ఆయన రెండో సారి గెలవాలనుకుంటున్నారు.. అందుకు తగ్గట్టుగా సొంత సామాజిక వర్గాన్ని మంచి చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. వైసీపీలో ఉంటూ టీడీపి ఓట్లకు గాలం వేసే ప్రయత్నంలో కొంత మేర సక్సెస్ అయ్యారు. ఇంతకీ ఏమిటా ఒప్పందం..
గుర్రం ఎగరా వచ్చు అన్నట్లుగా రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. గుర్రం ఎగరకపోయినా రాజకీయాల్లో నిలబడి ఎగిరే ట్విస్ట్ మాత్రం కొందరికి తెలుసు. ఆంధ్రా ప్యారిస్ గా పిలిచే తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వైసీపీలో ప్రచారానికి దిగారు. జగన్ చూసి ఓటేసినా వెయ్యకపోయినా తనను చూసి ఓటెయ్యాలని కోరుతున్నారు. ఇందుకోసం సొంత కమ్మసామాజిక వర్గం వారిని దువ్వే ప్రయత్నంలో కొంత మేర సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఆ కారణంగానే ఆయన ధైర్యంగా ఉండగలుగుతున్నారని చెబుతున్నారు…
నా దారి వేరే దారి అని తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ వాదిస్తున్నారు. మీది తెనాలే మాది తెనాలే అంటూ ఓటర్లను తనవైపుకు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు.వైనాట్ 175 అని చెప్పుకుంటూ వచ్చిన జగన్ ఇప్పుడు లెక్కలేసుకుని మౌనంగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే శివకుమార్ మాత్రం నేను నేనే, నాకే మీ ఓటు అంటూ ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. తెనాలి నియోజకవర్గంలో కమ్మ, కాపు సామాజికవర్గం ఓట్లే గెలుపోటములను శాసిస్తుంటాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శివకుమార్.. టీడీపీ కేండేట్ ఆలపాటి రాజాపై 17 వేల మెజార్టీతో గెలిచారు. ఈ గెలుపు వెనుక జగన్ పరపతి కంటే శివకుమార్ వ్యూహాలు బాగా పనిచేశారని చెప్పేవారు.
శివకుమార్ 2014 ఎన్నికల్లోనూ పోటీ చేశారు. కానీ టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా చేతిలో ఓడిపోయారు. అయితే 2019 ఎన్నికల్లో తెనాలి నుంచి మరోసారి వైసీపీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్న శివకుమార్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పైగా అప్పటి ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేయడం కూడా ఈయనకు కలిసి వచ్చింది. తెనాలి నియోజకవర్గంలో 2019 ఎన్నికలలో ఎమ్మెల్యేగా శివకుమార్‌కు మెజార్టీ రాగా, ఎంపీగా తెలుగుదేశం అభ్యర్థి గల్లా జయదేవ్‌కు మెజార్టీ వచ్చింది. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం వలన ఆర్థికంగా నష్టపోయాయని, ఈసారి ఎమ్మెల్యే ఓటు తనకు వేసి, ఎంపీ ఓటు జయదేవ్‌కు వేసుకోమని ఆయన ఓ సామాజికవర్గంతో ఓ అనధికార ఒప్పందం చేసుకున్నారుట. దీంతో ఓ సామాజిక వర్గం ఓట్లు జనసేన అభ్యర్థి కు పడగా టీడీపీకి పడాల్సిన పడాల్సిన సామాజిక వర్గ ఓట్లను తన వైపు తిప్పుకోవడం లో శివ కుమార్ సక్సెస్ అయినట్లు తెలుస్తోంది.
వైసీపీ సర్కార్‌పై ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో ఇక తమ పార్టీ ఓటమి తప్పదని గ్రహించిన ఎమ్మెల్యే శివ కుమార్ ఈ సారి తన స్వరం మార్చాడు. తనను జగన్ మనిషిగా చూడకుండా, తనను చూసి ఓట్లు వేయాలని ఆ సామాజిక వర్గం తో చర్చలు మొదలుపెట్టారుట. ఆ మేరకు తెనాలి నియోజకవర్గం లో ఆ సామాజిక వర్గ నేతలకు ఏ పనైనా చేసిపెడతానంటూ ఆఫర్‌లు ఇస్తున్నారు.రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాలలో తనను చూసి ఓట్లు వేయమని జగన్ చెబుతుంటే తెనాలి నియోజకవర్గం లో మాత్రం జగన్ ను కాదు.., తననే చూసి ఓటు వేయమని ఎమ్మెల్యే శివ కుమార్ కోరడం వైసీపీలో చర్చంశనీయంగా మారింది. జగన్ రెడ్డి పేరు చెబితే ఓట్లు పడే పరిస్థితి లేదని అందుకే శివకుమార్ సొంత ప్రచారం చేసుకుంటున్నారని వైసీపీ వర్గాల ఇన్‌సైడ్ టాక్
తెనాలిలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువే. టీడీపీ తరపున ఆలపాటి రాజాకు టికెట్టిచ్చినా, కమ్మ సామాజికవర్గం ఓట్లు తనపై పడాలన్నది శివకుమార్ లక్ష్యం చెబుతున్నారు. పోయిన సారి లాగే ఈ సారి కూడా ఎమ్మెల్యే ఓట్లు తనకు వేయాలని, ఎంపీ ఓట్లు వారిష్టమని కమ్మ వారిని ఆయన కోరారు. అందులో కొంతమంది అందుకు అంగీకరించినా ఈ సారి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసే ప్రసక్తే లేదని చెబుతున్నారట. ఐనా సరే శివకుమార్ మాత్రం ధైర్యంగా ఉంటున్నారు. ఆలపాటి రాజా కంటే తాను మంచి అభ్యర్థునను చెబుతున్నారు. ఏదో విధంగా ఎన్నికల నాటికి కమ్మ వారి ఆలోచన మారితే.. వారి మొత్తం ఓట్లు ఏకమొత్తంగా తనకు పడతాయని ఆయన ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు కమ్మ కులస్తులు ఆయన రహస్యంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్నాబత్తుని శివకుమార్ హ్యాపీగా రాజకీయాలు చేస్తున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…