ధర్మారెడ్డిపై లోలోన నిప్పులు చెరుగుతున్న వైసీపీ నేతలు

By KTV Telugu On 24 September, 2024
image

KTV TELUGU :-

ఈ పిల్లి కూడా పాలు తాగుతుందా..అన్నట్లుగా చాలా అమాయకంగా కనిపించే టీటీడీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి దోషిగా నిలబడే తరుణం వచ్చేసిందనిపిస్తోంది. జగన్ కు తాను క్లోజ్ అన్న ఏకైక కారణాన్ని అడ్డుపెట్టుకుని ధర్మారెడ్డి ఇష్టానుసారం వ్యవహరించేవారన్న నిజం ఇప్పుడిప్పుడే గుసగుసల రూపంలో వైసీపీ నేతలు బయటపెడుతున్నారు. త్వరలోనే ఒకరిద్దరు నేతలు కడుపుమంటను తట్టుకోలేక బయటకు వచ్చి అసలు నిజాలు చెప్పే అవకాశాలున్నాయని వైసీపీ వర్గాలే అంటున్నాయి. జగన్ ఒక్కరే తనకు బాస్.. మిగతా వాళ్లంతా తుస్ అన్నట్లుగా వ్యవహరించిన ధర్మారెడ్డి నియంతృత్వ పోకడలు ఒకటొకటిగా వెలుగుచూస్తున్నారు. అన్ని వర్గాలను వేధించిన ధర్మారెడ్డిని కూటమి ప్రభుత్వం సాగనంపకపోయి ఉంటే లడ్డూ ఫ్రాడ్ ఇప్పటికీ బయటపడేది కాదన్న వాదన వినిపిస్తోంది. హిట్లర్ టైపు నియంతృత్వ పోకడలకు ధర్మారెడ్డి పెట్టింది పేరు అని గగ్గోలు పెట్టిన సగటు టీటీడీ ఉద్యోగులు అతను నిష్క్రమించిన తర్వాత పండుగ చేసుకున్నారు.

