జైల్ డైరీ ! చంద్రబాబుకు ఏమైంది…?

By KTV Telugu On 14 October, 2023
image

KTV TELUGU :-

చంద్రబాబు ఆరోగ్యానికి ఏమైంది.  అవి కేవలం చర్మ సంబంధిత ఆరోగ్యమైనే.. మరేమైనా ఉంది.  చంద్రబాబు జైలుకు వెళ్లిన  తర్వాత రెండు వారాల్లో రెండు సారు ఆయన తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారు.  అసలేం జరుగుతోంది. ఓ సారి చూద్దాం..

మాజీ ముఖ్యమంత్రిని జైలులో పెట్టి నెల దాటింది. కేసులు  ఒక కొలిక్కి రావడానికి మరో వారం పడుతుందన్న ఫీలింగ్ వస్తోంది. రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు కోర్టులో ఊరట దక్కడం లేదు. ఒకటి రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ వచ్చినా ఆయన జైలు గేటు దాటి బయటకు  రావడానికి కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. ఈ పరిస్తితుల్లోనే 73 ఏళ్ల చంద్రబాబు అరోగ్య పరిస్తితి  పార్టీ కేడర్ ను టెన్షన్లో పడేస్తోంది. ఆయనకు  దీర్ఘకాలిక సమస్యలు కొన్నయితే జైలులో ఉండటం కారణంగా వస్తున్న సమస్యలు మరికొన్ని ఉన్నాయి. అయితే జైల్లో భద్రత, వసతులపై కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ   వర్గాలు ఆందోళన చెందుతూ వస్తున్నాయి. చంద్రబాబు ఉన్న బ్యారెక్ చుట్టూ చెట్లు ఉండడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఒక రిమాండ్ ఖైదీ సైతం డెంగ్యూ బారిన పడి మృతి చెందడంతో.. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో పార్టీ శ్రేణులకు భయం పట్టుకుంది. రాజమండ్రి వేడికి, జైలులో సరైన వసతులు లేకపోవడంతో చంద్రబాబు ఉక్కపోతకు, డీ హైడ్రేషన్ కు గురయ్యారు.

డిహైడ్రేషన్ ఏర్పడిన ఒకటి రెండు రోజులకే  చంద్రబాబు అలర్జీకి లోనయ్యారు. బరువు కూడా తగ్గారు. నెలలో  తగ్గాల్సిన దానికంటే ఎక్కువగా తగ్గడంతో జైలు అధికారులు సైతం ఆందోళన చెందారు. అన్ని  దానితో రాజమండ్రి జీజీహెచ్ కు సమాచారమిచ్చి ఇద్దరు వైద్య నిపుణులను రప్పించారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి లేఖ రాసి చర్మ వైద్య నిపుణులను పంపించాలని కోరారు.. దీంతో జిజిహెచ్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్, మరో అసోసియేట్ ప్రొఫెసర్ ఒకరు గురువారం సాయంత్రం జైలుకు వెళ్లి చంద్రబాబును పరీక్షించారు.రెండు గంటల విరామం  తర్వాతే హెల్త్ బులెటిన్ రావడంతో ఈ లోపు చంద్రబాబు ఆరోగ్యంపై కేడర్ కు మరింత టెన్షన్ పెరిగింది.  మరోవైపు చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని.. ఆయన అలెర్జీతో బాధపడుతున్నారని.. మందులు ఇచ్చామని.. ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని జైలు ఇన్చార్జ్ రాజ్ కుమార్ చెప్పడం బాగానే ఉన్నా.. జైల్లో చంద్రబాబు నిర్లక్ష్యానికి గురవుతున్నారన్న భయం నెలకొంది. చంద్రబాబు ఐదు కేజీల బరువు తగ్గారని నారా  బ్రాహ్మణి గుర్తు చేశారు. ఇంకొంచెం బరువు తగ్గితే దాని ప్రభావం కిడ్నీలపై ఉంటుందని ఆమె ఆందోళన చెందుతున్నారు. వైద్య నిపుణులు కూడా ఆయన పరిస్తితిపై ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో పారిశుద్ధ్యం లోపించడంతో  స్నేహా బ్లాక్ లో కూడా పరిస్తితి బాగోలేదని వార్తలు వస్తున్నాయి.

నిజానికి చంద్రబాబుకు చిన్న వయసు నుంచే  చర్మ సమస్యలు ఉన్నాయి. ఆయనకు లూకోడెర్మా అనే అనారోగ్యం ఉంది. ఎండవేడిమి ఆయన దేహానికి ఎక్కువ సేపు తగలకూడదు. ఉష్ణానికి ఆయన ఎక్స్ పోజ్ కాకూడదు. ఐనా రాజమండ్రి జైలులో  దానికి తగ్గట్టుగా ఆయనకు వసతులు కల్పించలేదు. అదీ  ముమ్మాటికి జగన్ ప్రభుత్వ తప్పిదమేనని, చంద్రబాబును వేధించాలనే ప్రభుత్వం సరైన వైద్య సదుపాయాలు కూడా కల్పించడం లేదని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. చంద్రబాబును అత్యాధునిక వసతులు ఉన్న ఆస్పత్రికి తరలించాల్సిన తరుణంలో  జైలు గోడల మధ్య మగ్గేట్టు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం చెందుతున్నారు. వాడవాడలా టీడీపీ నేతలు చేస్తున్న దీక్షల్లో చంద్రబాబు ఆరోగ్యం కూడా ఒక టాపిక్ అవుతుందని చెప్పక   తప్పదు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి