చంద్రబాబు తాట తీసిన రామ్‌గోపాల్‌వర్మ

By KTV Telugu On 5 January, 2023
image

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన పబ్లిసిటీ పిచ్చితో ఇరుకు సందుల్లో సభలు, రోడ్డు షోలు పెట్టి ప్రజల ప్రాణాలు బలితీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కందుకూరులో డ్రోన్‌ షాట్ల కోసం ఇరుకైన ప్రాంతంలో సభ పెట్టి ఎనిమిది మందిని బలితీసుకున్నారు. ఆ ఘటన మరువక ముందే గుంటూరులో చంద్రన్న కానుకలు పంచుతానని ముగ్గురిని పొట్టన పెట్టుకున్నారు. ఈ రెండు దుర్ఘటనలకు పోలీసులే కారణం అని నెపం వారి మీద పెట్టి చేతులు దులిపేసుకున్నారు. కొందరు నాయకులైతే దానికి జగన్ సర్కారే కారణం అని తమ పైత్యాన్ని ప్రదర్శించుకున్నారు. నిరుపేదల ప్రాణాలపట్ల చంద్రబాబుకు చూపుతున్న వైఖరిపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. తాజాగా దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కూడా చంద్రబాబును చెడుగుడు ఆడుకున్నారు. చంద్రబాబుకు సొంత పబ్లిసిటీనే ముఖ్యమని ప్రజల ప్రాణాలు గడ్డిపోచతో సమానమని దుమ్మెత్తిపోశారు. విశాలమైన ప్రాంతాల్లో సభ పెడితే తక్కువ జనాలు వస్తే తనకు పాప్యులారిటీ తగ్గిపోయిందనే విషయం ప్రజలకు తెలిసిపోతుందనే భయంతో ఇరుకు సందుల్లో సభలు పెట్టి ప్రజల ప్రాణాలు తీశారని విమర్శించారు.

తనకు ఎంత పాపులరాటీ ఉందో అని ప్రూవ్‌ చేసుకోడానికి జనాల చావులను వాడుకోవడం అన్నది దారుణం అన్నారు. ఆ దుర్ఘటనలతో మీకు సంబంధం లేదంటే ఎవరూ నమ్మరు అని దుయ్యబట్టారు. కేవలం పర్సనల్ సాటిస్ఫాక్షన్‌ పర్సనల్ ఇగో పర్సనల్ గెయిన్‌ తప్ప ఆయనకు వేరేదానికి పనిలేదు మండిపడ్డారు ఆర్జీవి. మూడు సార్లు సీఎంగా చేసిన వ్యక్తికి సభలు ఎక్కడ పెట్టాలో తెలియదా అని ప్రశ్నించారు. తన కోసం ఇంత మంది వచ్చి ప్రాణాలు కూడా కోల్పోయారంటూ చంద్రబాబు పబ్లిసిటీ చేసుకుంటారని చెప్పారు. ప్రజలకు చంద్రన్న కానుకలు అంటూ బిస్కెట్లు వేసి వారి ప్రాణాలు బలిగొన్నారని దుయ్యబట్టారు. ఒక రాజకీయ నాయకుడికి తన ప్రజల ప్రాణాలు ముఖ్యం అని భావించాలి. కానీ మీరు వాళ్ల ప్రాణాలు పణంగా పెట్టి వాళ్లని చంపి నీ పాపులరాటీ పెంచుకోవడం అనేది దారుణం అన్నారు. ఇలాంటి పనులు హిట్లర్ ముస్సోలినీ తరువాత నిన్నే చూస్తున్నా అని ఏకవచనంతో సంబోధిస్తూ చంద్రబాబు మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రామ్‌గోపాల్‌ వర్మ. చంద్రబాబును ఎవరు విమర్శించినా టీడీపీ నాయకులు అంతెత్తున లేస్తారు. కానీ ఆర్జీవి జోలికి మాత్రం వెళ్లరు. ఆమధ్య ఆర్జీవి మీద చిన్న కామెంట్‌ చేసిన టీడీపీ నేత పట్టాభికి రెండు చెంపలు వాయించేలా కౌంటర్‌ ఇచ్చారు రామ్‌గోపాల్‌ వర్మ. దాంతో పట్టాభి సైలెంట్‌ అయిపోయారు. ప్రస్తుతం చంద్రబాబు మీద ఆర్జీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.