లోకేష్ అందుకే డుమ్మా కొట్టారా? -Reason Behind the Lokesh NOT attended the Meeting

By KTV Telugu On 1 March, 2024
image

KTV TELUGU :-

టిడిపి-జనసేన కూటమి మొదటి ఉమ్మడి సభకు  నారా లోకేష్ గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏదైనా నిగూఢమైన పని కోసం లోకేష్ ను ఎక్కడికైనా పంపడం వల్ల  రాలేదా..లేక  లోకేష్‌ సభకు వస్తే జనసైనికులు మండి పడతారని వద్దన్నారా అన్నది అర్ధం కావడం లేదంటున్నారు రాజకీయ పండితులు. ఇక రెండు పార్టీల మొదటి సభకు   ప్రజల నుండి  స్పందన  చాలా పేలవంగా ఉండడంతో టిడిపి, జనసేన శ్రేణుల్లో  నైరాశ్యం అలుముకుంది. ఒక పక్క వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నాయకత్వం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశనం చేసేందుకు  ఏర్పాటు చేసిన సిద్ధం సభలకు జనసునామీ పోటెత్తుతుంటే టిడిపి-జనసేనలు రెండూ కలిసి

తెలుగుదేశం-జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్న తర్వాత మొట్ట మొదటి సారి రెండు పార్టీలూ కలిసి ఉమ్మడిగా నిర్వహించిన బహిరంగ సభకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు నాయుడి రాజకీయ వారసుడు  అయిన నారా లోకేష్ హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో  చర్చకు దారి తీస్తోంది. చంద్రబాబు నాయుడు టిడిపికి జాతీయ అధ్యక్షుడు కాగా నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. అంత కీలక పదవిలో ఉన్న లోకేష్  ఎన్నికల ముందు పార్టీ నిర్వహించిన కీలక సభలో లేకపోవడం వెనుక ఏదో ఒక ఆంతర్యం ఉందన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు అసలు పుత్రుణ్ని పక్కన పెట్టి దత్త పుత్రుణ్ని వేదిక ఎక్కించారంటూ రాజకీయ ప్రత్యర్ధులు సెటైర్లు వేస్తున్నారు.

నారా లోకేష్   గైర్హాజరీకి కారణాలేంటన్న అంశంపై  అటు టిడిపిలోనూ ఇటు జనసేనలోనూ  చర్చ జరుగుతోందంటున్నారు.  టిడిపి వర్గాల వాదన బట్టి నారా లోకేష్ ఈ సభకు హాజరైతే జనసైనికుల నుండి తీవ్ర స్థాయిలో నిరసన ఎదుర్కోవలసి వస్తుందని చంద్రబాబు భయపడ్డారని అంటున్నారు. అందుకే ఈ సభకు లోకేష్ ను రావద్దని బాబే చెప్పారని అంటున్నారు టిడిపి  సభలకు మాత్రమే లోకేష్ ను పరిమితం చేసి  టిడిపి జనసేనల ఉమ్మడి సభలకు చంద్రబాబు-పవన్ లు మాత్రమే  హాజరయ్యేలా  ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వారు  చెబుతున్నారు. ఎన్నికల నగారా మోగిన తర్వాత రెండు పార్టీల ఉమ్మడి సభలు మరికొన్ని  జరుగుతాయి. వాటిలోనూ లోకేష్  రారని అంటున్నారు.

ఒకటి మాత్రం వాస్తవం. నారా లోకేష్ పై మెజారిటీ జనసైనికులు పీకలదాకా కోపంగా ఉన్నారు. అందులో అనుమానమే లేదు. దానికి కారణం కూడా ఉంది. టిడిపి-జనసేన పొత్తు ఖరారు అయిన తర్వాత ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాలోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. టిడిపి-జనసేన కూటమిలో ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు? అని యాంకర్ ప్రశ్నించగా.. అందులో రెండో ఆలోచనకు  ఆస్కారమే లేదన్నారు లోకేష్.  మా కూటమిలో చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అభ్యర్ధి అన్నారు. పోనీ పవన్ కళ్యాణ్ ను  డిప్యూటీ సిఎం అభ్యర్ధిగా భావించ వచ్చా? అని ప్రశ్నించారు. దానికి కూడా లోకేష్ తడుముకోకుండా డిప్యూటీ సిఎం ఎవరనేది  పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించి చంద్రబాబు నాయుడే ప్రకటిస్తారని అన్నారు.

పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవికే కాదు డిప్యూటీ సిఎం పదవికి కూడా పనికిరారన్నట్లు  నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు జనసేన నేతల్లో  మంట పుట్టించాయి. లోకేష్ పై  వారు నిప్పులు చెరిగారు. సోషల్ మీడియాలోనూ దీనిపై  విమర్శలు వెల్లువెత్తాయి. సరిగ్గా ఈ సమయంలోనే జనసేన మద్దతు దారు అయిన చేగొండి హరిరామ జోగయ్య  ఓ లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేస్తామని చంద్రబాబు నాయుడి చేత ప్రకటన చేయించాలని అందులో కోరారు. మరో వైపు  కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని జనసేనలోకి ఆహ్వానించిన జనసైనికులను ఉద్దేశించి^ముద్రగడ మాట్లాడుతూ  అధికారంలో జనసేనకు వాటా ఇస్తామన్న గ్యారంటీ ఏమన్నా చంద్రబాబు ఇచ్చారా? అని ప్రశ్నించారు. మాకు తెలీదని వారనగానే అది తేల్చుకుని రండి అప్పుడే నేను పార్టీలో చేరతానన్నారు.

ఈ పరిణామాల తర్వాత నారా లోకేష్ పై జనసైనికులు కోపంగా ఉన్నారు. ఇక నిన్న కాక మొన్న జనసేనకు 24 స్థానాలు కేటాయించినట్లు చంద్రబాబు ప్రకటించిన తర్వాత టిడిపి వైఖరిపైనా వారు  ఆగ్రహంతో రగిలిపోతున్నారు.  ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా నిర్వహించిన మొదటి సభలో లోకేష్ ఉంటే జనసైనికులు, పవన్ అభిమానులు రాద్ధాంతం సృష్టించి నిరసనలు వ్యక్తం చేసే అవకాశాలున్నాయని చంద్రబాబు భయపడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీటికి తోడు తాడేపల్లి గూడెం సభకు ఆరు లక్షల మంది వస్తారని టిడిపి-జనసేన నేతలు ప్రకటించగా అరవై వేల మంది కూడా రాకపోవడంతో చంద్రబాబు, పవన్ లు ఇద్దరూ కూడా కుత కుత లాడిపోతున్నారని అంటున్నారు. లోకేష్ ను రానున్న ఉమ్మడి సభలకూ దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి