సింపథీ ట్రాప్

By KTV Telugu On 26 January, 2024
image

KTV TELUGU :-

జగన్  పెద్ద గేమ్ ఆడుతున్నారన్న అనుమానం కలుగుతోంది.  జనానికి తన పట్ల సింపథీ పెంచుకునే క్రమంలో ఆయన టీడీపీ అనుకూల మీడియాను కూడా ట్రాప్ లో పడేశారనిపిస్తోంది. తన పైసా ఖర్చు కాకుండా ఫ్రీగా పబ్లిసిటీ పొందుతున్నారన్న ఫీలింగు వచ్చేస్తోంది. జగన్ ఏది మాట్లాడినా నెగిటివ్ షేడ్ లో చూపించాలనుకునే యెల్లో మీడియా తనకు తెలియకుండానే ట్రాప్ లో  పడిపోయిందా అనిపిస్తోంది….

విద్యారంగంపై  ఇండియా టుడే నిర్వహించిన సదస్సుకు జగన్ వెళ్లారు. అసలు ఇండియా టుడే సదస్సు జరుగుతుందని కూడా  ఎవరికీ తెలీదు. జగన్ మీడియాలో వచ్చినా దాన్ని పెద్దగా పట్టించుకున్న వాళ్లే ఉండదు. కాకపోతే ఇప్పుడు కొన్ని మీడియా సంస్థల పుణ్యమాని జగన్ మాట్లాడిందంతా జనానికి తెలిసిపోయింది. ప్రభుత్వ సొమ్ముతో ప్రైవేటు సదస్సు నిర్వహించారని  మీడియా కోడై కూయడమే తప్ప జగన్ పట్టించుకోరు. పైగా ఇప్పుడు తానో బాధితుడినని చెప్పుకునేందుకు జగన్ చేసిన ప్రయత్నం కొంతమేర సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. జనం ఎక్కువగా చూసే మీడియాల్లో అది వచ్చేసింది. కాంగ్రెస్ విచ్ఛిన్నకర రాజకీయాలు చేయడంలో ముందుందని,  ప్రస్తుతం త‌మ కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు ఆ పార్టీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని జ‌గ‌న్ విమ‌ర్శ‌లు గుప్పించారు.  విభ‌జించి పాలించు రాజ‌కీయాలు చేయ‌డంలో కాంగ్రెస్ పార్టీని మించిన వారు లేర‌న్నారు. త‌మ కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టింద‌ని అన్నారు.సోదరి  వైఎస్ షర్మిల ప్రత్యేక హోదాను పదే పదే ప్రస్తావిస్తున్న వేళ…రాష్ట్ర విభజనను జగన్ మళ్లీ తెరపైకి తెచ్చారు. కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించిందని ఆయన ఆరోపించారు. ఏపీ ప్రజలు ఎంత మొత్తుకున్నా .. ఏ మాత్రం వినిపించుకోలేదన్నారు.పైగా  తమ బాబాయి వివేకానందరెడ్డిని తమకు దూరం చేసి, తమపైనే పోటీ చేయించిందన్నారు. ఇప్పుడు తమ సోదరి షర్మిలను కాంగ్రెస్ ఉసిగొల్పుతోందని జగన్ పరోక్షంగా ఆరోపణలు సంధించారు.

హ్యాపీగా దిగిపోతానని జగన్ ఎందుకన్నారు. నిజంగా ఆయన దిగిపోతారా.. ఆయన మనసులో అదే మాట ఉందా..జగన్ ఎవర్ని టార్గెట్ చేస్తున్నారు. జగన్ సందేశం జనానికి అర్థమవుతోందా…

ఇండియా టుడే సదస్సులో జగన్ మరోమాట అన్నారు. దాదాపు ఐదేళ్ల పాలన తనకు సంతృప్తినిచ్చిందని దిగిపోవాల్సి వచ్చినా సంతోషమేనని చెప్పుకున్నారు. ‘56 నెలలుగా అధికారంలో ఉన్నాను. నేను బెటర్‌గానే చేశానని అనుకుంటున్నా. ఎలాంటి విచారం లేదు. ఇప్పటికిప్పుడైనా సంతోషంగా దిగిపోతా’ అని వ్యాఖ్యానించారు. నిజానికి అధికారంలో ఉన్న ఏ నాయకుడు దిగిపోయేందుకు ఇష్టపడరు. జీవితాంతం ఆ పదవిలో ఉండేందుకే ఇష్టపడతారు. జగన్ కూడా అంతే. కాకపోతే జగన్ తప్పిదాలను ఫోకస్ చేస్తూ ఆయన దిగిపోవాలని రోజువారీ డిమాండ్ చేసే విపక్షాలకు, మీడియాకు ఆయన ఒక అవకాశం ఇచ్చారు. వారిని ట్రాప్ లో పడేసి తన  పట్ల సింపథీ సృష్టించుకునే ప్రయత్నం చేశారు. తను ఏం మాట్లాడినా వ్యతిరేక  మీడియా చిలవలు పలవలు చేసి ప్రచురిస్తుందీ, ప్రసారం  చేస్తుందని జగన్ కు తెలుసు. ఆయనకు కావాల్సింది కూడా అదే. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తాను మేలు చేసే పనులను చేపడుతుంటే.. తనను  ఒంటరివాడిని చేస్తున్నారని, తాను ఒకటి మాట్లాడితే దానికి వంద అర్థాలు తీస్తున్నారని సామాన్య జనంలోకి ఎక్కించడమే జగన్  ధ్యేయం. తొలి నుంచి తాను ఒక్కడినే పోరాడానని, పదవుల కోసం వచ్చిన వారిలో కొందరు అవకాశవాదులు చల్లగా జారుకున్నారని ఎన్నికల నాటికి ప్రచారం చేసుకోవడమే జగన్ స్ట్రాటజీ. ఆ సంగతి తెలియక విపక్షాలు, మీడియా ట్రాప్ లో పడిపోయాయి..

జగన్ ది పెద్ద ట్రాప్ గేమ్. అందరూ ఒకటై తనను ఏకాకిని చేశారని చెప్పుకోవడమే ఆయన ధ్యేయం. చివరకు తన సోదరిని  కూడా తనకు  వ్యతిరేకంగా మార్చేశారని ప్రచారం మొదలు పెట్టారు. ఎన్నికల నాటికి ఇదీ పీక్ పాయింట్ కు చేరుకునే అవకాశం ఉంది. జగన్ ట్రాప్ లో జనం పడిపాయారా అంటే ఇక ఫలితం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి