కబ్జాలను కాపాడుకునేందుకు వైసీపీ కొత్త ఎత్తుగడలు….

By KTV Telugu On 12 October, 2024
image

KTV TELUGU :-

వైసీపీ ఐదేళ్ల పాలన స్కాముల పుట్టగా మారింది. అప్పట్లో, ఇప్పట్లో జగన్ మనుషుల స్కాములు రోజుకొకటి బయటపడుతున్నాయి. జగన్ కు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారే భారీగా ప్రజాధనాన్ని దోపిడీ చేశారు. సెంటు ఖాళీ స్థలం కనిపిస్తే వారి పేరున మార్చుకునేందుకు వెనుకాడే వారు కాదు. అలాంటి వాళ్లు వందల ఎకరాలు వదులుతారని అనుకోవడం పొరపాటే. అప్పట్లో దోచేసిన స్థలాలకు సంబంధించిన పనులు కొన్ని ఇప్పుడు కూడా పెండింగ్ లో ఉండటంతో వాటిని చక్కదిద్దుకునేందుకు వైసీపీ నేతలు నానా తంటాలు పడుతున్నారు…

వైసీపీ హయాంలో జగన్ కు నీడలా ఉంటూ.. సలహాదారుగా కొనసాగిన ఒక నేత..తన కబ్జా బాగోతాల్లో ఇప్పుడు టీడీపీని కూడా మేనేజ్ చేసేస్తున్నారని సమాచారం. ఉత్తరాంధ్రలో యాభై ఎకరాలకు పైగా అసైన్డ్ భూములను ఎస్సీ, ఎస్టీ పేదల నుంచి కొనుగోలు చేసిన ఆ పెద్దమనిషి అప్పట్లో రిజిస్టేషన్ ప్రక్రియ ఆగిపోవడంతో ఇప్పుడు టీడీపీని కాంటాక్ట్ చేసి, దాదాపుగా మేనేజ్ చేసినట్లు తెలస్తోంది. అప్పట్లో జగన్ కు చెప్పి భూబదలాయింపు చట్టంలో కూడా మార్పులు చేయించిన సలహాదారు.. ఇప్పుడు తన కుమారుడి ద్వారా పనులు చక్కబెట్టుకుంటున్నారు. అసైన్డ్ భూములను 20 ఏళ్ల తర్వాత విక్రయించుకునే విధంగా జగన్ హయాంలో చట్ట సవరణ చేయడం ఆ సలహాదారు కోసమేనని తేలిపోయింది..

సదరు నేత కుమారుడు కూడా జగన్ కు అత్యంత సన్నిహితులు కావడంతో ఎక్కడ కావాలంటే అక్కడ సంతకాలు చేయించేశారు. అధికారులు కూడా చెప్పినట్లు విన్నారు. వాళ్లు కారుచౌకగా కొనుగోలు చేసిన స్థలం ప్రస్తుతం విశాఖపట్నం ప్రాంతంలో ప్రైమ్ ల్యాండ్ గా ఉంది.దానితో టీడీపీ నేతలను సంప్రదించి… మీకివ్వాల్సింది మీకు ఇస్తామని చెప్పేశారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్రకు చెందిన ఒక మంత్రి, ఒక టీడీపీ మైనార్టీ వర్గ కీలక నేత, ఇద్దరు ఐఎఎస్ అధికారులను తమకు అనుకూలంగా మార్చుకోగలిగారు. అవసరమైతే కొంత భాగం వారికి ఇచ్చేస్తానని కూడా ఆఫర్ పెట్టారు. త్వరలోనే అన్ని పనులు పూర్తవుతాయని చెబుతున్నారు.

వైసీపీ నేత కన్నేసిన ఆ స్థలం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయితే వందలకోట్ల ఆస్తిగా మారడం ఖాయం. అందుకే ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఎక్కడా మీడియాలో తన పేరు రాకుండా లో ప్రొఫైల్ మెయింటేయిన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టీడీపీ నేతలు వైసీపీపై తీవ్ర విమర్శలు చేసినా ఆయన సమాధానం చెప్పడం లేదు. వైసీపీ హయాంలో విదేశాల్లో వ్యాపారం చేసి వెయ్యి కోట్ల వరకు పోగొట్టుకున్న ఆ నేత.. ప్రస్తుత ఆస్తినైనా కాపాడుకోవాలని తహతహలాడుతున్నట్లు సమాచారం. టీడీపీలో కొంతమంది నేతల మద్దతు ఎలాగూ ఆయనకు ఉంది కదా. ఇంతకీ స్టేట్ మొత్తంలో ఆయన ఎంత కబ్జా చేశారన్నదే పెద్ద ప్రశ్న….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి