అక్టోబరు 4న ఏమవుతుందో ?

By KTV Telugu On 3 October, 2023
image

KTV TELUGU :-

చంద్రబాబుకు కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయా. అక్టోబరు 3న సుప్రీ కోర్టులో విచారణ కంటే అక్టోబరు 4న జరిగే మరో కేసు విచారణ ఆయనకు కీలకంగా మారింది.  రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఈ కేసు మార్చెయ్యబోతోంది. రాంగ్ టైమ్ లో ఆ కేసు లిస్టింగ్ చేశారని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయా.

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబును  అరెస్టు చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం వరుస కేసులు పెడుతోంది. ఇప్పటికే ఆ కేసులన్నీ  వచ్చే వారం విచారణకు రానున్నాయి. ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులు సంబంధించి అక్టోబరు నాలుగున తాడేపల్లిలోని ఏపీ సీఐడీ కార్యాలయంలో హాజరవుతున్నారు. ఈ మేరకు ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చారు. మరో పక్క స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు వేసిన  క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు.నాటకీయ పరిణామాల తర్వాత ఆ కేసు విచారణ అక్టోబరు 3న జరగనుంది. అందుకోసం  బెంచ్ ను కూడా కేటాయించారు. ఆక్టోబరు 3న విచారణకు మించి అక్టోబరు 4న జరిగే ఒక కేసు విచారణ అత్యంత కీలకమవుతుందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదే రేవంత్ రెడ్డికి సంబంధించిన వోటుకు నోటు కేసు అది మరిచిపోకూడదు.

ఓటు కు నోటు కేసులో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి..ఆర్కే … సుప్రీంలో రెండు పిటీషన్లు దాఖలు చేసారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా..ఈ కేసు అక్టోబర్ 4న లిస్టు అయింది. ఇదే సమయంలో తెలంగాణ ఏసీబీ నుంచి ఓటుకు నోటు‌ కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేసారు. 2017 లోనే ఈ పిటిషన్లను దాఖలు చేయగా ఇన్ని రోజులు కోర్టు రిజిస్ట్రీలో కొంత జాప్యమైనట్లు సమాచారం. ఈ నెల 4న సుప్రీంకోర్టులో జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం దగ్గర ఓటుకు నోటు కేసు లిస్టు అయింది. అప్పట్లో రేవంత్ రెడ్డి చుట్టే తిరిగిన ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు పాత్ర పైన ఎమ్మెల్యే ఆర్కే సుప్రీంను ఆశ్రయించారు. కేసులో రెడ్ హ్యాండెడ్ గా కెమెరాకు చిక్కిన ప్రస్తుత తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కి చంద్రబాబు డబ్బులు ఇచ్చారనేది ఆర్కే అభియోగం. ఇప్పుడు ఈ కేసుపై సుప్రీం కోర్టు అక్టోబరు 4న ఏదైనా ఉత్తర్వులిస్తుందా, మళ్లీ వాయిదా వేస్తుందా అన్నది పెద్ద ప్రశ్న. ఓటుకు నోటు కేసులో సీబీఐ విచారణ కోరాలని ఆర్కే తరపు న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. దానికి న్యాయమూర్తులు ఎలా స్పందిస్తారన్నదే పెద్ద ప్రశ్న. పిటిషనర్ల అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం మన్నించిన పక్షంలో చంద్రబాబుకు కష్టకాలం తప్పదని మరో వాదన అప్పుడే ప్రచారంలోకి  వచ్చింది. బ్రీఫ్డ్ మీ అని చంద్రబాబు ఫోన్లో చెప్పిన మాటే ఇప్పుడు పెద్ద సమస్యగా మారబోతుందన్నది ఇప్పుడు  ప్రస్తావనకు వస్తోంది.

2015లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం టీడీపీకి మద్దతు తెలపాలంటూ.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ మద్దతును రేవంత్ రెడ్డి కోరారు. అందుకోసం బేరం చేస్తున్నప్పుడు రేవంత్ ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయనపై ఉన్న అనేక కేసుల్లో ఇదీ ఒకటని చెప్పక తప్పదు. అయితే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు లింకుపైనే ఇప్పుడు వైసీపీ దృష్టి పెట్టారు. సుప్రీం కోర్టు ఏదైనా ఉత్తర్వులిచ్చిన పక్షంలో ఎనిమిదేళ్ల తర్వాత కేసు విచారణలో కదలిక వచ్చినట్లవుతుంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి