కిరణ్ రెడ్డికి వైసీపీ మద్దతు ?-YCP Support To Kiran Kumar Reddy

By KTV Telugu On 16 April, 2024
image

KTV TELUGU :-

మాజీ సీఎం  కిరణ్ కుమార్ రెడ్డికి కాలం కలిసొస్తుందా. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయనకు బలం లేకపోయినా విజయావకాశాలు మెరుగు పడుతున్నాయా. కిరణ్  రెడ్డిపై ప్రజల్లో విశ్వాసం లేకపోయినా రాజకీయ సమీకరణాల కారణంగా ఆయన పైచేయిగా నిలిచే అవకాశాలు మెరుగుపడ్డాయా. రాజంపేట రాజకీయం మారుతున్న వేళ కిరణ్ రెడ్డి ఆప్ హ్యాపీస్ అంటున్నారా….

కొంత మందిని యమ జాతకులు అంటారు. వారు ఏమీ  చేయకపోయినా అంతా కలిసొస్తూనే ఉంటుంది. పట్టిందల్లా బంగారమవుతుంది. కావాలంటే వాళ్లు విశ్రాంతి తీసుకోవచ్చు. వాళ్లు వచ్చినప్పుడు మాత్రం  జనం బ్రహ్మరథం పడతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి సీఎం కిరణ్ కుమార్  రెడ్డి విషయంలోనూ అదే జరుగుతోంది. ఆయన జనానికి చేసిందేమిటో ఎవరికీ తెలీదు. ఆయన జనంలో  తిరిగిన  సందర్భమూ  లేదు. ఐనా సరే జనం వెంటబడి ఆయనకు ఓట్లేస్తారు. అందుకే ఆయనకు జాక్ పాట్ జానకిరాం అని పేరు  కూడా ఉంది. 2014కు ముందు ఆశించకుండానే ఆయనకు స్పీకర్ పదవి దక్కింది. వైఎస్ మరణం  తర్వాత  రోశయ్య సీఎం అయితే సామాజిక సమీకరణాలు కలిసి రాలేదు. దానితో రోశయ్యను  దించి కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంను చేశారు. పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నప్పటికీ సీఎం పదవి  అప్పట్లో కిరణ్ ను  వరించింది. యమజాతకం అంటే అదే కావచ్చు.  విభజనను ఆపుతానంటూ కిరణ్ ఇచ్చే స్టేట్ మెంట్స్ కు జనం కేరింతలు కొట్టేవారు. రాష్ట్రవిభజన తర్వాత సొంత పార్టీ పెట్టుకున్న కిరణా మనుగడ సాగించలేక కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు. కాంగ్రెస్ పిలిచి మరీ ఆయన్ను పార్టీలో చేర్చుకుంది. దేశ, రాష్ట్ర రాజకీయ సమీకరణాలను బేరీజు వేసుకుని కిరణ్ వెళ్లి బీజేపీలో చేరారు. ఇప్పుడు  పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు లోక్ సభా స్థానాలు దక్కాయి. 60 మంది ఆశావహులున్నప్పటికీ బీజేపీ అధిష్టానం రాయలసీమలోని కీలక రాజంపేట నియోజకవర్గాన్ని కిరణ్ రెడ్డికి కట్టబెట్టింది.

రాజంపేట బలమైన వేసీపీ నియోజకవర్గం. అది కాంగ్రెస్ నుంచి వైసీపీకి మారింది. గత పాతికేళ్లుగా  టీడీపీ అభ్యర్థి అక్కడ గెలవలేదు. ఇంతకాలం అక్కడ బీజేపీకి మనుగడే లేదు. ఇప్పుడు కిరణ్ ఎంట్రీలో సీన్ ఆయనకు అనుకూలమైంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోట బీటలు వారింది..

కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కిరణ్ రెడ్డి, రామచంద్రారెడ్డికి  అంతర్గత వైరం ఉండేది. అది నల్లారి ఫ్యామిలీ, పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఫైట్ గా కూడా కొనసాగేది. పెద్దిరెడ్డి వైసీపీలో చేరి పదేళ్లుగా లబ్ధి పొందుతూనే ఉన్నారు.ఇప్పుడు రాజంపేట నియోజకవర్గానికి పెద్దిరెడ్డి  కుమారుడు మిధున్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనపై  బీజేపీ అభ్యర్థిగా  కిరణ్ రెడ్డి పోటీ పడుతున్నారు అక్కడ బీజేపీకి ఏ మాత్రం బలం లేదు.  2014లో కూటమి స్ట్రాంగ్ వేవ్ లో ఉన్నప్పుడు రాజంపేటలో కూటమి అభ్యర్థిగా పురంధేశ్వరి పోటీ చేశారు. కానీ ఆమెపై మిధున్ రెడ్డి లక్ష డెబ్భై నాలుగు వేల ఓట్లతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో అయితే వైసీపీకి రెండు లక్షల 68 వేల ఓట్ల మెజారిటీ దక్కింది. అటువంటి నియోజకవర్గం నుంచి కిరణ్ పోటీ చేయడం సాహసం అని కొందరు అంటున్నప్పటికీ పరిస్థితులు ఆయనకు అనుకూలంగా మారుతున్నాయి. రాజంపేట పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు వైసీపీ చేతిలోనే ఉన్నాయి. అందులో పుంగనూరుకు మంత్రి పెద్దిరెడ్డి  ప్రాతినిధ్యం వహిస్తున్నారు.పుంగనూరు మినహా మిగతా ఆరు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు పెద్దిరెడ్డి కుటుంబ రాజకీయాలను, ఆయన పెత్తందారీతనాన్ని వ్యతిరేకిస్తున్నారు. పెద్దిరెడ్డి ఎవరికీ అందుబాటులో ఉండరు. ఎవరితో మాట్లాడరు. వైసీపీలో జగన్ తర్వాత తనే అన్న రేంజ్ లో ఆయన సీన్ ఉంటుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తం తన ఇలాకా మాత్రమేనని ఆయన ఫీల్  అవుతుంటారు. జిల్లాలో లాండ్, శాండ్, మైన్ దందా మొత్తం పెద్దిరెడ్డి కుటుంబం కనుసన్నల్లోనే జరుగుతుంది.దానితో ఇప్పుడు వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు పెద్దిరెడ్డిని దెబ్బకొట్టేందుకు కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతివ్వాలని  ఆలోచిస్తున్నట్లు సమాచారం. కొందరు లోపాయకారిగా సాయం చేయాలని అనుకుంటుంటే, మరికొందరు త్వరలో పార్టీ నుంచి బయటకు వచ్చి  బహిరంగ మద్దతు  ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇదీ పెద్దిరెడ్డికి పెద్ద దెబ్బేనని భావిస్తున్నారు…

రాజంపేటలో గెలవడమంటే కిరణ్ రెడ్డి స్టార్ తిరిగినట్లే అనుకోవాలి. ఆయన కేంద్ర మంత్రి అవుతారని అనుచరులు, బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు రాజంపేటలో ఓడినా రాజ్యసభ ఇచ్చి కేంద్రమంత్రి పదవిని కట్టబెడతారని మరో టాక్ నడుస్తోంది. ఏమో గుర్రం ఎగరావచ్చు కదా….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి