ఎన్నోళ్లో వేచిన ఉదయం రానే వచ్చింది. యువనేత నారా లోకేష్ చొవరతో టీడీపీ విజయ భేరీ మోగించింది. ఏపీ అంతటా కూటమి విజయభేరీ మోగిస్తుండగా… మంగళగిరిలో లోకేష్ ప్రభంజనం సృష్టించారు. చెమటోడ్చి, అహర్నిశలు శ్రమించి, పాదయాత్ర చేసిన లోకేష్ ప్రజలకు చేరువయ్యారు.
39 ఏళ్ల తరువాత మళ్లీ మంగళగిరి నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. మంగళగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నారా లోకేష్ భారీ మెజారిటీతో గెలిచారు. టిడిపి ఆవిర్భావం తరువాత 1983, 1985 సంవత్సరాలలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గెలిచారు. అప్పటి నుంచీ మంగళగిరి నియోజకవర్గం పొత్తులతో కొన్నాళ్లు, పట్టు చిక్కక కొన్నాళ్లు అందని నియోజకవర్గం అయ్యింది. ఈ సారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందుగా ప్రకటించినట్టుగానే మంగళగిరి నియోజకవర్గాన్ని కైవసం చేసుకుని మాట నిలబెట్టుకున్నారు. యువనేత నారా లోకేష్ ని చేనేతలు అక్కున చేర్చుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో చేనేతల జనాభా అత్యధికంగా ఉంది. చేనేతవర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల వంటి వారు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా, ఏనాడూ చేనేతల సంక్షేమం కోసం ఆలోచించలేదు. వాళ్ల వ్యక్తిగత ఆస్తులు పెరిగాయి. మంగళగిరి చేనేతల బతుకుచిత్రం మాత్రం మారలేదు. 2019లో మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన నారా లోకేష్.. నేతన్నకు చేయూత అందిస్తూ వచ్చారు. పేదచేనేతలకు మగ్గాలు ఉచితంగా అందజేశారు. స్త్రీశక్తి పథకం ద్వారా చేనేత మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇప్పించి..కుట్టు మిషన్లు అందజేసి స్వయం ఉపాధి కల్పించారు. టాటా తనేరియా సహకారంతో మంగళగిరి చేనేత వస్త్రాలకు మంచి ధరలు అందించడంతోపాటు, దేశవ్యాప్తంగా బ్రాండింగ్ కల్పించేందుకు కృషి చేశారు. చేనేతలను దత్తత తీసుకుంటానని ప్రకటించాడు. మంగళగిరితోపాటు రాష్ట్రంలో చేనేతలను ఆదుకునేందుకు స్పష్టమైన ప్రణాళిక ప్రకటించాడు. టిడిపి,బీజేపీ,జనసేన కూటమి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి పట్టువస్త్రాన్ని బహూకరించి మంగళగిరి చేనేతకు దేశవ్యాప్త ప్రచారం కల్పించారు.
మెత్తగా ఉన్నాడు..వత్తేద్దామనుకుంటే పొరపాటేనని లోకేష్ నిరూపించారు. రాటుదేలిన నాయకుడిగా పేరు పొందారు. తను ఒక నియోజకవర్గం నేతగా కాకుండా రాష్ట్రం మొత్తం గురించి ఆలోచించారు. తన పాదయాత్రతో ఏపీ ప్రజల నిజమైన సమస్యను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి బాటలు వేశారు.
నారా లోకేష్ కుర్రాడు.. స్టాన్ ఫోర్డులో చదివాడు.. ఆయనకు ఏపీతో సంబంధం లేదనుకుని నాటకాలాడిన వైసీపీకి గట్టి షాకే ఇచ్చారు. కుట్రలు, కుతంత్రాలు, తప్పుడు కేసులు-దాడులకి ఎదురొడ్డి నిలిచిన నారా లోకేష్ అభిమన్యుడు కాదని, అర్జునుడు అని అర్థమైంది. క్రియాశీల రాజకీయాల్లో లోకేష్ ప్రవేశించిన నుంచీ.. అవినీతి ఆరోపణల్లేవు, ఇతరత్రా కేసులు ఏవీ లేవు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 22 తప్పుడు కేసులు బనాయించారు. అయినా ఆయన ఎక్కడా వెనుకంజవేయలేదు. యువగళం పాదయాత్ర ఆరంభం నుంచీ అడ్డుకునేందుకు వైసీపీ సర్కారు చేయని ప్రయత్నంలేదు. భద్రత కుదించారు. ఉన్న పోలీసులు మైకు, స్టూలు లాక్కోవడం, మాట్లాడటానికి వీల్లేదని నోటీసులు ఇవ్వడం, కేసులు బనాయించడం చేశారు. మొదట్లోనే సాగనిస్తే పాదయాత్ర..సాగనివ్వకుంటే దండయాత్ర అంటూ ప్రకటించిన నారా లోకేష్ ముందుకు సాగారు. ఓ వైపు తనపై కేసులు, మరోవైపు తండ్రి అక్రమ అరెస్టు, ఇంకో వైపు టీడీపీ నేతలు-కార్యకర్తలపై తప్పుడు కేసులు.. న్యాయపోరాటాన్ని నమ్ముకున్నాడు లోకేష్. ఢిల్లీలో మకాం వేసి న్యాయకోవిదులతో చర్చలు, మరోవైపు కేంద్రంతో అప్పుడే పొత్తు ఎత్తులు ముగించి వచ్చాడు. తాత ధైర్యం, తండ్రి దార్శనికత, మేనమామ దూకుడు కలగలిసిన నారా లోకేష్ జగన్ రాజకీయ పద్మవ్యూహాన్ని ఛేదించిన సవ్యసాచిగా సెటిలయ్యారు. టీడీపీ కార్యకర్తల బాగోగులు చూసుకునే బాధ్యత లోకేష్‌కి అప్పగిస్తున్నామని 2014 మహానాడులో అధినేత చంద్రబాబు ప్రకటించారు. నాటి నుంచి నేటివరకూ కార్యకర్తల పెన్నిధిగా వ్యవహరిస్తున్న లోకేష్ సంక్షేమనిధితో ఆదుకుంటున్నారు. ఇప్పటివరకు 1500 మందికి పైగా కార్యకర్తల పిల్లల చదువులకు సహాయం చేశారు. వివిధ ప్రమాదాల్లో మరణించిన సుమారు 5000 మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు బీమా అందచేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మంది కార్యకర్తలకు వైద్య సహాయం అందించారు. సుమారు 2000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. సుమారు 5000 మంది కార్యకర్తల కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలిచి ఆర్థిక సహాయం చేశారు. ఎన్టీఆర్ మోడల్ స్కూళ్ల ద్వారా ఉచిత విద్య, ఉపకారవేతనాలు, ప్రైవేట్ స్కూళ్లలోనూ ఫీజుల్లో రాయితీలు, చదువు పూర్తయిన వారికి ఉపాధి..ఉద్యోగావకాశాలు సాధించేలా నైపుణ్యశిక్షణ ఇస్తున్నారు.
వైసీపీని ధైర్యంగా ఎదుర్కొన్న నాయకుడు నారా లోకేష్ అని చెప్పాల్సిందే. 2019లో ఓడిపోయిన తర్వాత ఆయన ఒక్క నిమిషం కూడా విశ్రమించలేదు. ప్రతీ నిమిషాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు మంగళగిరిలో గెలిచే వరకు ఆయన నిద్రపోలేదు. అదే నారా లోకేష్ ప్రత్యేకత అని చెప్పాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…