ధర్మారెడ్డి ఎవ్వరినీ లెక్కచేయరు, ఎవ్వరినీ దగ్గరకు రానివ్వరూ.. నోర్మూసుకుని చెప్పింది చేయ్.. అన్నట్లుగా వ్యవహరిస్తారు. గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టి వేధిస్తారు. తిరుమలలో ఉండే విలేకర్లపై కూడా జులుం ప్రదర్శించారని వార్తలు వచ్చాయి. ఐనా జగన్ కు భయపడి అన్ని వర్గాల వారు ధర్మారెడ్డిని భరించారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజానికి ధర్మారెడ్డి కేంద్రప్రభుత్వ ఉద్యోగి. రక్షణ శాఖలో పనిచేసేవారు. అలాంటి వ్యక్తిని డిప్యూటేషన్ మీద తిరుమలకు తీసుకొచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆయనకు డిప్యూటేషన్ ఇవ్వొద్దని బీజేపీ ఏపీ శాఖాధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్రప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ ఆమె మాట నెగ్గలేదు.జగన్ చేసిన సిఫార్సును ఆమోదిస్తూ కేంద్రప్రభుత్వం ధర్మారెడ్డి డిప్యూటేషన్ ను పొడిగించింది. టీటీడీలో ఛైర్మన్ స్థాయి వరకు చాలా మంది పెద్దలు ఉంటారు. ధర్మారెడ్డి మాత్రం ఎవ్వరినీ లెక్కచేసే వారు కాదు. ఆయన ఆడింది ఆట, పాడింది పాటేనని చెబుతారు. ధర్మారెడ్డి తమ మాట అసలు వినడం లేదని ఛైర్మన్లుగా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి సన్నిహితుల దగ్గర వాపోయేవారట. చివరకు దర్శనానికి సిఫారసు లేఖలు పంపినా కూడా బుట్టదాఖలు చేసి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండీ అన్నట్లుగా వ్యవహరించేవారట. ఎంతమందికి దర్శనానికి కల్పించాలేంటీ..మాకు ఇదే పనా అని వ్యాఖ్యానించేవారట. అసలు సిఫార్సులతో దర్శనమేంటి, అదే టికెట్లు అమ్మితే దేవస్థానానికి కావాల్సినంత డబ్బు వస్తుందని చెప్పేవారట. శ్రీవాణి పేరుతో పదివేల రూపాయల టికెట్ ప్రారంభించినది కూడా ఆయనేనని చెప్పాలి. దానిలో వచ్చిన కోట్లాది రూపాయల ఎటుపోయాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అన్నదాన సత్రంలో భోజనం బాగోలేదని ఎవరైనా ఫోన్ చేస్తే … ఎంతపెడతారయ్య అని ఎదురు ప్రశ్నవేసి కసురుకుని ఫోన్ డిస్కనెక్ట్ చేసేవారట. ధర్మారెడ్డి ఈవో కాకముందు క్యూ లైన్లో భక్తులకు అన్నప్రసాదాలతో పాటు పిల్లలకు పాలు ఇచ్చేవారు. టీటీడీ ఖర్చులు తగ్గించే పేరుతో ధర్మారెడ్డి చేసిన ఇంకో పాపం కూడా వుంది. అదేమంటే.. భక్తులకు క్యూకాంప్లెక్స్‌లలో సరైన తిండి పెట్టకపోవడం. తిరుమలకు వచ్చే భక్తులు దర్శనం కోసం ఇబ్బందిపడొచ్చుగానీ.. తిండికి ఇబ్బంది పడిన ఉదంతాలు లేవు. రోడ్లుపైన ఉన్నా, క్యూలో వున్నా అన్నపానీయాలకు కొదవ వుండేది కాదు. ధర్మారెడ్డి వచ్చిన తరువాత క్యూలైన్లలో అన్నం కోసం, చంటిబిడ్డల పాల కోసం అలమటించాల్సిన పరిస్థితి దాపురించింది. దానిపైన అనేక కథనాలు వచ్చినా ఆయన తీరులో మార్పు రాలేదు.దేశంలో పెద్దనోట్లను రద్దు చేసిన సమయంలో భక్తులు తిండికి కూడా డబ్బులు లేక అవస్థపడుతుంటే.. అప్పటి ఈవో సాంబశివరావు అప్పటికప్పుడు రోడ్లపై ఉచిత అన్న వితరణ కేంద్రాలు ఏర్పాటు చేయించారు. దీంతో వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే.. ఎక్కడికెళ్లినా రోడ్డు మీదే తిండి లభించే పరిస్థితి వుండేది. ఇక క్యూకాంప్లెక్స్‌లోనైతే.. భక్తులు క్యూలో వున్నంత సేపు ఏదో ఒక ఆహారం అందించేవారు. ఆఖరికి చిన్నపిల్లలను దృష్టిలో వుంచుకుని…పాలు కూడా ఏర్పాటు చేశారు. వీటన్నింటికీ ధర్మారెడ్డి ఆపించేశారు.

లడ్డూ స్కాం బయటకు వచ్చిన తర్వాత వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ వివరణల మీద వివరణలు ఇస్తున్నప్పటికీ ధర్మారెడ్డి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. హైదరాబాద్లో ఎక్కడో ఉండిపోయి.. ఏమీ ఎరుగనట్లుగా ప్రవర్తిస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. లడ్డూ కాంట్రాక్టర్ ను మార్చి స్కాం చేయించిన ఘనత ఆయనదే అయి ఉంటుందని వైసీపీ నేతలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయాన్ని బయటకు చెప్పలేక లోలోన కుమిలిపోతున్నారు. ఏదైనా మాట్లాడితే పార్టీకి చెడ్డపేరు వ్తుందని జగన్ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని మౌనంగా ఉండిపోతున్నారు. ధర్మారెడ్డి హ్యాపీ ఇంటిలో ఉండిపోయారు….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి