చంద్రబాబు విశ్రాంతి ఎరుగని ప్రజా పాలకుడు. ప్రజలే దైవంగా భావించే ఎన్టీయార్ పార్టీని మూడు దశాబ్దాలుగా నడిపిస్తున్న ఆయన ఎన్నడూ విశ్రమించిన పాపాన పోలేదు. పని పని పని.. ఆయనకు తెలిసిన మొదటి మూడు సూత్రాలు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన నిద్రాహారాలు మానేసి పనిచేస్తారు. సమస్య ఎక్కడుంటే ఆయన అక్కడ వాలిపోతారు. తాను విశ్రాంతి తీసుకోరు, అధికారులను విశ్రాంతి తీసుకోనివ్వరు. ఎవరైనా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఆయన చండశాసనుడైపోతారు. నిన్న హుద్ హుద్ అయినా, నేటి విజయవాడ విలయమైనా చంద్రబాబు సకాలంలో స్పందించారు. బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఒక్కరితో మాట్లాడి…ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన సాయాన్ని ఆయన ఏర్పాటు చేస్తున్నారు.
రాష్ట్రంపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపించి.. వరదలతో ముంచెత్తితే చంద్రబాబు వెంటనే స్పందించారు. వరద ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం తెల్లవారుఝామున మూడున్నర వరకు పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకుని వాళ్లను గట్టునపడేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. అలా హెలికాప్టర్లో తిరిగి పోయే బ్యాచ్ కు భిన్నంగా చంద్రబాబు నీటిలో నానుతూ, ఇంటింటికి తిరుగుతూ ప్రతీ ఒక్కరినీ పలుకరించారు. ఎవరికి ఏమీ కావాలో తెలుసుకుని ఏర్పాట్లు చేశారు. బాధితులను దగ్గరుండీ సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఆహారం, నీరు అందించే ఏర్పాటు చేశారు. కేవలం రెండు గంటలు విశ్రాంతి తీసుకుని మళ్లీ విజయవాడ వరద ప్రాంతాల్లోకి వచ్చేశారు. ఒక సారి పడవలో, మరో సారి వరద నీటిలో కాలి నడకన వెళుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.
చంద్రబాబు ఆదివారం రాత్రంతా జాగారం చేశారు. విజయవాడ పరిసరప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోవడంతో ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని సీఎం ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ప్రతి రెండు గంటలకు టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. అదేవిధంగా మీడియాను సైతం నిద్రపోనివ్వకుండా.. పదే పదే వారి నుంచి కూడా సమాచారం సేకరించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోనే సీఎం ఉన్నారు. అక్కడి నుంచే విజయవాడ పరిస్థితిని ఆయన గంట గంటకూ సమీక్షించారు. బాధితులకు ఆహారం , తాగునీరు అందించే బాధ్యతలను విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీకి అప్పగించారు.
ఇదేసమయంలో మంత్రులు ఎక్కడున్నా తక్షణమే విజయవాడకు రావాలని ఆదేశించారు. ఆకలితో అలమటిస్తున్నవారిని ఎంత రాత్రయినా కూడా ఆదుకోవాలని.. వారికి పులిహోర, పెరుగన్నం తక్షణం అందించాలని అన్ని ప్రైవేటు హోటళ్లను చంద్రబాబు ఆదేశించారు. అదేసమయంలో 5 లక్షల వాటర్ బాటిళ్లను తక్షణం బాధిత ప్రాంతాలకు తరలించాలని కూడా చంద్రబాబు సూచించారు. ఈ బాధ్యతలను కూడా పార్టీ నాయకులు, మంత్రులు తీసుకోవాలన్నారు. ఎక్కడా అలసత్వం చేస్తే.. సహించేది లేదన్నారు. రాత్రి పూట కూడా.. మరో సారి సింగ్ నగర్ ప్రాంతంలో వరదలో చిక్కుకున్నవారిని పరామర్శించారు.నేను పని చేస్తాను. నాతో ఉండాలంటే మీరు కూడా పనిచేయాలన్నది చంద్రబాబు ఫిలాసఫీ.
చంద్రబాబు కష్టపడి పైకి వచ్చిన నాయకుడు. ఒక సామాన్యుడిగా ఎదిగిన ఆయనకు పామరుల సమస్యలు బాగానే తెలుసు. అందుకే రాత్రనక, పగలనకా వారి సమస్యలు పరిష్కరించేందుకే ప్రాధాన్యమిస్తారు. సాధారణంగా వరదల్లో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన బయటకు వచ్చేవారు కాదు. పరిస్థితి విషమిస్తే హెలికాప్టర్ ఎక్కి ఏరియల్ సర్వే చేసేవారు. ఇక తప్పడు అనుకుంటే కొంత మందిని తన దగ్గరకే రప్పించుకుని మాట్లాడి వీపు నిమిరి పంపించేసేవారు. జగన్ కు ప్రజల కంటే ప్రోటోకాల్ మాత్రమే ముఖ్యమని చెప్పుకునేవారు. చంద్రబాబు అలా కాదు. చాలా డిఫరెంట్. ప్రజలే ఆయనకు ప్రోటోకాల్. సహాయ చర్యలు పకడ్బందీగా జరగాలన్నదే ఆయన విధానం. అందుకే ఆయన్ను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సీఈఓ అని.. ఒకే ఒక్కడు అని పిలుస్తున్నారు..
https://www.youtube.com/watch?v=Y3V8TcoFyx4
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…