KTV Telugu : 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం చెందినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్డీయే లో కలిసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగానే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతూ వచ్చారు. పెట్రోల్ ధరలు అడ్డగోలుగా పెరిగినా రాష్ట్ర ప్రభుత్వం పన్నులు పెంచిందని విమర్శలు గుప్పిస్తున్నారు తప్పించి కేంద్ర ప్రభుత్వం పై పల్లెత్తు మాట అనలేదు. పైగా మోదీ గొప్ప విజనరీ అంటూ ఉపన్యాసాలు దంచారు. అంతే కాకుండా తమ పార్టీ నుంచి కొందరు ఎంపీలు బీజేపీ లోకి జంప్ చేసినా మిన్నకుండిపోయారు.
2019 ఎన్నికల అనంతరం బిజెపితో స్నేహం కోసం చంద్రబాబు ఎంతగా ప్రయత్నించినా బిజెపి దూరం పెట్టేస్తోంది. గతంలో చంద్రబాబుకు ఓ బిజెపి అగ్రనేత ఆశీస్సులు ఉండేవి. ఆయన రాజ్యాంగ పదవిలోకి వెళ్లిపోవడంతో సమీకరణలు మారిపోయాయి. ఈ మధ్యనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో కొద్ది సేపు గడిపి వచ్చారు.
2019 ఎన్నికల తర్వాత టీడీపీ కి తన రాజకీయ ప్రత్యర్ధి జగన్ మోహన్ రెడ్డి బలంగా అధికారంలో ఉన్నారు. ఆయనతో నిత్యం సమరం ఎలాగూ తప్పదు. ఆయనతో పాటు కేంద్రంలోని బిజెపితో కూడా యుద్ధం చేయడం మంచిది కాదని చంద్రబాబు అనుకుని ఉండొచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు. అదీ కాక జగన్ మోహన్ రెడ్డితో యుద్దం చేయాలంటే కేంద్రంలోని బిజెపి తనకు అండగా ఉంటేనే సాధ్యమవుతుందని చంద్రబాబు లెక్కలు వేసుకుని ఉండచ్చు.
ఏపీలో బిజెపికి ఓటు బ్యాంకు లేదు. పైపెచ్చు బిజెపి పై ఏపీలో వ్యతిరేకత కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఏపీని చీలిస్తే దానికి బిజెపి సహకరించిందన్న కోపం ఆంధ్రుల్లో ఉంది. కాంగ్రెస్ ను ఇప్పటికే భూస్థాపితం చేశారు ఏపీ ఓటర్లు. బిజెపికి అక్కడ ఎలాగూ అడ్రస్ లేదు కాబట్టి చెప్పుకోడానికి ఏమీ లేదు. మరి ఏమీ లేని బిజెపితో స్నేహం చేసి చంద్రబాబు ఏం సాధిస్తారు? అందుకే
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి