కాంట్రవర్సీకి కేరాఫ్ అయిన రాంగోపాల్ వర్మ మరోసారి ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేనల పొత్తు వ్యవహారం తెరపైకి వచ్చిన వేళ మరోసారి ఆర్జీవీ లైన్‌లోకి వచ్చారు. మొన్న చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన వర్మ ఇప్పుడు బాబుతో పాటు పవన్‌ను టార్గెట్ చేశారు. వివాదాస్పద పోస్ట్‌తో కార్నర్ అయ్యారు. ముఖ్యంగా పవన్ ఆయన సామాజికవర్గాన్ని ఉద్దేశించి వర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు. RIP కాపులు , కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు అంటూ రాంగోపాల్ వర్మ చేసిన పోస్ట్ పొలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. బాబు, పవన్‌లను ఉద్దేశించి కామెంట్ చేయడమే కాకుండా ఓసామాజిక వర్గాన్ని చులకన చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్జీవీ పోస్టుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, కాపు సామాజికవర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జనసైనికులతో పాటు తమ్ముళ్లు ఆర్జీవీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. జగన్ మోచేతి నీళ్ళు తాగే కుక్క ఆర్జీవీ అంటూ మండిపడుతున్నారు. నీలిచిత్రాల తీసుకునే వ్యక్తి కూడ నీతులు చెబుతున్నాడు మా కర్మ కాకపోతే అంటూ వర్మను టార్గెట్ చేసి కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. రాజకీయాలు పట్టించుకోనని చెప్పావు కదా ఇప్పుడెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావంటూ కొందరు రాంగోపాల్‌వర్మ తీరును ప్రశ్నిస్తున్నారు. కేవలం డబ్బు కోసం నీ సొంత కులాన్ని, నీ వ్యక్తిత్వాన్ని రెడ్డిలకు అమ్మేస్తావని ఊహించా RIP RGV, కాంగ్రాట్యులేషన్స్ రెడ్డీస్ అంటూ వర్మకు కౌంటర్‌గా ఇంకొంతమంది పోస్టులు పెడుతున్నారు. కత్తి మహేష్ లేని లోటు తీరుస్తున్నాడు అంటూ వర్ణించలేని పదజాలంతో వర్మపై దుమ్మెత్తి పోస్తున్నారు. రాంగోపాల్‌వర్మ కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
ఇటీవల కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనపైన టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు రాంగోపాల్ వర్మ. తన పాపులారిటీ తగ్గిందని అందరికీ తెలిసిపోతుందనే ఒక్క భయంతోనే చిన్న గ్రౌండ్‌లో సభ ఏర్పాట్లు చేశారని ఆరోపించారు. చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో కుక్కలకు బిస్కెట్లు వేసినట్టుగా తాయిలాలు విసిరారని విమర్శించారు. మూడుసార్లు సీఎంగా చేసిన వ్యక్తికి ఇలా జరుగుతుందని తెలియదా అని ప్రశ్నించారు. మీ పర్సనల్ ఇగో ఫొటోల కోసం మీ పబ్లిసిటీ కోసం జనాల ప్రాణాలు తీస్తారా అని నిలదీశారు. హిట్లర్ ముస్సోలిని తర్వాత చంద్రబాబేనని ఆయనకు పేదవాళ్ల ప్రాణాలంటే గడ్డిపోచతో సమానమంటూ ఆర్జీవీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 11మంది ప్రాణాలను బలి తీసుకున్నారంటూ విమర్శించారు. తాజాగా బాబు, పవన్‌లతో పాటు రెండు సామాజికవర్గాల్ని లాగుతూ వర్మ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది.