అధికారం కోసం ఎవరితో అయినా కలిసేందుకు సిద్ధపడుతున్నారు చంద్రబాబు ఆయన దత్త పుత్రుడు పవన్‌కల్యాణ్‌లు. అయితే అన్ని జిల్లాల్లోనూ టీడీపీ, జనసేన పార్టీల నేతలు కత్తులు దూసుకుంటున్నారు. పెద్ద నాయకులు పొత్తులు అంటుంటే..క్షేత్ర స్థాయిలో మాత్రం మంటలు రేగుతున్నాయి. ఉమ్మడి వైఎస్‌ఆర్ జిల్లాలో కూడా రెండు పార్టీల మధ్య ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ జిల్లాలో ఐదు సీట్లలో పోటీకి రెడీ అంటున్నారు జనసేన నేతలు. అసలు వైఎస్‌ఆర్ జిల్లాలో టీడీపీ, జనసేన మధ్య ఏం జరుగుతోందో చూద్దాం.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన ఉమ్మడి కడప జిల్లాలో విపక్షాల పోటీ నామమాత్రంగానే ఉండబోతోంది. కాని జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోటీకి టీడీపీ నేతలు ఉవ్విళ్ళూరుతున్నారు. వీరికి తోడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేన కూడా కనీసం ఐదు సీట్లు తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తోందనే టాక్ నడుస్తోంది. ఇటు పార్టీలో పోటీ..అటు జనసేన నుంచి వస్తున్న డిమాండ్లతో పచ్చ పార్టీ బాస్ చంద్రబాబుకు దిక్కు తోచడంలేదట. అసలు పోటీయే నామమాత్రం అయితే..ఇంతమంది సీట్ల కోసం పోటీ పడుతున్నారేంటని చంద్రబాబు అనుకుంటున్నారట. కాని వారి లెక్కలు వేరే ఉన్నాయంటున్నారు.
రెండు పార్టీల మధ్య పొత్తు మాటలకే పరిమితం అవుతుందని క్షేత్రస్థాయిలో కత్తులు దూసుకోవడం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జిల్లాలో జనసేన అభ్యర్ధులు కడప, రాజంపేట, రైల్వేకోడూరు, మైదుకూరు, బద్వేలు నియోజవర్గాల్లో పోటీ చేసేందకు ఉత్సాహం చూపుతున్నారు. ఇందులో భాగంగా పలుమార్లు పార్టీ నాయకులతో సమావేశమై తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కడప నియోజకవర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన సుంకర శ్రీనివాస్ మరోమారు పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. కానీ కడపలో టిడిపి తరుపునే ముగ్గురు పోటీ పడుతున్నారు.
అందరు కలిసి పని చెయ్యాలని టిడిపి అధినేత చంద్రబాబునాయుడే పలుమార్లు అదేశించినా ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వీరిలో ఒకరికి టిక్కెట్ ఇస్తే మిగిలిన ఇద్దరూ కలిసి పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు జనసేన నేత సుంకర శ్రీనివాస్ సైతం కడపలో బలిజుల ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నందున తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మొదట్లో అందరు కలిసి ష్యూరిటీ… బాబు గ్యారెంటీ పేరుతో తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కానీ టిడిపి వ్యూహం తెలుసుకున్న జనసేన నేతలు ఆ పార్టీకి ప్రచారం చేయడం మానేశారు. ఇప్పుడు జనసేన నేత సుంకర శ్రీనివాస్ కూడా ప్రత్యేకంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇక అన్నమయ్య జిల్లా పరిధిలోని రాజంపేటలోను ఇలాంటి పోరే నడుస్తొంది. ఇక్కడా టిడిపిలో ఇద్దరు నేతల మధ్య టికెట్ వార్ నడుస్తోంది. వీరిద్ధరి మధ్యలోకి జనసేన అభ్యర్ధిగా మాజీ టిడ్కో అధికారి యల్లటూరి శ్రీనివాసరాజు తెరపైకి వచ్చారు. ఈయన రాష్ర్ట స్థాయి అధికారిగా పనిచేస్తూ టిడిపి పెద్దలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజంపేటలో స్వంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తు వస్తున్నారు. ఇప్పుడు శ్రీనివాసరాజు పరిస్థితి కూడా అయోమయంగా మారింది. టికెట్ ఖాయమని చెప్పడంతో ఉద్యోగం వదులుకుని జనసేనలో చేరితే ఇంతవరకు టికెట్ ఖరారు చెయ్యలేదు. ఏదేమైనా రాజం పేట టిక్కెట్ తనకే కావాలని మాజీ ప్రభుత్వ అధికారి గట్టిగా తన గళం వినిపిస్తున్నా..టీడీపీలోని పోటీ దారులు కూడా ఏమాత్రం వెనక్కు తగ్గడంలేదు.
రైల్వేకోడూరు, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్తితే కొనసాగుతోంది. రాష్ట్ర స్థాయిలో అధికారం కోసం చంద్రబాబు, పవన్‌లు నానాగడ్డి కరుస్తుంటూ..క్షేత్ర స్థాయిలో మాత్రం టిక్కెట్‌ల కోసం ఫైట్ కొనసాగుతోంది. టీడీపీ, జనసేన నాయకులు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను ఎదుర్కొని ఒక్క సీటు కూడా టీడీపీ, జనసేన గెలిచే పరిస్తితి లేదని..కాని పోటీ ఎక్కువైందంటే వారి లెక్కలు వేరేగా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…