అన్న మంచోడే..వదినే..!?

By KTV Telugu On 1 February, 2024
image

KTV TELUGU :-

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్  షర్మిల జెట్ స్పీడులో దూసుకెళ్తున్నారు. ఎదురొచ్చిన వారిని, తనను విమర్శించిన వారిని ఖండఖండాలుగా నరికేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకటి రెండు అన్ పార్లమెంటరీ పదాలను  కూడా అలవోకగా వాడేస్తున్నారు. ఈ క్రమంలో   ఆమె ఇంటిపట్టున ఉండే జగన్మోహన్ రెడ్డి భార్య భారతీ రెడ్డిని కూడా వివాదాల్లోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆమె మాట్లాడిన మాటలు, వాడిన పదజాలం వివాదాలకు కేంద్ర బిందువయ్యే అవకాశం కూడా ఉంది…

షర్మిల మాటల దాడిని పెంచారు. తనపై  విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలను జోకర్లతో  పోల్చారు. జగన్ పరివారంపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, జగన్‌ను జైల్లో పెట్టించాలని అప్పటి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని తన భర్త అనిల్‌ కోరారన్నది ఒట్టి దుష్ర్పచారమేనని మండిపడ్డారు. తన వదిన భారతీరెడ్డితో కలిసే సోనియా వద్దకు తన భర్త వెళ్లారని, వారు చెప్పేది నిజమే అయితే భారతీరెడ్డితో ఈ విషయం చెప్పిస్తారా అని సవాల్‌ విసిరారు. తన భర్త ఎప్పుడు సోనియా వద్దకు వెళ్లినా.. తమ వదిన భారతీ రెడ్డి కూడా కలిసే వెళ్లారని వివరించారు. ‘షర్మిలను సీఎం చేయండి’ అని నా భర్త భారతీరెడ్డి ముందే సోనియాకు చెప్పారా? లేక వెనుక చెప్పారా? దీనికి భారతీరెడ్డి సాక్ష్యం చెబుతారా? అసలు ఈ విషయాన్ని ప్రణబ్‌ ముఖర్జీ ఎప్పుడైనా, ఎక్కడైనా బహిరంగంగా చెప్పారా? ఇప్పుడు ఆయన లేరు. కనీసం… ఆయన కుమారుడితోనైనా చెప్పిస్తారా? ఇక మీ కుట్రలకు అడ్డూ అదుపూ ఉండదా?’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు…

వైఎస్ భారతీ అంటే షర్మిలకు ఎందకంత కోపం. ఇద్దరి మహిళలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందా. గతంలో ఏమైనా గొడవలు జరిగాయా.. ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా…

తల్లి విజయమ్మ, షర్మిల ఒక  పక్క .. వైఫ్ ఆఫ్ జగన్ అనబడే  భారతీ మరో పక్క పెద్ద సినిమానే జరుగుతోందని తెలిసిన వాళ్లు చెప్పే మాట.  విజయమ్మను, షర్మిలను ఆమడ దూరంలో పెట్టాలని భారతీ డిసైడ్ కావడం వల్లే ఇప్పుడు గొడవ ముదిరి.. షర్మిల పొలిటికల్ ఎంట్రీకి అవకాశం  వచ్చిందని అంటున్నారు. జగన్ ఎంతో కొంత ఇద్దాంలే అని చెప్పినా… భారతీ అందుకు ఒప్పుకోలేదని అందులో ముమ్మాటికి ఆస్తుల గొడవ ఉందని  క్లోజ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. అందుకే షర్మిలకు అన్న జగన్ కంటే వదిన భారతిపై  ఎక్కువ కోపమని చెబుతున్నారు. పైగా సీఎం పోస్ట్ విషయంలో కూడా ఒకప్పుడు  మనస్పర్థలు వచ్చాయి.  జగన్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితే వస్తే సీఎంగా ఎవరు ఉంటారనేదానికి మీడియాలో  పెద్ద చర్చే జరిగింది. భారతి సీఎం అవుతారని తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు కథనాలు రాయించాయి. ఇదీ ముమ్మాటికి భారతీ ప్రోద్బలంతో జరిగిందేనని షర్మిల అనుమానిస్తున్నారు.భారతీ అలా చెప్పి రాయించారని షర్మిల అనుమానించడమే.. అక్కసు పెరగడానికి కారణమవుతోంది.. పైగా జగన్ ఇంట్లోకి తాము ఫ్రీగా వెళ్లిపోయే అవకాశం లేకపోవడానికి భారతీ తీరే కారణమని షర్మిల ఆగ్రహం చెందుతున్నారు. పైగా జగన్ చుట్టూ ఉన్న బ్యాచ్  మొత్తం భారతి చెప్పుచేతల్లో ఉన్నారని, ప్యాలెస్ లో ఇప్పుడామె పెత్తనమే నడుస్తోందని షర్మిల భావిస్తున్నారు. అదే అన్న పక్కన తాను ఉంటే.. సీన్ వేరుగా ఉండేదని వైఎస్ కుటుంబ సభ్యురాలిగా గౌరవం ఉండేదని కూడా ఆమె నమ్ముతున్నారు. పైగా సాక్షి మీడియా మొత్తం భారతి ఆదేశాలతోనే నడుస్తుందని తెలుసుకున్న షర్మిల.. ఆ సంస్థలో తనకు సగభాగం వాటా ఉందని చెప్పుకుంటున్నారు. భారతి తీరును తనకు సన్నిహితంగా ఉండే పెద్ద మనుషుల దగ్గర షర్మిల ప్రస్తావించడం….పోరాడితే పోయేదేమి లేదు.. ఒకసారి అటాక్ చేయండని వాళ్లు సలహా ఇవ్వడం చకచకా జరిగిపోయింది. దానితో ఇప్పుడామె వదినపై డైరెక్ట్ అటాక్ మొదలు పెట్టారు…..

షర్మిల  మొదలు పెట్టారు. అది ఎటు దారితీస్తుందో తెలీదు. ఎందుకంటే వెనుకముందు చూసుకోకుండా మాట్లాడటం షర్మిలకు అలవాటని వరుస ఘటనలు చెప్పకనే చెబుతున్నాయి. మరి  వాటన్నింటికీ భారతి సమాధానం చెబుతారా..వేరే వాళ్లతో  చెప్పిస్తారా.. కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి