“నా కొడకల్లారా బట్టలు ఊడదీయించి కొడతాం. ఒరేయ్.. నా కొడకా మేం అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఛంపేస్తాం… మేం అధికారంలోకి రాగానే ఈ నాకొడుకుల చేత ఉచ్చ పోయించే బాధ్యత నేను తీసుకుంటా… మీ బాబే ఏమీ చేయలేకపోయాడు నువ్వేం చేస్తావురా నా కొడకా”
ఇవీ ఆంధ్ర ప్రదేశ్ లో పాలక విపక్షాల మధ్య సాగుతోన్న సంభాషణలు. ఒకరినొకరు తిట్టిపోసుకుంటోన్న వైనాలు. పచ్చి బూతులను అవలీలగా సంధిస్తూ చుట్టూరా ఉన్నవారిని కంగారు పెట్టేసేలా రాజకీయ పార్టీల నేతలు వ్యవహరిస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు నానాటికీ దిగజారుతున్నాయి. రాజకీయ ప్రత్యర్ధులకు సవాళ్లు విసురుకోవడం..విమర్శించుకోవడం సహజం .కానీ ఏపీలో రాజకీయ పార్టీలు ఆ గీతను ఏనాడో దాటేశాయి. ఇపుడు ఏకంగా తాము అధికారంలోకి వస్తే తమ ప్రత్యర్ధులను చంపేస్తాం నా కొడకల్లారా అంటూ బెదిరిస్తున్నారు. అండర్ వేర్ తో నేతలను నడి వీధిలో నిలబెడతామంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. టిడిపి తో పాటు జనసేన కూడా ఈ ద్వేష భాషలో పాతాళం దిశగా దూసుకుపోతోంది. విపక్షాలు విరుచుకు పడుతోంటే వాటికి కౌంటర్ ఇచ్చే మిషతో పాలకపక్ష నేతలు కూడా సంయమనం కోల్పోయి కొడకల్లారా భాషను చాలా స్వేచ్ఛగా వాడేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ రోజు రోజుకీ చౌకబారు రాజకీయాలు చేస్తోంది. కాంగ్రెస్ తర్వాత సుదీర్ఘకాలం ఏపీలో అధికారంలో ఉన్నది ఈ పార్టీయేనా అని రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్యర్యపోవలసిన పరిస్థితి.కొద్ది రోజుల క్రితం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పుంగనూరు లో పోలీసులపైకి తమ గూండా కార్యకర్తలను ఉసిగొలుపుతూ తరమండి నా కొడుకులని..కొట్టండి నా కొడుకుల్ని అని రెచ్చిపోయారు. పోలీసులు బట్టలు ఊడదీయించి కొడతామని హెచ్చరించారు. చివరకు చంద్రబాబు ప్రేరేపణతో టిడిపి గూండాలు చేసిన దాడిలో యాభై మంది దాకా పోలీసులు గాయపడ్డారు. రణధీర్ అనే కానిస్టేబుల్ అయితే కంటి చూపుకోల్పోయారు.
ఆవు చేల్లో మేస్తోంటే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత చందాన నాలుగున్నర దశాబ్ధాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడే ఇలా బరితెగిస్తే .. రాజకీయంగా అనుభవ శూన్యుడు అయిన నారా లోకేష్ ఏం చేస్తారు. నాన్న బాటలోనే నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. పాలక పక్ష నేతలను ఉచ్చ పోయించే బాధ్యత తాను తీసుకుంటానంటున్నారు లోకేష్. అంతే కాదు ఓ ఎర్ర డైరీ ఒకటి పట్టుకుని తమకు నచ్చని వారి పేర్లను ఆ రెడ్ బుక్ లో నోట్ చేసుకుంటున్నానని..తాము అధికారంలోకి వస్తే ఒక్కో నాకొడుకు అంతు చూస్తానని లోకేష్ హెచ్చరిస్తున్నారు.
తన తండ్రిలా తాను అంత మంచి వాణ్ని కాదని తాను మూర్ఖుణ్ని అని లోకేష్ తన గురించి తానే వర్ణించుకున్నారు.
తాజాగా ఎన్టీఆయర్ జిల్లా గన్నవరంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా బహిరంగ సభ పెట్టారు. అందులోనూ రెడ్ బుక్ తీసి ప్రత్యర్ధులను బెదిరించారు లోకేష్. ఇక లోకేష్ ఆదేశాలతో టిడిపి నేతలు దేవినేని, బోండా ఉమ, బుద్దా వెంకన్నలు రౌడీ భాషలో పేట్రేగిపోయారు.
తాము అధికారంలోకి వస్తే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను చంపేస్తాం అని బెదరించారు టిడిపి నేతలు.ఇంతకన్నా దౌర్జన్యకర రాజకీయాలు ఇంకెక్కడా ఉండవంటున్నారు రాజకీయ పండితులు.
టిడిపి అధినేత చంద్రబాబు సూచనల మేరకే పవన్ కళ్యాణ్ ఇటువంటి భాష మాట్లాడుతున్నారో..లేక పవన్ కళ్యాణ్ నుండే చంద్రబాబు నాయుడు ద్వేష భాషలో తర్ఫీదు పొందారా అన్నది ఆ పార్టీల నేతలే చెప్పాలంటున్నారు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నేతలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్ర సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిని కూడా టిడిపి నేతల మాదిరిగానే బట్టలు ఊడదీయించి నడి రోడ్డుపై ఊరేగిస్తానని హెచ్చరించారు. ఇందులో పాలక పక్ష నేతలు కూడా తక్కువ తినలేదు. వీళ్లకి కౌంటర్లు ఇచ్చే క్రమంలో వైసీపీ నేతలు కూడా హద్దులు మీరి అసభ్య పదజాలంతో పేట్రేగిపోతున్నారు. అందరూ కలిసి రాజకీయాలపై ద్వేష భాషతో దాడులు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…