ముస్తఫా..ముస్తఫా..డోంట్ వరీ ముస్తాఫా.. కాలం నీ నేస్తం ముస్తాఫా..అనేది పాత సినిమా పాట. గుంటూరు తూర్పులో ముస్తాఫాకు మాత్రం కాలం కలిసిరావడం లేదు. అనుకున్నది జరగకపోగా ఆయన చేసిన పాపాలు సైతం ఇప్పుడు ఒకటొకటిగా వెంటాడుతున్నాయి…
వైసీపీలో వరుసగా రెండు సార్లు గెలిచిన వారిలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫా కూడా ఉన్నారు..ముస్లిం సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో అన్ని పార్టీలు ముస్లింలను నిలబెట్టే సంప్రదాయం ఉన్నప్పటికీ ఓటర్లు రెండు సార్లు వైసీపీని సమర్థించారు. ఈ సారి మాత్రం అలా ఉండకపోవచ్చన్న చర్చ ఊపందుకుంది. ఆ సంగతి తెలిసిన ముస్తఫ్ ఇప్పుడు రూటు మార్చారట. గుంటూరులో ఫైర్ బ్రాండ్ గా ప్రజల మనిషిగా తనను తాను ప్రచారం చేసుకుంటూ టైమ్ పాస్ చేసిన ముస్తాఫా…ఇప్పుడేమో ఓటమి భయంతో పోటీకి దూరంగా ఉండాలనుకుంటున్నారు. అందుకే తాను పోటీ చేయడం లేదని తన కుమార్తె నూరీ ఫాతిమా ఎన్నికల కదనరంగంలోకి దిగుతారని ప్రకటించారు…
ముస్తఫాపై వ్యతిరేకత ఎందుకు పెరిగింది. వైసీపీ శ్రేణులు కూడా ఆయనకు ఎదురు తిరుగుతున్నారా.. ఈసారి గుంటూరులోని రెండు నియోజకవర్గాలు కష్టమేనన్న చర్చ ఊపందుకుందా. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గుంటూరు ఈస్ట్ పై ప్రత్యేక దృష్టి పెట్టారా….
ముస్తఫా తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయడం లేదని తన కుమార్తె నూరీ ఫాతిమా పోటీ చేస్తుందని ప్రకటించారు. వైసీపీ అదిష్టానం కూడా గుంటూరు తూర్పు ఇన్ చార్జ్ గా నూరీ ఫాతమా ను అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన ఇప్పుడు టీడీపీ గుంటూరు తూర్పు ఇన్ చార్జ్ నసీర్ అహ్మద్ లో జోష్ నింపింది. నూరీ ఫాతిమా రంగంలోకి దిగితే తన గెలుపు ఖాయమని నసీర్ విశ్వసిస్తున్నారు. ముస్తఫా తూర్పు నియోజకవర్గం కు చేసిన అభివృద్ధి ఏం లేకపోగా విపరీతమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని , ఆయన అవినీతి చర్యలే తనను గెలిపిస్తాయనే ఆలోచన లో నసీర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ముస్తఫా కబ్జాలు, రౌడీ గుంపులను ఆయన ప్రోత్సహించడం లాంటి చర్యలు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇటీవల తన జిల్లా పర్యటనలో ప్రస్తావించారు. ముస్తఫా స్వయంగా గంజాయి విక్రయాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ముస్తఫా లాంటి వారి చర్యల కారణంగా గుంటూరులో యువత నిర్వీర్యమైపోయిందని ఆయన గుర్తు చేశారు. పైగా ముస్తఫా కుటుంబ పాలనకు ప్రాధాన్యమిస్తున్నారని అది ముమ్మాటికి ఆమోదయోగ్యం కాదని అటు వైసీపీ, ఇటు టీడీపీ శ్రేణులు అంటున్నారు. ఇక గుంటూరు వెస్ట్ ఇంచార్జీగా నియమితురాలైన మంత్రి విడదల రజనీకి కూడా విజయావకాశాలు లేవని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి….
బెజవాడ పాయే… ఇప్పుడు గుంటూరు కూడా పోయే అన్నట్లుగా వైసీపీ పరిస్థితి తయారైంది. ముస్తఫాను కట్టడిచేయలేకపోవడం గుంటూరు తూర్పులో అధికారపార్టీపై ప్రతికూల పవనాలకు కారణమవుతోంది. పైగా ఆయన అడిగిందే తడవుగా కూతురికి అవకాశం ఇవ్వడం కూడా పార్టీలో విభేదాలకు కారణమవుతోంది. చూడాలి మరి ఏమవుతుందో…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…