అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి రోజా కి షాక్

By KTV Telugu On 25 September, 2024
image

KTV TELUGU :-

వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా. తన యూట్యూబ్ ఛానెల్‌లో తిరుపతి లడ్డూ వ్యవహారంపై పోల్ నిర్వహించింది. ఆమె ఏ ఉద్దేశంతో ఈ పోల్ నిర్వహించారో కానీ, రోజాకు నెటి‌జన్లు గట్టి ఝలక్ ఇచ్చారు.
తిరుపలి లడ్డూలో కల్తీ చేసింది ఎవంటూ రోజా తన యూట్యూబ్ చానెల్‌లో పోల్ చేపట్టారు. ఈ చానల్లో ఎక్కువమంది రోజా అభిమానులే ఉన్నా కూడా ఫలితం మాత్రం వైసీపీకి వ్యతిరేకంగా వచ్చింది

మాజీ సీఎం వైఎస్ జగన్‌దే తప్పంటూ 74 శాతం మందికిపైగా నెటిజన్లు ఓటు వేశారు. అలాగే ఎవరి పాలనలో తిరుమల బాగుందంటూ ఆమె పోల్ పెట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలోనే తిరుపతి బాగుందంటూ 77 శాతం మందికి పైగా ఓటు వేశారు.
తిరుమలలో కొలువు తీరిన శ్రీవెంకటేశ్వరుడి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారంటూ ఎన్‌డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారంపై సీఎం చంద్ర బాబుతోపాటు కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సైతం స్పందించారు. ఆ క్రమంలో చంద్రబాబుతోపాటు ఆయన ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక వై ఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా వ్యవహరించిన భూమన కరుణాకర్ రెడ్డి సైతం సోమవారం తిరుమల శ్రీవారి ఆలయం వద్దకు చేరుకుని హడావుడి సృష్టించిన విషయం తెలిసిందే.

అలాంటి వేళ.. ఆర్కే రోజా తన యూట్యూబ్ చానెల్ ద్వారా తిరుపతి లడ్డూ వ్యవహారంపై పోల్ నిర్వహించారు. అలాగే చంద్రబాబు పాలనపై సైతం ఆమె ఈ సందర్భంగా పోల్ నిర్వహించారు. ఈ సందర్బంగా తిరుపతి లడ్డూ ప్రసాదంలో గత జగన్ ప్రభుత్వం తప్పు ఉందంటూ ఈ పోల్‌లో నెటిజన్లు ఓటు వేశారు.

.. గత జగన్ ప్రభుత్వ పాలన బాగుందా? చంద్రబాబు పాలనా బాగుందా? అంటూ పోల్ నిర్వహించింది. అందులో సైతం చంద్రబాబు పాలనకే నెటిజన్లు మద్దతు ప్రకటించారు. దీంతో ఆర్కే రోజాకు నెటిజన్లు జబర్దస్త్ ఝలక్ ఇచ్చారని పలువురు ఎద్దేవా చేస్తున్నారు..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి