ఉమ్మడి అనంతపురం జిల్లాలోని టీడీపీ కంచుకోట ఉరవకొండ నియోజకవర్గంలో పార్టీల గేమ్ ప్లాన్ మారుతోంది. ఎలాగైనా టీడీపీని ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకుంది. ఇప్పటికే అడ్డదారులు తొక్కుతోంది. ఐనా ఫలితం ఉంటుందా…
అనంతపురం లోక్ సభా నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉరవకొండ ఒకటి. రాయలసీమలోని 52 అసెంబ్లీ నియోజవర్గాల్లో గత ఎన్నికల్లో టీడీపి మూడు చోట్ల మాత్రమే గెలిచింది. అదీ కుప్పంలో చంద్రబాబు, హిందూపూర్ లో నందమూరి బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్. ఈ సారి సీఎం జగన్ ప్రతినిధ్యం వహించే పులివెందుల సహా 52 నియోజకవర్గాల్లో గెలిచి తీరుతామని టీడీపీ చెప్పుకుంటోంది. అందులో ఉరవకొండ ఆ పార్టీకి కంచుకోట. పయ్యావుల కేశవ్ మొత్తం ఆరు సార్లు పోటీ చేస్తే నాలుగు దఫాలు గెలిచి చూపించారు. ఎన్టీఆర్ హయాం నుంచి హార్డ్ కోర్ టీడీపీ కార్యకర్త అయిన కేశవ్.. పోటీలో ఎన్నడూ వెనుకంజ వేయలేదు. ఈ సారి మాత్రం వైసీపీ వర్సెస్ టీడీపీ రసవత్తర పోరు ఖాయమని అనంతపురం జిల్లా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పయ్యావుల ఒక ఫైటింగ్ స్టార్. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ గా ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఎప్పుడూ వెనుకాడలేదు.ఉరవకొండ నియోజకవర్గం అభివృద్ధి కోసం సొంత నిధులను కూడా ఖర్చు పెట్టారు. పార్టీ మారాలన్న ఒత్తిడిని తట్టుకున్నారు. నియోజకవర్గంలో అధికార పార్టీ అవినీతిని నిత్యం ఎండగడుతునే ఉన్నారు. ఐనా ఏదో తెలియని వెలికి కనిపిస్తూనే ఉంది…
ఉరవకొండ నియోజకవర్గం పరిధిలో ఐదు మండలాలు ఉన్నాయి. ఉరవకొండతో పాటు కూడేరు, బెళుగుప్ప, వజ్రకరూరు, విడపనకల్లు మండలాల్లో ఎక్కువ భాగం వెనుకబడి ఉన్నాయి. వాటికి అభివృద్ధి చేయడంలో పయ్యావుల కృషి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి అంశమే. రెండు వేల ఎకరాల పొలమున్న భూస్వాముల కుటుంబంలో పుట్టిన కేశవ్ ఎన్నడూ తనను తాను సంపన్నుడిగా భావించలేదు. పేద ప్రజల మధ్యనే బతికారు. ఇటీవలే తన ఆరు ఎకరాల పొలాన్ని పేదల ఇళ్ల నిర్మాణం కోసం ధారాదత్తం చేశారు. 165 మందికి ఒక్కొక్కరికి రెండున్నర సెంట్లు పంచి ఇచ్చారు. మరో పక్క మాజీ ఎమ్మెల్యే అయిన ఉరవకొండ వైసీపీ ఇంచార్జ్ విశ్వేశ్వర్ రెడ్డి అవినీతికి పర్యాయపదంగా మారారు.అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేద ప్రజలను దోచుకుంటున్నారు. ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఎక్కడ లేఅవుట్లు వేసినా ఆయనకు కప్పం కట్టాల్సిందే. గాలిమరల సెక్యూరిటీ సిబ్బంది జీతాల్లోనూ ఆయనకు వాటా ఇవ్వాల్సిందే. తప్పుడు ఎన్ఓసీలు సృష్టించి ఆడబిడ్డల భూములను కొట్టేశారు. పైగా అంతర్గత విభేదాలతో వైసీపీ అల్లాడిపోతోంది. విశ్వేశ్వర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి అన్నట్లుగా వైసీపీ రాజకీయం నడుస్తోంది. వీటన్నింటినీ కాదని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజా సేవలో తరిస్తున్నారు. కేశవ్ ను ఓడించేందుకు ఓటర్ల జాబితాలో గోల్ మాల్ చేసేందుకు వైసీపీ ప్రయత్నించింది. అధికారులను తమ వైపుకు తిప్పుకుంది. దీనిపై కేశవ్ ఫిర్యాదు చేయడంతో ఇద్దరు అధికారులను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. దానితో ఇప్పుడు వైసీపీకి కేశవ్ మరింత టార్గెట్ అయ్యారు.
ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఉరవకొండ వైపు చూస్తోంది. వైసీపీ పట్టుబిగిస్తే కేశవ్ ఎలా తట్టుకుని నెగ్గుకు వస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే జగన్ స్వయంగా స్పెషల్ ఫోకస్ పెట్టిన నియోజకవర్గాల్లో ఉరవకొండ ఒకటి. చంద్రబాబుకు కేశవ్ అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన్ను ఓడించడం కోసం జగన్ ప్రత్యేక దృష్టి పెడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా ప్రజాదరణ ఉన్న ప్రత్యర్థులను గెలవనిస్తే తర్వాత తమకు ఇబ్బందులు ఎదురవుతాయని జగన్ కు తెలుసు కదా..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…