ప్రతీ పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. మగవారి కష్టంలో మహిళలు పాలు పంచుకుంటుంటే.. ఆ సక్సెస్ వచ్చే తీరు వేరుగానూ, వేగంగానూ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతోంది. భర్తల కోసం భార్యలు ప్రచారానికి దిగుతున్నారు. ఎంత కష్టాన్నైనా భరించేందుకు సిద్ధమవుతున్నారు….
మెర్క్యురీ పెరుగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వేసవిలో వచ్చిన ఎన్నికలు నేతలకు, కార్యకర్తలకు ఇబ్బందిగా మారాయి. ఐనా సరే ఎన్నికల స్ఫూర్తిని, పండుగ వాతావరణాన్ని ఎవరూ వదులుకునేందుకు సిద్ధంగా లేరు. విజయ తీరాల వరకు చేరాల్సిందేనని భీష్మించుకుని ప్రచారంలోకి దిగుతున్నారు. పోటీదారులు, అగ్రనేతల ప్రచారం ఒక వంతు అయితే ఇప్పుడు వారి ఇంటి మేడమ్స్ రంగంలోకి దిగడం మరోవంతు . మా ఆయనకు ఓటెయ్యండి..మీకు మంచి జరిగే బాధ్యత నాదీ అని వాళ్లు జనంలోకి వచ్చేస్తున్నారు. నలుగురైదుగురు వీఐపీ మహిళలు ఇప్పుడు ఎండను సైతం లెక్కచేయకుండా ప్రచారంలో కనిపిస్తున్నారు..
ఏపీలో దిగ్గజ నేతలకు ఇప్పుడు పని భారం తగ్గుతోంది. వారి ఫ్యామిలీ మెంబర్స్ ప్రచారానికి వస్తున్నారు. మై హూ నా .. నేను చూసుకుంటాం కదా అని మహిళలు ఎంట్రీ ఇచ్చేసి అమిత వేగంగా దూసుకెళ్తున్నారు..
ఏపీలో దిగ్గజ నేతల విజయం కోరుతూ వారి సతీమణులు రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయన సతీమణి వైఎస్ భారతీరెడ్డి పులివెందులలో మకాం వేస్తున్నారు.ఆమె పులివెందులలో జగన్ విజయం కోరుతూ ప్రచారం చేస్తారు. పులివెందుల లో ఆమె ఉంటూ ఎన్నికల పర్వం పూర్తి అయ్యేంతవరకూ ప్రచారం చేస్తారని తెలుస్తోంది. జగన్ రాష్ట్రమంతా తిరుగుతుంటే భారతీ రెడ్డి.. ఇప్పుడు జగన్ ఇలాకాను మేనేజే చేస్తారు. ఇక మాజీ సీఎం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా భర్త విజయం కోసం కంకణం కట్టుకున్నారు. ఆమె చంద్రబాబు తరఫున కుప్పంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.చంద్రబాబు అరెస్టుతో గుండె ఆగిచనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించే కార్యక్రమం ఇటీవలే ముగిసింది. దానితో భువనేశ్వరి ఇప్పుడు డైరెక్ట్ ప్రచారానికి దిగుతున్నారు. తెలుగు దేశం యువ నేత నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నారు. ఆయన విజయం కోసం సతీమణి నారా బ్రాహ్మణి మంగళగిరిలో పర్యటించబోతున్నారు. ఆమె కూడా ఎన్నికల ప్రచారం చేస్తారు. జనంలోనే ఉంటూ టీడీపీకి అంతా అనుకూలం అయ్యేలా చూస్తారు అని అంటునారు. అదే విధంగా హిందూపురం నుంచి పోటీ చేస్తున్న సినీ నటుడు నందమూరి బాలకృష్ణ విజయం కోసం ఆయన సతీమణి వసుంధర కూడా హిందూపురంలో అడుగుపెట్టేశారు. ఆమె భర్త వెంటనే ఉంటూ ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నారు.
వసుంధర, భువనేశ్వరిని చూసేందుకు జనం తండోపదండాలుగా వస్తున్నారు. భారతికి రిసెప్షన్ ఎలా ఉంటుందో చూడాలి. వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం ఉమ్మడి కడప జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న నేపథ్యంలో భారతి జనంలోకి ఎంట్రీ కొంత ఇబ్బందికరమే కావచ్చు. కాకపోతే సెక్యూరిటీతో మేనేజ్ చేస్తారు కదా. మరో పక్క ఏ పార్టీ గెలిస్తే అది ఆ ఇంటి మహిళ విజయం అని చెప్పాలి. చూద్దాం ఏం జరుగుతుందో..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…