బీఆర్ నాయుడుకి టీటీడీ చైర్మన్ పదవి

By KTV Telugu On 1 November, 2024
image

KTV TELUGU :-

సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. తిరుమల తిరుపతి దేవస్థానం.. టీటీడీ పాలకమండలిని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. నామినేటెడ్ పదవులు ఇంతగా ఎందుకు జాప్యమవుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ ఊపందుకున్న తరుణంలోనే చంద్రబాబు వాటన్నింటికీ తెరదించుతూ… టీటీడీ చైర్మన్‌గా TV5 న్యూస్ చానెల్ చైర్మన్ బీఆర్ నాయుడు పేరును ప్రకటించారు. 24 మంది సభ్యులతో పాలకమండలిని కూడా ఏర్పాటు చేశారు.

సభ్యులుగా జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎంఎస్ రాజు, పనబాక లక్ష్మీ, నర్సిరెడ్డి, సాంబశివరావు, సదాశివరావు, జంగా కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు. జస్టిస్ H.L.దత్, శాంతారామ్, పి.రామ్మూర్తి,జానకీదేవి తమ్మిశెట్టి, బొంగునూరు మహేందర్‌రెడ్డి,అనుగోలు రంగశ్రీ, బి.ఆనందసాయి, సుచిత్రా ఎల్లా, నరేష్ కుమార్, డా.అదిత్ దేశాయ్, సురభ్ H.బోరా కూడా సభ్యులుగా ఉంటారు.

పాలక మండలి నియామకం జాప్యం కావడంతో అసలు బీఆర్ నాయుడుకు అవకాశం ఉంటుందా లేదా అని అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఎవరో కొత్త వ్యక్తికి ఆ అవకాశం ఇస్తారని భావించారు. అయితే ఎట్టకేలకు బీఆర్ నాయుడునే ఆ పదవి వరించింది.అలాగే వైద్య రంగానికి చెందిన సుచిత్ర ఎల్లాకు కూడా టీటీడీ సభ్యత్వం వచ్చింది. కరోనా వ్యాక్సిన్ తయారీలో ఆయన కీలక భూమిక పోషించారు.మరో పక్క బోర్డు నియామకంలో అన్ని రాష్ట్రాలకు అన్ని సామాజిక వర్గాలకు సముచిత స్థానం లభించినట్లు చెబుతున్నారు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి