ఏపీలో రాబోయే ఎన్నికలలో బిజెపి టార్గెట్ నైన్ గా ముందుకుసాగుతోంది…పొత్తులతో సంబందం లేకుండా కనీసం తొమ్మిది పార్లమెంట్ స్ధానాలు తగ్గకుండా పోటీ చేయాలని బిజెపి భావిస్తోంది…ఇప్పటికే ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలలో బిజెపి తరపున అభ్యర్ధులు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు…అయితే ఇదే సమయంలో టిడిపి కూడా బిజెపి కావాలనుకుంటున్న కొన్ని స్ధానాలలో పోటీ చేయాలని చూస్తోంది..ఇప్పటికే అభ్యర్ధుల ప్రకటనకి ముందే అటు టిడిపి..ఇటు జనసేనల మధ్య పొత్తుల వివాదాలు తారాస్ధాయికి చేరుకున్నాయి..ఈ నేపధ్యంలో టిడిపి- బిజెపి పొత్తు ఏ విధంగా ముందుకు వెళ్తుందో తెలియక ఇరుపార్టీల నేతలు తికమకపడుతున్నారు.
ఏపీలో కనీసం తొమ్మిది పార్లమెంట్ స్ధానాలలో పోటీ చేయడానికి బిజెపి నాయకత్వం ఆలోచన చేస్తోంది…మరోవైపు టిడిపి, జనసేన ఏపీలో బిజెపితో పొత్తులు ఉంటాయని ప్రకటిస్తున్న నేపధ్యంలో ఏయే స్ధానాలలో పోటీ ఉంటుందనేది ఆసక్తిగా మారింది..వాస్తవానికి టిడిపితో సంబంధం లేకుండానే ఎపి బిజెపి అన్ని పార్లమెంట్ స్దానాలలో పోటీ చేయడానికి ముందుగా ఆలోచన చేసింది.అందులో భాగంగానే అటు అసెంబ్లీతో పాటు ఇటు పార్లమెంట్ స్ధానాలకోసం ఆసక్తి గల అభ్యర్ధులు నుంచి ధరఖాస్తులు కూడా స్వీకరించింది. మరోవైపు గత రెండేళ్లగా ఏపిలోని దాదాపు తొమ్మిది పార్లమెంట్ నియోజకవర్గాలలో ప్రత్యేక ఫోకస్ పెట్టి కేంద్ర మంత్రులని సైతం ఆయ నియోజకవర్గాలకి పంపించింది. ఇందులో భాగంగానే ఆయా స్ధానాలలో ఎట్టి పరిస్ధితుల్లోనైనా బిజెపి పోటీ చేయాలని సిద్దపడుతోంది..
ఉత్తరాంద్రలో అత్యంత కీలకమైన స్ధానం విశాఖపట్టణం పార్లమెంట్ నియోజకవర్గం..ఇక్కడ నుంచి గతంలో బయట ప్రాంతాలకి చెందిన నేతలు పోటీ చేసి విజయం సాధించారు. విశాఖలో మైగ్రేషన్ ఓట్లు ఎక్కువగా ఉండటం, ఉత్తరాది రాష్ట్రాలకి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ఈ స్ధానం తమకి బాగా కలిసివస్తుందని బిజెపి భావిస్తోంది. విశాఖ లోక సభ నుంచి పోటీ చేయాలని రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహరావు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఆయన గత రెండేళ్లగా విశాఖలోనే ఇల్లు కొనుక్కుని అక్కడే ఉంటున్నారు.విశాఖలో జరిగే ప్రతీ బిజెపి కార్యక్రమంలోనూ చురుకుగా పాల్గొంటున్నారు.
అయితే ఇటు రాజమండ్రి సీటు కూడా బిజెపి కోరుకుంటోంది…ఇక్కడ నుంచి మాజీ ఎపి అధ్యక్షుడు సోము వీర్రాజు పోటీ చేస్తారని చెబుతున్నారు. అలాగే రాజమండ్రి నుంచి పోటీ చేయాలని ఎపి బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి ఉవ్విళ్లూరుతున్నారు.గతంలో కూడా రాజమండ్రి లోక్ సభ స్ధానాన్ని బిజెపి గెలుచుకున్న సందర్బాలు ఉన్న నేపధ్యంలో రాజమండ్రి పైనా బిజెపి ఫోకస్ పెట్టింది.అరకు పార్లమెంట్ స్ధానం నుంచి బిజెపి తరపున పోటీచేయడానికి మాజీ ఎంపి కొత్తపల్లి గీత రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇక పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం, ఏలూరు రెండు లోక సభ స్ధానాలని బిజెపి కోరుకుంటోంది. ఏలూరు లోక సభ స్ధానంపై బిజెపి ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి కన్నేసారు.
నరసాపురం స్ధానంలో గతంలో బిజెపి గెలుపొందిన ధాఖలాలు ఉన్న నేపధ్యంలో ఈ స్ధానం నుంచి పోటీచేయడానికి బిజెపి యోచిస్తోంది. ఇక్కడ నుంచి పోటీచేయాలని రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆలోచన చేస్తున్నారు. విజయవాడ లోక సభ స్ధానంలో తాను పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే సుజనా చౌదరి ప్రకటించారు. అదే సమయంలో ఆయన ఏలూరు స్ధానంపైనా కన్నేసారు.ఈ రెండింటిలో ఏది తనకు బాగుంటుందో కూడా ఆయన సర్వే చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఎపి బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం మొదటగా విశాఖ, విజయవాడ ల నుంచి పోటీ చేయాలని భావించినా అక్కడ పోటీ ఎక్కువగా ఉండటంతో ఇపుడు రాజమండ్రి నుంచి కానీ లేదా ఒంగోలు నుంచి కానీ పోటీ చేయాలని చూస్తున్నారు. మరోవైపు నరసారావుపేట కూడా విన్పిస్తోంది.
ఇక హిందూపూర్ నుంచి పోటీ కి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.కేంద్ర పెద్దల ఆశీస్సులతో ఆయన హిందూపూర్ పై ఆశలు పెట్టుకున్నారు.అదే సమయంలో హిందూపురం నుంచి తాను పోటీ చేస్తానని కాకినాడ శ్రీపీఠం పరిపూర్ధానందస్వామి ప్రకటించటం విశేషం..ఆయన కాకినాడ స్ధానం నుంచి కూడా రేసులో ఉన్నారు. ఇక రాజంపేట లోక సభ నుంచి మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు విన్పిస్తోంది.సిఎం రమేష్ కడప నుంచి పోటీ చేస్తారని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.తిరుపతి లోక సభ స్ధానం నుంచి మాజీ ఐఎఎస్ లు రత్నప్రభ, దాసరి శ్రీనివాస్ ల పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో రత్నప్రభ తిరుపతి లోక్ సభ స్ధానం నుంచి బిజెపి తరపున ఉప ఎన్నికలలో పోటీ చేశారు. ఇక కర్నూలు ఎంపి స్ధానానికి టిజి వెంకటేష్ పేరు కూడా వినిపిస్తోంది. ఇలా పలు స్ధానాలలో టిడిపి, బిజెపి మధ్య పొత్తులు కుదరకముందే విభేదాలు బయటపడుతున్నాయి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…