తెలంగాణలో ఇప్పుడు తానే అత్యంత పవర్ ఫుల్ లీడర్నని ప్రచారం చేయించుకుంటున్న రేవంత్ రెడ్డి తాజాగా తనపై కుట్రలు చేస్తున్నారంటూ వాపోవడం ప్రారంభించారు. సొంత నియోజకవర్గం కొడంగల్ వెళ్లి ఆయిన ఇవే ఆరోపణలు చేశారు. కొడంగల్ లో మెజార్టీ రాకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఆరోపణల వెనుక భయం ఉన్నట్లుగా రాజకీయాలపై అవగాహన ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. సిట్టింగ్ ఎంపీగా ఉండి మల్కాజిగిరిలో ఒక్క అసెంబ్లీ స్థానంలో గెలిపించలేకపోయారు. ముఖ్యమంత్రిగా ఉండి కొడంగల్ లో మెజార్టీ తీసుకు రాకపోతే ఆయన ఇమేజ్ అంతా మీడియా బిల్డప్ అని తేలిపోతుంది. అందుకే రేవంత్ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ప్రారంభించారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హఠాత్తుగా ప్రజలకు తనపై జాలి కలగాలన్నట్లుగా రాజకీయం చేస్తున్నారు. ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గ ప్రజలను సెంటిమెంట్ లో ముంచెత్తేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజగా కొడంగల్ లో పర్యటించిన ఆయన మాట్లాడిన మాటలు కొడంగల్ ప్రజల్లోనూ చర్చకు దారి తీశాయి. తనను కింద పడేయాలని బీఆర్ఎస్, బీజేపీ చూస్తున్నాయి… మనల్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పన్నుతున్నాయి… ఇది రేవంత్‌రెడ్డిని దెబ్బతీయడం కాదు.. కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడమేనని ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు.. కొడంగల్‌కు తనకు వచ్చిన పదవి గొప్ప వరమన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. కొడంగల్ నుంచి 60 ఏళ్ల కిందట మంత్రి ఉన్నారని.. ఇప్పుడు ఏకంగా సీఎం పదవి వచ్చిందన్నారు.
అంతే కాదు కొడంగల్‌కు వంద రోజుల్లో తానేమి చేశానో కూాడా చెప్పుకొచ్చారు. అయితే అన్నీ జీవోల మీదనే ఉననాయి. ఇంక ాఅమల్లోకి రాలేదు. పాఠశాలలు, మెడికల్, ఇంజినీరింగ్, వెటర్నరీ, నర్సింగ్ కళాశాలలు, మహిళా డిగ్రీ, దౌల్తాబాద్, బోంరాస్పేట్ మండలాలకు జూనియర్ కళాశాల తీసుకొచ్చామని ప్రకటించేసుకున్నారు. కొడంగల్‌ను అభివృద్ధి చేస్తుంటే.. కొందరు తనను ఓడించాలని చూస్తున్నారని, అభివృద్ధి చేస్తున్నందుకు తనను ఓడించాలా అని రేవంత్ ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి మాటలు.. ఆత్మరక్షణ ధోరణిలో ఉన్నాయా.. ప్రజల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నించారా అన్నదానిపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి 33వేల మెజార్టీ వచ్చింది. ఎన్నికల తర్వాత పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో ఉన్నారు. కానీ అన్న అండ లేకపోతే ఆయన జీరో. ఓ రకంగా ఇప్పుడు కొడంగల్ లో రేవంత్ రెడ్డికి ప్రత్యర్థి లేరు. అయినా ఆయన ఆందోళన చెందుతున్నారు. డీకే అరుణ, బీఆర్ఎస్ కలిసి కొడంగల్ లో మెజార్టీ రాకుండా ప్రయత్నం చేస్తున్నాయని ఆయన అనుమానిస్తున్నారు. ఆందోళన చెందుతున్నారు. సీఎం హోదాలో ఉన్నందున సొంత నియోజకవర్గంలో మెజార్టీ రాకపోతే ఆయన పలుకుబడి పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది. అందుకే రేవంత్ రెడ్డి ఆందోళన చెందుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
నిజానికి సీఎంగా ఉన్నందున.. కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ఆయనను కాదని ఓటేసే పరిస్థితి ఉండదు. అసెంబ్లీ ఎన్నికల కన్నా ఎకువ మెజార్టీనే వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ గెలిచాక బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేతలల్ని పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ ను కాదని ఇతర పార్టీకి ఓటేయకూడదన్న పరిస్థితిని కల్పించారు. అయినా రేవంత్ రెడ్డి తనను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని అంటే కొడంగల్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇది ఎమోషనల్ బ్లాక్ మెయిలింగేనని.. కొడంగల్ ఎంత ఎక్కువ మెజార్టీ వస్తే అంతగా రేవంత్ బలంగా ఉన్నారన్న అభిప్రాయం వస్తుంది కాబట్టే ఇలా అంటున్నారని అంటున్నారు. రేవంత్ వ్యూహం అదే కావొచ్చు.. భావోద్వేగాల పునాదల మీద తన రాజకీయ కోటను కొడంగల్ లో నిర్మించాలనుకుంటున్నారు.
కాంగ్రెస్ కంగారు పడుతున్నట్లుగా కాంగ్రెస్ పార్టీలో ఏమైనా జరగవచ్చు. మల్కాజిగిరి ఎంపీగా ఉంటూ ఆయన అక్కడ ఒక్క అసెంబ్లీ సీటును గెలిపించలేకపోవడం ఇప్పటికే హైకమాండ్ దృష్టిలో ఉంది. ఇప్పుడు పార్లమెంట్ స్థానాల్లో ఎక్కువ సీట్లు గెల్చినా… కొడంగల్ మెజార్టీ తెచ్చుకోలేకపోతే.. ఆయన పలుకుబడి తగ్గిపోతుంది. అందుకే రేవంత్.. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు దిగుతున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…