తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని అనుకోవడం లేదు. చంద్రబాబు జైలుకు వెళ్లినప్పటి నుండి తెలంగాణలో టీడీపీ కార్యక్రమాలు పూర్తిగా మందగించాయి. మధ్యలో బాలకృష్ణ నేనున్నానంటూ సమావేశం పెట్టారు. కానీ తెర వెనుక ఏం జరిగిందో కానీ.. ఆయన పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. నారా లోకేష్ అసలు తెలంగాణ టీడీపీ మీద దృష్టి పెట్టలేదు. పూర్తిగా పక్కన పెట్టేశారు. కానీ కాసాని జ్ఞానేశ్వర్ మాత్రం పోటీ చేస్తామంటున్నారు. కానీ టీడీపీ పెద్దల మూడ్ చూస్తే ఆయనకూ పరిస్థితి అర్థమైపోతుంది. టీడీపీ పోటీ చేయకపోతే ఎవరికి లాభం కలుగుతుంది ? బీఆర్ఎస్ కు పెద్ద భారం దిగిపోయినట్లవుతుందా ? కాంగ్రెస్‌కు మేలు జరుగుతుందా ?. అసలు ఇదంతా జరగడానికి కారణమని భావిస్తున్న బీజేపీకి లాభం కలుగుతుందా ?
తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బిగ్ ప్లేయర్ కాదు. చంద్రబాబునాయుడు ఖమ్మంలో సభ పెట్టే వరకూ ఆ పార్టీకి క్యాడర్ ఉందని కూడా ఎవరూ అనుకోలేదు. ఖమ్మం .. ఆ తర్వాత సికింద్రాబాద్‌లో సభలు పెట్టి మళ్లీ పార్టీని యాక్టివ్ చే్శారు. కాసాని జ్ఞానేశ్వర్ ను అధ్యక్షుడ్ని చేసిన తర్వాత కొన్ని చేరికలూ జరిగాయి. పార్టీ బలోపేతం అవుతోందని..ఏదో ఓ పార్టీతో పొత్తు లేకపోతే.. బలమైన ఓ ఇరవై స్థానాల్లో పోటీ చేయాలని ప్లాన్లు రెడీ చేసుకున్నారు. కానీ మొత్తం తిరగబడిపోయింది. చంద్రబాబు అరెస్టయినప్పటి నుంచి పొత్తుల గురించి.. టీడీపీ పోటీ గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి.
తెలంగాణలో తెలుగుదేశం పోటీ చేస్తుందా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. నామినేషన్ల సమయం వచ్చే సరికి క్లారిటీ ఇవ్వొచ్చు. ఇప్పటి వరకూ టీడీపీ హైకమాండ్ కు పోటీ చేసే ఉద్దేశం తక్కువగానే ఉన్నట్లుగా జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. పెద్దగా పార్టీ గురించి పట్టించుకోకపోవడమే దీనికి కారణం. తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందా లేదా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. హఠాత్తుగా మంగళవారం ఉదయం కొన్ని సోషల్ మీడియా ఖాతాల్లో టీడీపీ పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుందన్న ప్రచారం ఊపందుకుంది. అయితే టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ వెంటనే స్పందించారు. అతి తప్పుడు ప్రచారం అన్నారు. అయితే టీడీపీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని ఆయన చెప్పలేదు. బుధవారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ అయిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. తెలంగాణ ఎన్నికల కేంద్రంగా టీడీపీ చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. టీడీపీ , బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఓ సారి.. టీడీపీ పోటీ నుంచి వైదొలుగుతుందని మరోసారి ప్రచారం చేస్తున్నారు. అయితే టీడీపీ మాత్రం ఎన్నికలకు సన్నాహాలు చేసుకోవడం లేదు.
చంద్రబాబు అరెస్ట్ అయిన మొదట్లో.. బాలకృష్ణ .. తెలంగాణ టీడీపీ కి తానున్నానని ముందుకు వచ్చారు. అంతా తిరిగి ప్రచారం చేస్తానన్నారు. తర్వాత సైలెంట్ అయ్యారు. చంద్రబాబు కూడా గతంలో ఓ సారి కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయినప్పుడు ఏ విషయం చెప్పలేదు. కానీ ఆ సమావేశం తర్వాత కాసాని 75 మంది అభ్యర్థుల జాబితాను రెడీ చేసుకున్నారు. పోటీ చేస్తామని అంటున్నారు. అయితే చంద్రబాబు నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ రాలేదు. టీడీపీ పోటీ చేయకపోతేనే మంచిదన్న వాదనను కొంత మంది వినిపిస్తున్నారు. పార్టీ పరంగా ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. ఆ నిర్ణయంపై పార్టీ నేతలు ఎలా స్పందిస్తారన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదనేది బీజేపీ అభిప్రాయమని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు అరెస్టు తదనంతరం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే.. ఇదే రాజకీయం ఉందా అన్న అనుమానం కూడా సామాన్యుల్లో వ్యక్తమవుతోంది. చంద్రబాబు అరెస్ట్ అయిన నెల రోజులకు.. నారా లోకేష్.. అమిత్ షాను కలిశారు. ఆ సమయంలో అమిత్ తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు ఉన్నారు. తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఆ చర్చల్లో తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ పాత్రపై చర్చకు వచ్చిందో లేదో తెలియదు. కానీ తర్వాత జనసేనతో పొత్తు కోసం.. పవన్ కల్యాణ్‌తో కిషన్ రెడ్డి చర్చలు జరిపారు. అది ఏమయిందో తెలియదు కానీ.. జనసేనతో కలిసి పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని స్పష్టమయింది. కానీ టీడీపీతో పొత్తులు గురించి ఎవరూ మాట్లడటం లేదు. బహుశా.. టీడీపీ పోటీ చేయకూడదన్నదే బీజేపీ అభిప్రాయమని చెప్పే వారు ఉన్నారు. అయితే టీడీపీ పోటీ చేయకపోతే బీజేపీకి ఎలా మేలు జరుగుతుందన్నది చెప్పడం కష్టం. ఒక వేళ బీజేపీకి .. టీడీపీకి మద్తతు పలికినా టీడీపీ సానుభూతిపరులు బీజేపీకి ఓట్లేస్తారని రాజకీయవర్గాలు కూడా అనుకోవడం లే్దు.తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోతే.. అటు బీఆర్ఎస్కు లేదా.. ఇటు కాంగ్రెస్‌కు మేలు జరిగే అవకాశం ఉంది. ఈ రెండు పార్టీల్లో ఎవరికి ఎక్కువ మేలు జరుకుందన్నదే కీలకం.
తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోతే.. ఆ పార్టీ సానుభూతిపురులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారన్న ప్రచారం ఉంది. దానికి ఇటీవల జరిగిన పరిణామాలు కారణం అవుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ప లు చోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయితే వీటిపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం మోపింది. దీంతో .. టీడీపీ సానుభూతిపరులు అసంతృప్తికి గురయ్యారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కు ఓటు వేయకూడదన్న క్యాంపెన్ నిర్వహించారు. చంద్రబాబు అరెస్ట్ పరిణామాల వెనకు బీజేపీ కూడా ఉందని నమ్ముతున్నారు కాబట్టి.. .లటీడీపీ సానుభూతిపరుల చాయిస్ కాంగ్రెస్సేనన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఆ విశ్లేషణ కరెక్ట్ కాదనే వాళ్లు కూడా ఉన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి టీడీపీకి మద్దతుగా ఉండే సానుభూతిపురుల.. బీఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెల్చుకుంది సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే. టీడీపీ కూడా ఆయా ప్రాంతాల్లో బలంగా ఉందని అనుకుంటున్నారు. అయితే చంద్రబాబు అరెస్టు తర్వాత పరిణామాలు… ఏపీలో సీఎం జగన్‌కు బీఆర్ఎస్కు మద్దతుగా ఉండటం వంటి అంశాలను చూస్తే. బీఆర్ఎస్కు ఈ సారి టీడీపీ సానుభూతిపరులు ఓట్లు వేయరని చెబుతున్నారు. అందుకే వారంతా కాంగ్రెస్ వైపు మళ్లుతారని అంటున్నారు. ఒక వేళ టీడీపీ పోటీ చేస్తే టీడీపీకే వేస్తారని.. దాని వల్ల ఓట్ల చీలిక వస్తుందని చెబుతున్నారు. ఇలా జరిగే అవకాశం ఉంటే.. బీజేపీ ఖచ్చితంగా టీడీపీ పోటీ కి దూరంగా ఉండాలని కోరుకోదు.
తెలుగుదేశం పార్టీ అంటూ పోటీ చేస్తే.. ఒకటి, రెండు స్థానాలు అయినా దక్కించుకుంటుందో లేదో చెప్పడం కష్టం. ఎందుకంటే ఆ పార్టీ చాలా వరకూ నిర్వీర్యం అయిపోయింది. బలమైన అభ్యర్థి దొరికితే.. గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం వంటి చోట్ల..ఒకటి , రెండు చోట్ల గెలుపొందే్ అవకాశం ఉంది.కానీ కనీసం నలభై నియోజకవర్గాల్లో గెలుపోటముల్ని తారుమారు చేసే రీతిలో ఓట్లు పొందుతుందన్న అభిప్రాయం మత్రం బలంగా ఉంది. అందుకే ఆ పార్టీని పోటీకి దూరం చేయాలని కొన్ని పార్టీలు్ గట్టిగా ప్రయత్నిస్తున్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు తెలుగుదేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆధారాల్లేని కేసులో జైలులో పెట్టారని ఆక్రోశిస్తున్నారు కానీ.. న్యాయస్థానాల్లో పిటిషన్లు ఆలస్యమవుతున్నాయి. స్కిల్ కేసులో ఏ 1 రెండు, మూడు వారాలకే బెయిల్ తెచ్చుకోగా..ఏ 37గా ఉన్న చంద్రబాబు మాత్రం 50 రోజులుగా జైల్లో ఉన్నారు. ఇంకా ఎంత కాలం ఉండాలో తెలియడం లేదు. అందుకే తెలంగాణ ఎన్నికలపై టీడీపీ ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతోందన్న వాదన వినిపిస్తోంది. ఈ సారికి ఎన్నికలకు దూరంగా ఉండటమే మంచిదని ఎక్కువగా ఏపీ నాయకులు కూడా కోరుకుంటున్నారు.తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. అన్నింటినీ అధిగమించింది.. కానీ రాష్ట్రం విడిపోయినప్పటి నుండి ఆ పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లు కొత్తవి. ఎలా అధిగమిస్తుందో చూడాల్సి ఉంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…