అవకాశం ఉంది.మరి ఆహ్వానమూ ఉందా..

By KTV Telugu On 16 July, 2024
image

KTV TELUGU :-

ఎన్నికల్లో ఓడిన నెల తర్వాత వైసీపీలో ఒక పెద్ద వికెట్ పడిపోయే ప్రమాదం  ఏర్పడింది. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పక్క  చూపులు చూస్తున్నారన ప్రచారం మొదలైంది. ఒకప్పుడు జగన్ కు  అత్యంత సన్నిహితుడిగా  ఉన్న బుగ్గన  ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. వైసీపీ నుంచి వైదొలిగి బీజేపీలో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. జగన్ పాలనలో ఐదేళ్లకాలం  ఆయన ఢిల్లీ  టు విజయవాడ  తిరుగుతూ రాష్ట్రానికి  అప్పులు తీసుకొచ్చే వారు. ఆ క్రమంలో ఢిల్లీ బీజేపీ పెద్దలతో బాగా పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలతోనే  ఆయన కమలం పార్టీ వైపుకు చూస్తున్నారని రాజకీయ వర్గాలో చర్చ జరుగుతోంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ద్వారా బుగ్గన బీజేపీలో ఎంట్రీకి ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే కొంత మేర గ్రౌండ్ వర్క్ జరిగిందని కూడా చెబుతున్నారు.

ఢిల్లీ  బీజేపీలోని ఒక వర్గం  ఆంధ్రప్రదేశ్ నుంచి అందుకున్న ఇన్  పుట్స్ ఆధారంగానే బుగ్గనను పార్టీలోకి ఆహ్వానించినట్లుగా అనుకుంటున్నారు. అయితే జగన్ పాలనలో బుగ్గన కీలకంగా వ్యవహరించినందున ఆయన్ను చేర్చుకునేందుకు ఏపీలో కూటమి నేతగా చంద్రబాబు అడ్డు చెబుతారని బీజేపీ అనుమానిస్తోంది.అటువైపు క్లారిటీ వస్తే, చంద్రబాబుకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే  బుగ్గనను చేర్చుకోవడం ఖాయమవుతుందని కూడా ఒక వాదన ప్రచారంలో ఉంది.పైగా  ఏపీ ఆర్థిక వ్యవస్థను బుగ్గన అస్తవ్యస్తం చేసి, అథోగతిపాలు చేశారన్న టీడీపీ   ఆరోపిస్తూ వచ్చింది.  ఈ దిశగా కూడా ఆలోచించిన  తర్వాతే బుగ్గన ఎంట్రీకి అవకాశం ఉంటంది. అయితే ఏపీ బీజేపీలోనే  విస్తృతాభిప్రాయం ఇంకా తీసుకోలేదు. పార్టీ నేతల ఏమనుకుంటున్నారో ఇంచార్జీలు  ఇంకా సమాచారం  సేకరించాల్సి ఉంది. రాయలసీమ జిల్లాలో సొంతంగా బీజేపీ బలపడాలనుకుంటోంది. అలాంటప్పుడు బుగ్గన లాంటి ఇంటలెక్చువల్స్ సాయం అవసరమా అన్నదే పెద్ద ప్రశ్న.

పార్టీ మారే విషయంలో బుగ్గన చాలా గుంభనంగా ఉంటున్నారు. ఆయన ఇప్పుడే బయటపడ దలచుకోలేదు. అందుకే బుగ్గన వైసీపీలోనే ఉంటారని పార్టీ తరపున అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత కూడా దాన్ని ధృవపరుస్తూ  ఆయన మాట్లాడలేదు. మౌనంగా వినిఊరుకున్నారు. సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను అన్నట్లుగా  ఆయన తీరు ఉంది. ఢిల్లీ  బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఓపెన్  అవ్వాలని  బుగ్గన భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. రెడ్ సిగ్నల్ వచ్చిన పక్షంలో వైసీపీలో కొనసాగే  విధంగా  ఆయన ప్లాన్  చేసుకుంటున్నట్లు  సమాచారం…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి