ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది నగరిలో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయాల్లో శజమే,నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం కూడా సహజమే. కానీ అక్కడ ఉండి వైసిపి ఫైర్ బ్రాండ్,ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖా మంత్రి, RK రోజా మైక్ పట్టుకుంటే చాలు,ఎదుట ఎవరున్నా సరే,మాటల్లోని వాడి వేడి మామూలుగా ఉండదు. ఇలాంటి ఫైర్ బ్రాండ్ నీ ఆపగల బాబు సిద్ధం చేసిన అస్త్రం ఎవరు…? బాబు ప్రయోగించే ఆ మిస్సైల్ వైసీపీ ఫైర్ బ్రాండ్ నీ ఆపగలరా…?
రోజా పేరు చెప్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో బహుశా తెలియని వారు ఉండరేమో…! 2014 లో వైసీపీ తరఫున నగరి నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గాలి ముద్దు కృష్ణమ నాయుడు 858 ఓట్లతో ఓడించారు. గత ఎన్నికల్లోనూ మరొకసారి గెలిచి జగన్ కేబినెట్ లో స్థానం సంపాదించుకున్నారు.నగరిలో ఎలాగైనా రాజాని ఓడించాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది.తనపై,పార్టీ పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న రోజాకి చెక్ పెట్టాలని బాబు పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు.నగరి నియోజక వర్గం 1962 లో ఏర్పడింది. ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగగా మొదటి సారి, స్వాతంత్ర అభ్యర్థి, దొమ్మరజు గోపాల రాజు గెలిచారు.తర్వాత అది టీడీపీ కంచు కోట గా మారింది 2014లో మొదటిగా వైసీపీ అభ్యర్థి RK రోజా గెలిచారు. అప్పటి నుంచి ఆమె నగరిలోనే కాదు,రాష్ట్రంలోనే బలమైన నాయకురాలి గా ఎదిగారు.నియోజకవర్గంలో నింద్ర,విజయపురం,నగరి, పుత్తూరు,వడమాలపేట మండలాలు ఉన్నాయి.ప్రస్తుతం నియోజకవర్గం లో గాలి ముద్దు కృష్ణమ నాయుడు తనయుడు,భాను ప్రకాష్ విస్తృతంగా పర్యటిస్తున్నారు.అతని తో పాటు మరో వర్గంగా ముద్దు కృష్ణమ నాయుడు పెద్ద కుమారుడు,జగదీష్ ప్రకాష్ కూడా పర్యటిస్తున్నారు.అయితే వీరిద్దరిలో టికెట్ ఎవరికిస్తారా..? అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.కొంత మేర ఇది వైసీపీ కి కలిసొచ్చే అవకాశం ఉంది.
టీడీపి లో సొంత కుటుంబ సభ్యుల మధ్య వర్గపోరు ఉన్న మాట,వాస్తవమే కాని,వైసీపీ లో కూడా వర్గ పోరు ఉండటం వల్ల ఈ సారి అక్కడ వైసీపీ ఓటమి తధ్యం అంటున్నాయి కొన్ని రాజకీయ వర్గాలు. రాజా గెలుపుకు సొంత పార్టీ నేతలే బ్రేకులు వేయాలన్న చూస్తున్నారట.అసలు రెండు సార్లు గెలిచి,ప్రస్తుతం మంత్రి గా ఉన్న రోజా ఓటమి తప్పదా…?
నగరి నియజకవర్గంలో భూగర్భ జలాలు కలుషితం కావడం తో,కిడ్నీ సమస్యలు తీవ్రతరం కాగా,మంచి నీరు అందించడానికి , చెంగా రెడ్డి మంత్రి గా ఉన్న సమయంలో, ఈటీపీ ప్లాంట్లు మంజూరు చేయించిన,ఈ పనులు ఏ ఎమ్మెల్యే కూడా పూర్తి చేయలేదు.అయితే రోజా మాత్రం తన సొంత నిధులతో,వాటర్ ప్లాంటు నిర్మించి,ప్రజలకు మంచి నీరు అందించారు.దీనివల్ల ప్రజల్లో కొంత మేర మంచి పేరు వచ్చినా, మంత్రి గా ఉంది కూడా నియోజక వర్గానికి చేసింది ఏమి లేదని,ప్రజలకు అందు బాటులో ఉండరనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అసలు నియోజకవర్గంలో
సొంత పార్టీ నేతలకు కూడా అందుబాటులో ఉండరని మరి కొన్ని వర్గాల మాట.ఇక దీంతో నగరిలో పార్టీ రెండు వర్గాలు గా ఏర్పడిందట.వచ్చే ఎన్నికల్లో రోజా కి టికెట్ ఇస్తే, సహించేది లేదని,కుండ బద్దలు కొట్టినట్లు చెప్తున్నారని టాక్ నడుస్తుంది. ఇదిలా ఉంటే,ఆ జిల్లాకి సంబంధించిన మంత్రి,వైసీపీ లో కీలకంగా ఉన్న పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి,రోజాకి వ్యతిరేకంగా పావులు కడుపుతున్నారని,రోజా కూడా చాలా సార్లు అసహనం వ్యక్తం చేశారట.ఇక ఇప్పటి వరకు చేసిన అన్ని సర్వేల్లో టీడీపీ అభ్యర్థి భాను ప్రకాష్ రెడ్డి కి కనీసం 10 వేల ఓట్ల మెజారిటీ వస్తుందని వెల్లడించాయి.పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల సమయానికి ఇంకెలా ఉంటుందని ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్ర ఎన్నికలకు ఇంకా సమయమున్నా సర్వేలు,లెక్కలు,మెజారిటీ అన్ని ఇప్పటికే మొదలయ్యాయి.నగరిలో రోజా ఓటమి తప్పదా…? భాను ప్రకాష్ గ్రౌండ్ వర్క్ ఏ రేంజ్ లో ఉంది…? నగరిలో గాలి బ్రదర్స్ పార్టీ కోసం కలిసి పని చేస్తారా…? నగరి వైసీపీ లో వర్గపోరు వల్ల పార్టీ కి నష్టం జరుగుతుందా…? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే 2024 ఎన్నికల వరకు ఎదురు చూడాల్సిందే…!
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..