్రదర్ నాగబాబుకు ఈ సీటు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. తాజాగా జరిగిన ఎన్నికల్లో నాగబాబును తొలుత అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని భావించారు. ఆ స్థానం బీజేపీకి దక్కటంతో నాగబాబు పోటీ నుంచి తప్పుకున్నారు. నాటి ఒప్పందంలో భాగంగా నాగబాబుకు ఇప్పుడు రాజ్యసభ ఖాయంగా కనిపిస్తోంది.

ఇక, టీడీపీ నుంచి పలువురు రాజ్యసభ సీట్ల కోసం పోటీ పడుతున్నారు. టీడీపీకి రెండు స్థానాలు దక్కితే మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పేరు ఒక స్థానానికి ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో అదే వర్గానికి చెందిన మాజీ ఎంపీలు కంభంపాటి రామ్మోహన్ రావు, కనకమేడల రవీంద్ర సైతం రేసులో ఉన్నారు. అయితే, మంత్రివర్గం లో అవకాశం దక్కని క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పేరు సైతం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగో స్థానం కూడా భర్తీ చేయాల్సి వస్తే ఎస్సీ వర్గానికి ఇస్తారని సమాచారం.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి