అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో దిగ్భ్రాంతికర ఓటమికి గురైన అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త బెడదను ఎదుర్కొంటోంది. వలసల తాకిడి అధికమైంది. ఈ ఓటమి ఆ పార్టీని ఖాళీ చేసే స్థితికి తీసుకెళ్తోంది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వలసబాట పట్టారు.
కొద్దిరోజుల కిందటే ఎమ్మెల్సీలు పోతుల సునీత, కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేశారు. అంతకుముందు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడారు. ఏలూరు, జగ్గయ్యపేట మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, మరికొందరు మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్ల వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేనల్లో జాయిన్ అయ్యారు.
ఈ పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం. క్షేత్రస్థాయిలో పార్టీ పునర్నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేసిన వారి సేవలనూ వినియోగించుకుంటోంది.
ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలకూ స్థానచలనం కల్పించింది. అలాగే- పార్టీ అనుబంధ విభాగాల్లో సైతం భారీగా మార్పులు చేర్పులు చేసింది. పలు విభాగాలకు కొత్త ఇన్‌ఛార్జీలను అపాయింట్ చేసింది.
తాజాగా పార్టీకి నలుగురు కొత్త అధికార ప్రతినిధులను నియమించింది. మాజీ మంత్రి ఆర్ కే రోజా, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావులను అధికార ప్రతినిధులుగా అపాయింట్ చేసింది. ఇదే జాబితాలో ప్రముఖ యాంకర్ ఆరె శ్యామలకు కూడా చోటు దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మొన్నటి ఎన్నికల్లో ఆమె వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న మంగళగిరి సహా పలు నియోజకవర్గాల్లో యాంకర్ శ్యామల.. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. అప్పటికే ఆమె క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్నప్పటికీ.. పార్టీపరంగా ఎలాంటి హోదా కూడా ఉండేది కాదు అప్పట్లో. ఇప్పుడు యాంకర్ శ్యామలను పార్టీ అధికార ప్రతినిధిగా హోదా లభించింది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…