ఎందుకంత ఫ్రస్టేషన్ ? YCP-JAGAN MOHAN REDDY-DHARMANNA PRASAD RAO

By KTV Telugu On 26 February, 2024
image

KTV TELUGU :-

రాజకీయ కుటుంబం, రాజకీయాల్లో పండిపోయిన అనుభవం. సమయస్ఫూర్తిగా మాట్లాడగల చాకచక్యం. అందరినీ కలుపుకుపోయే తత్వం మంత్రి ధర్మాన ప్రసాదరావు  సొంతం. ఐనా  ఎందుకో  ఒక నిరాశ, నిస్పృహ, నిటూర్పు. వెరసి ఫ్రస్టేషన్.

ఉమ్మడి రాష్ట్రంలో ధర్మాన  మంత్రిగా చేశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులందిరకీ ఆయన అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. శ్రీకాకుళంలో పార్టీకి దీర్ఘకాలిక పెద్ద దిక్కుగా కూడా ఉండేవారు.  రాష్ట్ర విభజన తర్వాత అవసరార్థం వైసీపీలోకి వచ్చారు.సర్దుకుపోయారు. విపక్షాలు విమర్శలు చేస్తుంటే వారిపై  రెచ్చిపోయిన సందర్భమూ ఉంది. తొలి  సారి మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తి ఉంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో ఆయనకు అవకాశం దక్కిన తర్వాత కాస్త చల్లబిడినట్లే కనిపించినా తర్వాత ఆయన స్పీడు  పెంచేశారు.

పార్టీలో ఉక్కపోత ఎక్కువగా ఉంది. జగన్ టికెట్ ఇచ్చినా తాను గెలుస్తానన్న నమ్మకం తగ్గిపోతున్నది.  ఉత్తరాంధ్రలో టీడీపీ- జనసేన దూసుకుపోతున్నాయన్న భయం ఆయన్ను వెంటాడుతోంది. పైగా పార్టీలో పెత్తందార్లు పెరిగిపోయారన్న ఆగ్రహం కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. దానితో ఆయన భాష మారిపోయింది. అశ్లీల పదజాలం వాడేందుకు కూడా ఆయన  వెనుకాడటం లేదు…

ధర్మాన  ప్రసాదరావుకు మంత్రిపదవి వచ్చింది. అనుకున్నంత మైలేజీ మాత్రం రాలేదు. ఎక్కడిక్కడ పార్టీ  ఆయన్ను  కట్టడి చేస్తోంది. సుబ్బారెడ్డి వచ్చి పెత్తనం చేస్తారన్న ఆగ్రహం ఆయనలో ఉంది. ఒక సందర్భంలో సుబ్బారెడ్డిని ఆయన పరుష పదజాలంతో దూషించారు. ఈ శ్రీకాకుళం నాదిరా అని కేకలేశారు…

తాను ఫైటర్ నని  చెప్పుకునేందుకు ధర్మాన ఏదేదో మాట్లాడుతున్నారు. ఎవరెవరినో  తిట్టేస్తున్నారు. పార్టీ గెలవాలంటే ఏం చేయాలో ఆయనే చెప్పేస్తున్నారు. వలంటీర్లను  పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకుంటే పార్టీకి అనుకూల ఫలితాలు ఉంటాయని ఆయన చెబుతున్నారు. 85 సంవత్సరాలు దాటిన వయోవృధ్దులు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఇదే అదునుగా అలాంటి వయోవృద్దులు, దివ్యాంగుల పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్లు వలంటీర్లే స్వయంగా నింపించి ఆ ఓట్లు తమకు పడేటట్టు చూడాలని కోరుతున్నారు. విపక్షాలు  దుమ్మెత్తి  పోస్తున్నా సరే ధర్మాన పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఓడిపోతానన్న ఫ్రస్టేషన్ ఆయనకు ఉందని ప్రత్యర్థులు అంటున్నారు. ఆయన మీటింగుల్లో మహిళలు లేచి వెళ్లిపోతున్నా ధర్మానం  పెద్ద సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇంట్లో పని  ఉండి వెళ్తున్నారని ఆయన సర్ది  చెప్పుకుంటున్నారు. వాళ్లు ఉండకపోయినా  ఫర్వాలేదు..ఓటేస్తే చాలని  వాదిస్తున్నారు. స్పీచ్ వినేందుకు ఇంట్రస్ట్ లేని వాళ్లు ఓట్లు వేయరన్న  సంగతి కూడా ఆయన గ్రహించలేకపోతున్నారు….

వైసీపీ వరుస సర్వేలు నిర్వహిస్తోంది. అన్ని సర్వేల్లోనూ ధర్మాన ఓడిపోతారని ఫలితం వస్తోంది. అదే విషయం లీక్ కావడంతో ఆయనలో ఆందోళన పెరిగిపోతోంది. అందుకే ఇప్పుడు ఎగిరెగిరి పడుతూ, పిచ్చిపిచ్చిగా  మాట్లాడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి