సుదీర్ఘ కాలం ఏపీ సీఎంగా పనిచేసిన ఘనత చంద్రబాబుది.ఇప్పటికిప్పుడు ఆయన రికార్డును ఎవ్వరూ బద్దలు కొట్టలేరన్నది నిజం. అందుకే ఈ సారి చంద్రబాబు అధికారానికి వచ్చిన తర్వాత టీడీపీలో చేరేందుకు ప్రత్యర్థి పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. ఏదో విధంగా చేర్చుకోవాలని, ఇకపై పార్టీని అంటిపెట్టుకునే ఉంటామని చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం మారిపోయారట. ఇంతకాలం అంకితభావంతో పనిచేసిన వారికి తొలి ప్రాధాన్యమిచ్చేసి… వీలును బట్టి కొత్తగా వచ్చేవారికి అవకాశాలు ఉంటాయని అంటున్నారట. అంటే దాదాపుగా టీడీపీలో హౌస్ ఫుల్ బోర్డు పెట్టినట్లేనని చెప్పుకుంటున్నారు.
ఒక రాజకీయ నేతగా చంద్రబాబు కొత్త రికార్డును నమోదు చేసుకుంటున్నారు. 28 ఏళ్లకే ఉమ్మడి ఏపీ వంటి రాష్ట్రానికి మంత్రి కావడం అయిన ఘనత. మహా నటుడు ఎన్టీఆర్ కు అల్లుడు కావడం అయిన ప్రత్యేకత. ఇక రాజకీయ జీవితానికి వస్తే చంద్రబాబుది చెరగని ముద్ర. ఎందుకంటే.. ఉమ్మడి ఏపీకి సీఎంగా రెండుసార్లు వరుసగా పనిచేసిన ఆయన.. విభజిత ఏపీకి కూడా రెండుసార్లు సీఎంగా పనిచేసిన నాయకుడిగా నిలిచిపోతారు.చంద్రబాబు ఉమ్మడి ఏపీకి 1995-2004 మధ్య వరకు సీఎంగా వ్యవహరించారు. అంటే.. దాదాపు 9 సంవత్సరాల 3 నెలలు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.2014-19 మధ్య పూర్తికాలం విభజిత ఏపీకి సీఎంగా వ్యవహరించారు. ప్రస్తుతం రెండోసారి 2024 జూన్ నుంచి సీఎంగా ఉన్నారు. ఈ విడతలో ఐదేళ్లు కలుపుకొంటే ఆయన మొత్తం మీద దాదాపు 20 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నట్లు లెక్క. తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ దక్కని రికార్డుగా దీనిని చెప్పుకోవచ్చు. ఇక ప్రతిపక్ష నేతగానూ చంద్రబాబు దాదాపు ఇంతే కాలం. 1989-94, 2004-14, 2019-24 మధ్యన 20 ఏళ్లకు పైగా ఆయన ప్రతిపక్ష నేతగా లేదా ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడిగా ఉన్నారు. బహుశా ఇది కూడా రికార్డే..1995లో తొలిసారి చంద్రబాబు సెప్టెంబరు 1న ఏపీకి సీఎం అయ్యారు. చంద్రబాబు ఎక్కువ కాలం సీఎంగా ఉండటానికి ఆయన పాలనా దక్షత, చాణక్యం, చాకచక్యం, ఎవ్వరినీ నొప్పించనితనమని చెబుతారు.ఎవరూ వచ్చినా ఆహ్వానించడం ఆయన ప్రత్యేకత..అలాంటిది ఈ సారి మాత్రం ఆయన ప్రతీ ఒక్కరినీ పార్టీలోకి తీసుకోదలచుకోలేదు. వైసీపీ హయాంలో డక్కాముక్కీలు తిన్న పార్టీ వారికి తొలి ప్రాధాన్యమిచ్చి…తర్వాతే ఎవరినైనా చేర్చుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారట. ప్రతీ ఒక్కరినీ చేర్చుకుని పార్టీలో డిసిప్లీన్ ను దెబ్బతీసుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదని చెబుతున్నారు. వైసీపీకి మోపిదేవి, బీద మస్తాన్ రావు రాజీనామా చేయగా… ఇంతవరకు టీడీపీ వైపు నుంచి వెంకటరమణకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మిగతా వారి సంగతి తర్వాత చూద్దామని అనేశారట. అల్లాటప్పా వాళ్లనందరినీ చేర్చుకుంటే తమ పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని చంద్రబాబు భావిస్తున్నారు. గత ఐదేళ్లలో నాయకుల ప్రవర్తనను సమీక్షించిన తర్వాతే వారిని చేర్చుకోవాలా వద్దా అన్నది తీర్మానించుకుంటారని పార్టీ వర్గాల సమాచారం. ప్రతీ ఒక్కరికీ గేట్లు తెరిచే సంస్కృతి వద్దని చంద్రబాబు డిసైడైనట్లేనని టీడీపీ వర్గాల సమాచారం..
చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. మొదటి నుంచి ఆయనది మెతక వైఖరి అని…. పోనీలే పాపం అనుకునే తీరు అని చెప్పుకుంటారు. అలాంటిది ఇప్పుడు మాత్రం ఖచితంగా ఉండాలని చంద్రబాబు అనుకుంటున్నారట. పార్టీ ఫస్ట్ అని చెప్పేస్తున్నారట. పార్టీ కేడర్ ను డెవలప్ చేసుకుంటే…భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడుతుందన్నది చంద్రబాబు అభిప్రాయం….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…