కాసాని రహదారా ? మరోదారా ?

By KTV Telugu On 28 October, 2023
image

KTV TELUGU :-

కాసాని జ్ఞానేశ్వర్ లో తప్పుచేశానన్న భావన కనిపిస్తోందా. టీడీపీలో చేరి ఆయన సాధించిందీ శూన్యమా. ఇప్పుడు కొత్త పార్టీ వెదుక్కుంటున్నారా.. ఆయన ఏ పార్టీ వైపు చూస్తున్నారు. ఆ పార్టీలోకి ఆహ్వానాలు అందుతున్నాయా… వస్తే  ఆయనకు, ఆయన కుటుంబానికి మంచి భవిష్యత్తు ఉంటుందని సూచనలిస్తున్నారా.. కాసాని జ్ఞానేశ్వర్ మదిరాజ్ . సక్సెస్ తక్కువ ఫెయిల్యూర్ ఎక్కువ.  అయినా ఆయన ఆశావాది. రాజకీయాల్లో మార్పు కోసం  ప్రయత్నించాలన్న కోరిక ఆయనలో ఎప్పుడూ కనిపిస్తుంది. ఎక్కడున్నా యాక్టివ్ గా ఉండాలన్న తపన కనిపిస్తుంది. అనారోగ్యంగా ఉన్న చలాకీగా కనిపించాలన్న దృఢనిశ్చయం ఆయనలో ఉంటుంది. అలాంటి జ్ఞానేశ్వర్.. టీడీపీలో చేరి ఇప్పుడు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అనుకున్నదొక్కటీ ఐనది ఒక్కటీ అన్నట్లుగా కాసాని తీవ్ర మనోవేదనకు లోనవతున్నట్లు సమాచారం.

కాసాని టీడీపీలో చేరిన వెంటనే ఆయనకు తెలంగాణ శాఖాధ్యక్ష పదవి దక్కింది. అప్పటి నుంచి కార్యకర్తల సమీకరణలో ఆయన బిజీగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీతో టీడీపీకి మళ్లీ కొత్త ఊపిరి వస్తుందని  కాసాని ఎదురు చూశారు. సెటిలర్ల ఓట్లు పార్టీకి వెన్నుదన్నుగా ఉంటాయనుకున్నారు. తెలంగాణలో ఈ సారి కనీసం 5 నుంచి 10 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని ఆయన అంచనా వేశారు. ఇప్పుడు అసలు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న చంద్రబాబు నిర్ణయంతో కాసాని పూర్తిగా కృంగిపోయారు. ఇది అన్యాయమని గట్టిగా అరవలేని పరిస్థితుల్లో తన అనుచరుల వద్ద ఆవేదన చెందుతున్నారు.

కాసాని టీడీపీలో చేరిన తర్వాత ఖమ్మంలో భారీ బహిరంగ సభ జరిగింది.టీడీపీ పునరుజ్జీవం ఖాయమన్న ఫీలింగ్ వచ్చింది. దానితో  పార్టీ కోసం కాసాని  విపరీతంగా డబ్బులు ఖర్చుపెట్టేశారట. ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకూడదన్నది…. బీజేపీకి అనుకూల నిర్ణయమని టీడీపీ వర్గాలు చెబుతున్నప్పటికీ కాసాని మాత్రం కాంగ్రెస్ కు  మేలు చేసేందుకే చంద్రబాబు ఈ  నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారట. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఇప్పుడు చంద్రబాబు తెలంగాణలో టీడీపీని అదే కాంగ్రెస్ పార్టీకి అమ్మేసే ప్రయత్నంలో ఉన్నారని కాసాని తన అనుచరుల వద్ద ఆరోపిస్తున్నారు. ఇక లాభం లేదనుకుని పార్టీ మారే  ప్రయత్నంలో కాసాని పలువురిని సంప్రదిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఆయనకు ఆహ్వానం అందినట్లు చెబుతున్నారు.కేసీఆర్ ఆయన్ను బేషరత్తుగా పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. కాసాని ఇప్పటికే ఓ సారి కేటీఆర్ తో మాట్లాడారని బీఆర్ఎస్లోకి వస్తే బావుంటుందని అందరూ కలిసి పనిచేసుకుందామని కేటీఆర్ అన్నట్లుగా సమాచారం. ఒకటి రెండు రోజుల్లో కాసాని తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని  సన్నిహిత  వర్గాల సమాచారం.

1970లలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్… తర్వాత మన పార్టీ స్థాపించారు. రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ అయ్యారు. శాసనమండలి సభ్యుడయ్యారు. అదంతా ఒక వంతయితే ముదిరాజ్  మహాసభ అధ్యక్షుడిగా తన సామాజికవర్గానికి ఏమీ చేసుకోలేకపోయానన్న తపన ఆయనలో ఉంది. టీడీపీలో చేరినా ప్రయోజనం లేకపోవడంతో ఆయన ఇప్పుడు బీఆర్ఎస్  వైపు చూస్తున్నారు. ఎన్నికల వేళ చేరికలు ప్రయోజనం కలిగిస్తాయని బీఆర్ఎస్ భావిస్తోంది. పైగా ముదిరాజ్ సామాజిక వర్గానికి తమపై ఉన్న ఆగ్రహం చల్లారాలంటే కాసాని లాంటి వాళ్లను చేర్చుకోవాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి