పవన్ కల్యాణ్ చెప్పింది చేస్తారు.. చేసేదే చెబుతారు అని ఆయన అభిమానులు తరచూ అంటుంటారు. సహేతుకమైన, ఆచరణ సాధ్యమైన అంశాలు మాత్రమే ఆయన నోటి నుంచి వస్తాయి. తిరుపతి లడ్డూ వ్యవహారంలో కూడా పవన్ కల్యాణ్ ఆవేశంగా మాట్లాడినట్లు కనిపించరు.సాధ్యమనుకున్న మాటలే చెప్పారు. తిరుమలను అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా పరిగణించే పవన్ లడ్డూ వివాదం మొదలైన వెంటనే 11 రోజుల దీక్ష చేశారు. తన దీక్షపై విమర్శలు చేసిన వారికి ఆయన చేతలతోనే సమాధానం చెప్పారు. దేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు సరైన వ్యవస్థ రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపట్టిన సందర్భంగా… విజయవాడ దుర్గమ్మ మెట్లను శుభ్రం చేసి నిరసన తెలిపారు.దీక్ష విరమించే దిశగా పవన్ తిరుమల వెళ్లారు.తన వెంట రెండో కుమార్తె అంజని కూడా వెళ్లారు.ఆమె తల్లి క్రిస్టియన్ కావడంతో అంజని డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చింది. టీటీడీ అధికారులు ఇచ్చిన డిక్లరేషన్ పత్రంపై కుమార్తె బదులు పవన్ సంతకం చేశారు. మైనర్ కావడంతో ఆమె తరుపున పవన్ డిక్లరేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది.సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబు లడ్డూ వివాదం వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో వైసీపీ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.సరిగ్గా ఇదే సమయంలోపవన్ కుమార్తె తరఫున డిక్లరేషన్ ఇచ్చారు. సీఎంగా చేసిన క్రైస్తవుడు జగన్ డిక్లరేషన్ ఇచ్చేందుకు వెనుకాడారు. తిరుమల పర్యటననే మానుకున్నారు. పవన్ మాత్రం తాను హిందువు అయినప్పటికీ డిక్లరేషన్ ఇచ్చారు. తన భార్య క్రిస్టియన్ అయినా తాను హిందువునని చెప్పి.. ఆ క్రమంలో తన కుమార్తె హిందువే అవుతుందని పవన్ వాదించే అవకాశం ఉంది. ఐనా విమర్శలకు అవకాశం ఇవ్వకుండా పవన్ తిరుమల వచ్చిందే తడవుగా డిక్లరేషన్ ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు. నాయకుడంటే ఎలా ఉండాలో కూడా పవన్ చెప్పినట్లయ్యింది. మోకాలు నొప్పితో ఆరోగ్యం సహకరించకపోయినా పవన్ కల్యాణ్ కాలినడకన తిరుమల వచ్చారు. దాదాపుగా అనుకున్న సమయానికే ఆయన తిరుమల చేరుకున్నారు. ముందుగా నిర్ణయించిన సమయానికి ఆయన దర్శనానికి వెళ్లారు. తిరుమల కొండపై ప్రతీ ఒక్కరూ హిందూ ధర్మ నిబంధనలు పాటించాల్సిందేనని పవన్ చెప్పకనే చెప్పినట్లయ్యింది. పవన్ ను చూసిన తర్వాత ఎవరూ ఆయనపై విమర్శలు చేయరు. ఏడుకొండలు ఎక్కిన అన్యమతస్తులు హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ కిమ్మనకుండా డిక్లరేషన్ ఇస్తారు. అలా చేయకపోతే వారిదే తప్పు అవుతుంది తప్ప…సమాజానిది కాదని గుర్తించాలి. ఒక దెబ్బకు వైసీపీ వారి గొంతులో కూడా పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…