ఉండవల్లి శ్రీదేవి జాక్ పాట్ కొట్టారా ? టీడీపీకి అభ్యర్థులే లేరా.. !

By KTV Telugu On 16 August, 2023
image

KTV Telugu ;-

ఏపీ రాజకీయాలు మారుతున్నాయి. వైసీపీ నేతలు ఇప్పుడు సైకిలెక్కేందుకు రెడీ అవుతున్నారు. కొంతమంది ఇప్పటికే పచ్చ కండువా కప్పుకోగా, మరి కొందరు కర్ఛిఫ్ వేసి ఎదురు చూస్తున్నారు.అందులో ఒకరైన ఉండవల్లి శ్రీదేవి మాత్రం జాక్ పాట్ కొట్టినట్లే కనిపిస్తున్నారు. ఆమెకు చంద్రబాబు, ఎంపీ సీటు కేటాయించినట్లుగా చెబుతున్నారు. అందుకే ట్రయల్ రన్ గా ఆమెను అమరావతి సభకు వ్యాఖ్యతగా నిలబెట్టారని పార్టీ వర్గాలు అంటున్నాయి..

ఇప్పటి దాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క, ఇకపై వచ్చే లెక్కే అసలు లెక్క, ఇప్పటి దాకా జరిగిన లెక్కను మరిచిపో ఇంక. అనేది ఇప్పుడు తెలుగుదేశం పెద్దల్లో వినిపిస్తున్న మాట. ఎవరు ఏ మనుకున్నా విజయావకాశాలను బేరీజు వేసుకుని వైసీపీ వాళ్లను చేర్చుకునేందుకు వెనుకాడకూడదన్నది చంద్రబాబు ఆలోచనా విధానం, దాన్ని అమలు చేసే దిశగా ఉండవల్లి శ్రీదేవిని అధికారికంగా పార్టీలో చేర్చుకోకముందే యువనేత నారా లోకేష్ సరసన కూర్చోబెట్టారు. శ్రీదేవి కూడా గతంలో తప్పుచేసినట్లుగా ఒప్పుకుని, వాటన్నింటింకీ పశ్చాత్తాప పడుతున్నట్లుగా మాట్లాడేశారు.

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసి చాలా ఫేమస్ అయ్యారు. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధను గెలిపించేందుకు తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఈ క్రమంలో సూట్ కేసులు చేతులు మారాయని చెబుతారు అది ఎంతవరకు నిజమో మనం చెప్పలేము. కాకపోతే ఆమెను వైసీపీ నుంచి సస్పెండ్ చేసినప్పటి నుంచి ఉండవల్లి శ్రీదేవి టీడీపీలో చేరేందుకు చేయని ప్రయత్నం లేదు. ఇటీవలే ఉత్తరాంధ వెళ్లి చంద్రబాబుతో భేటీ అయ్యారు కట్ చేసి చూస్తే యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో భాగంగా రావెల శివారులో అమ‌రావ‌తి ఆవేద‌న స‌భ‌కు ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ‌దేవి మాట్లాడుతూ వైసీపీ గుర్తుపై గెలిచిన కార‌ణంగా ఉద్య‌మంలోకి రాలేక‌పోయాన‌ని అన్నారు. త‌న వెనుక చంద్ర‌బాబు, లోకేశ్ ఇప్పుడు ఉన్నార‌ని, కావున త‌న‌నెవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని ఆమె చెప్పారు.అమరావతి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులని పదే పదే సంభోదించిన ఉండవల్లి శ్రీదేవి ఇప్పుడు మాత్రం వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానంటున్నారు.

శ్రీదేవి తన రాజకీయ భవిష్యత్తుపై పూర్తి క్లారిటీతోనే టీడీపీ వైపుకు వస్తున్నారు. ఆమెకు బాపట్ల ఎంపీ సీటు హామీ ఇచ్చారని టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన విద్యాధికురాలైన శ్రీదేవిని బాపట్ల ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తే బావుంటుందని నిర్ణయించుకున్న చంద్రబాబు ఆ దిశగా ఆమెకు సంకేతాలు పంపి పనిచేసుకోమని ఆదేశించినట్లు సమాచారం. అందుకే రావెల శివార్లలో జరిగిన సభకు స్థానిక నాయకుడైన శ్రవణ్ కుమార్ అభ్యతరం చెప్పలేదు. మాజీ ఎమ్మెల్యే అయిన శ్రవణ్ కుమార్ వచ్చే ఎన్నికల్లో కూడా తాడికొండ నుంచే పోటీ చేస్తారని అధిష్టానం హామీ ఇప్వడంతో శ్రీదేవి రాకను వ్యతిరేకించే అవకాశం కూడా లేకపోయింది. కాకపోతే ఇవాళ వచ్చిన శ్రీదేవికి ఎంపీ టికెట్ ఎందుకు ఇస్తున్నారన్న ప్రశ్నే సర్వత్రా వినిపిస్తోంది. టీడీపీకి ఎంపీ అభ్యర్థులు లేరన్న సమాధానమూ వెంటనే వినిపిస్తోంది. దానితో ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లలో కొన్ని మార్పులు కూడా చేసే అవకాశం ఉంది. నరసరావుపేట ఎంపీ లావు కృష్టదేవరాయలు టీడీపీ అభ్యర్థిగా గుంటూరు లోక్ సభా స్థానం నుంచి పోటీ చేస్తారట. ప్రస్తుతం గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ చంద్రగిరి శాసనసభా స్థానం నుంచి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. గతంలో టీడీపీలో పనిచేసి ఇప్పుడు వైసీపీలో ఉన్న మోదుగుల వేణగోపాల్ రెడ్డి మళ్లీ టీడీపీలోకి వచ్చి నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉండవల్లి శ్రీదేవి జాక్ పాట్ కొట్టడం మరో ఎత్తు. ఎందుకంటే బాపట్ల లోక్ సభా నియోజకవర్గంలో వైసీపీ పట్ల పెరుగుతున్న వ్యతిరేకత శ్రీదేవి గెలుపును సునాయాసం చేస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

శ్రీదేవి రాక పట్ల అమరావతి రైతుల్లో ఎక్కువ మంది అసహనంగానే ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకాలం టీడీపీ తమకు పూర్తి మద్దతిస్తుందనుకుంటే సీన్ మారిపోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి త‌న రాజ‌కీయ స్వార్థం కోసం టీడీపీ పంచ‌న చేరి, అమ‌రావ‌తికి మ‌ద్ద‌తు తెలుపుతోందే త‌ప్ప‌, ప్రేమ‌తో కాద‌ని వారు అంటున్నారు. అమరావతికి జై కొడుతున్న టీడీపీ తర్వాత మనసు మార్చుకోకుండా ఉండాలని రైతులు ప్రార్థిస్తున్నారు. అమరావతి పరిరక్షణ సమితికి చెందిన కొలికిపూడి శ్రీనివాసరావు అయితే శ్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించడాన్ని వ్యతిరేకించారు. ఇది అమరావతి రైతులకు జరిగిన అత్యంత దారుణమైన అవమానంగా పరిగణించారు. చంద్రబాబు ఆలోచన ఎలా ఉందో మరి..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి