వంశీపై కేసులను తిరగతోడుతున్న కూటమి ప్రభుత్వం

By KTV Telugu On 4 November, 2024
image

KTV TELUGU :-

వైసీపీ హయాంలో అరాచకాలకు పాల్పడిన వారి వివరాలను కూటమి ప్రభుత్వం బయటకు తీస్తోంది. వాటిపై విచారణకు దృష్టి పెట్టాలని పోలీసులకు, సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. తన రెడ్ బుక్కులో మూడో చాప్టర్ రెడీగా ఉందని చంద్రబాబు తనయుడైన మంత్రి నారా లోకేశ్ ప్రకటించిన నేపథ్యంలో సీన్ చాలా సీరియస్ గా ఉందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు తర్వాత పెద్ద తలకాయల జోలికి ఇంకా వెళ్లనప్పటికీ, పక్కా స్కెచ్ తో వైసీపీ బ్యాచ్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.

వైసీపీ నేతలైన కొడాలి నాని, వల్లభనేని వంశీ, లేళ్ల అప్పిరెడ్డి, అంబటి రాంబాబు లాంటి వాళ్ల అరెస్టులు తప్పవని మొదటి నుంచి భావిస్తుండగా.. ఇంతవరకు ఆ పని జరగలేదు. చాలా మంది ముందస్తు బెయిల్ తెచ్చుకోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు మాత్రం వల్లభనేని వంశీ కీలక అనుచరుడు యతేంద్ర రామకృష్ణను గన్నవరం పోలీసులు అరెస్టు చేసిన తీరు మాత్రం కూటమి ప్రభుత్వం కార్యాచరణ మొదలెట్టిందన్న అనుమానాలకు తావిస్తోంది. భార్యతో డైవర్స్ కు సంబంధించిన కేసులో రామకృష్ణను లాక్కువెళ్లిన తీరు ప్రభుత్వ ఉద్దేశాలను చెప్పకనే చెబుతోంది..

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నప్పటికీ ఎక్కువ కాలం నిలవకపోవచ్చు. కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమన్న పిటీషన్ వేసి కోర్టు అనుమతి తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. పైగా వంశీపై ఐదేళ్ల పాటు అనేక అంశాల్లో ఆరోపణలున్నాయి. టీడీపీ టికెట్ పై గెలిచి వైసీపీలో చేరిన వంశీ.. ఐదేళ్ల పాటు గన్నవరం నియోజకవర్గంలో అరాచకాలు సృష్టించారని కూడా చెబుతాను. కబ్జాలు, బలవంతపు వసూళ్లు, గ్యాంబ్లింగ్ డెన్స్ నిర్వహించారని.. ప్రతీ నెంబరు టూ వ్యాపారంలో ఆయనకు కమిషన్ వచ్చేదని వార్తలు వచ్చాయి. ప్రతీ ఒక్కరినీ బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారని స్థానిక ప్రజలు చెప్పుకుంటారు. వీటన్నింటిపై ఆరా తీసి సమగ్ర సమాచారం పంపాలని అమరావతి పెద్దలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో కొంత పని రహస్యంగా కూడా జరుగుతోంది. ఎందుకంటే వంశీకి ఇంకా పోలీసు శాఖలోనూ, అధికారవర్గాల్లోనూ అనుచరులున్నారు. వారంతా ఆయనకు ఉప్పందిస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల ఒక కేసులో వంశీ కోర్టుకు హాజరైనప్పుడు పోలీసులు ఆయనకు ఎస్కార్ట్ ఇవ్వడం, పదో తరగతి కూడా పాస్ కాని కొందరు వ్యక్తులు లాయర్ల డ్రెస్ లో బౌన్సర్లుగా ఆయన వెంట రావడం లాంటి ఘటనలపై చంద్రబాబు ప్రభుత్వం సీరియస్ గా ఉంది. పోలీసు శాఖలో అసలేం జరుగుతోందన్న అందన్న విషయంపై కూడా ఆరా తీస్తున్నారు.

జగన్ హయాంలో ఇష్టానుసారం వ్యవహరించిన వంశీ బ్యాచ్.. చంద్రబాబు కుటుంబ సభ్యులపై అత్యంత అశ్లీల కామెంట్స్ చేశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించారు. అలాంటి వారిని వదిలి పెట్టకూడదని అప్పట్లో సామాన్య జనం అభిప్రాయపడ్డారు. ఆ సంగతి గుర్తు చేసుకుంటున్న టీడీపీ నేతలు ఇప్పుడు వంశీపై చర్యలకు కౌంట్ డౌన్ పెట్టారని చెబుతున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి