లోక్ సభకు మాజీ సీఎం -Will-Kiran-Kumar-Reddy-aspiring-MP-ticket-APBJP-Kiran Kumar Reddy-Modi-JP Nadda

By KTV Telugu On 26 February, 2024
image

KTV TELUGU :-

ఆయన మాజీ సీఎం. ఫైర్ బ్రాండ్ అని పేరు ఉంది. పైగా దూకుడున్న నాయకుడు. తన పదవీ కాలంలో ఎలాంటి అవినీతి ఆరోపణలు కూడా లేవు. అలాంటి నాయకుడు కాంగ్రెస్ ను  వీడి, బీజేపీలో చేరిన తర్వాత ఇప్పటికి గుర్తింపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతి వద్దు హస్తిన రావాలని బీజేపీ అధిష్టానం ఆయన్ను పిలుస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆయనే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి సీఎం ఆయన. రాష్ట్రం విడిపోయిన తర్వాత సొంత పార్టీ  పెట్టి ఘోరంగా దెబ్బతిన్నారు. ఇక రాజకీయాలకు గుడ్ బై చెబుతారని కూడా అనుకున్నారు. ఐతే కొన్ని రోజుల విశ్వాంతి తర్వాత కిరణ్ కుమార్  రెడ్డి మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చేశారు. ఆయన నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీలో కలిశారు. తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో క్రియాశీలంగా ఉన్నప్పటికీ కిరణ్ మాత్రం పచ్చ కండువా కప్పుకోలేదు. కాషాయ దళంతో భాగం కావడానికే ఇష్టపడ్డారు. అలాగని బీజేపీలో చేరి ఏడాది దాటినా పెద్దగా యాక్టివ్ గా కనిపించలేదు. ఏదో చేరిపోయి వదిలేసే బాపతు అనుకున్నారు. ఇన్నాళ్లకు  ఎన్నికలు వచ్చిన తర్వాత టర్న్ అరౌండ్ కనిపిస్తోంది…

బీజేపీకి కూడా కిరణ్ కుమార్ రెడ్డి లాంటి పాపులర్ లీడర్ కావాలి.జనాకర్షణ ఉంటేనే ఇప్పుడు ఏపీలో పార్టీ బలపడే అవకాశం ఉందని వారికి తెలుసు. పైగా బీజేపీకి కూడా కొన్ని ఆకాంక్షలున్నాయి. అందుకే కిరణ్ కుమార్ ను లోక్ సభకు పోటీ చేయించాలని డిసైడయ్యారు…..

ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై క్లారిటీ వస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడం ఖాయంగా తేలుతోంది. ఇప్పటికే ఆ మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ సైతం పూర్తయిందని టాక్ నడుస్తోంది. ప్రధానంగా కమలానికి అసెంబ్లీ సీట్లు కంటే ఎంపీ సీట్లు అధికంగా కేటాయిస్తారని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 400 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఏపీకి సంబంధించి పొత్తులో భాగంగా కనీసం ఐదు నుంచి ఎనిమిది ఎంపీ స్థానాలను ఆశిస్తోంది. ఆ స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దించడం ద్వారా మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని చూస్తోంది. అందుకే ఈసారి కీలక నాయకులను ఎంపీ అభ్యర్థులుగా బరిలోదించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది. ఆయన్ను రాజంపేట లోక్ సభా స్థానం నుంచి బరిలోకి దించుతారని  వార్తలు వస్తున్నాయి. బీజేపీ నుంచి  ఎంపీగా పోటీ చేసి కేంద్రమంత్రి కావాలని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. 2014లో టీడీపీ – బీజేపీతో

పొత్తు పెట్టుకున్న సమయంలో రాజంపేట ఎంపీ స్థానం నుంచి పురందేశ్వరి పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. గత రెండు ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కూటమి అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి బరిలో దిగితే గట్టి ఫైట్ ఉంటుంది. విజయావకాశాలు ఖాయమనిపిస్తోంది. ఇప్పటివరకు చిత్తూరు జిల్లా వాయల్పాడు, పీలేరు నియోజకవర్గాల నుంచి కిరణ్ కుమార్ రెడ్డి అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఏపీలో ప్రభుత్వ చీఫ్ వీప్ గా, స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. అనూహ్యంగా సీఎం పదవి సైతం వరించింది.

కిరణ్ కుమార్ రెడ్డికి యమజాతకుడని పేరుంది. ఆయనే ఎదురుచూడని పదవులు వచ్చి వాలతాయని చెబుతారు. సీఎం పదవి కూడా అలాగే వచ్చింది. మరి ఇప్పుడు రాజంపేటలో పోటీ చేస్తారా.. అక్కడ నుంచి గెలుస్తారా.. చూడాలి ఏం జరుగుతుందో…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి