తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు వాడిన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది.ఈ విషయాన్ని పూర్తిగా తేల్చేసి.. దోషులను ససాక్ష్యంగా జనం ముందు నిలబెట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఇటీవల చంద్రబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. తిరుమల సెట్ ను ఇంట్లో వేయించుకున్న జగన్ ను ఏమనాలి అని చంద్రబాబు ప్రశ్నంచడంలో ఒక మతలబు కూడా ఉంది. వెంకన్నపై నమ్మకం లేకుండా జంతువుల కొవ్వును లడ్డూలో కలిపే జగన్ ఇంట్లో తిరుమల సెట్ ఎందుకన్నది చంద్రబాబు వేసిన మౌలికమైన ప్రశ్న. చంద్రబాబు మరో అంశం కూడా గుర్తుచేశారు. జగన్ సతీమణి భారతి గుడికి రారని ఆయన అన్నారు. ఈ దిశగా చంద్రబాబు నిజమే చెప్పారు. ఎందుకంటే ఎన్నో పర్యాయాలు జగన్ తిరుమల ఒక్కరే వచ్చారు. భారతి ఎప్పుడూ కొండెక్కిన పాపాన పోలేదు. అంటే జగన్ కన్వర్టెడ్ హిందూ.. భారతి మాత్రం ఎప్పుడో కన్వర్ట్ అయిన క్రిస్టియన్. సీఎంగా జగన్ పక్కన ఉగాది వేడుకలు, దీపావళి ఉత్సవాల్లో పాల్గొన్నప్పటికీ ఆమె తనకిచ్చిన ప్రసాదాన్ని ఆరగించరు. టిష్యూ పేపర్లో భద్రంగా దాచిపెట్టి తర్వాత పారేస్తారని తెలిసిన వాళ్లు చెబుతారు. అందుకే భారతీయ సంప్రదాయాలు పాటించని వారికి తిరుమలతో పనేమిటన్నది చంద్రబాబు ప్రశ్న. అలాగే టీటీడీ ఛైర్మన్ గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి అయ్యప్ప మాల వేసుకున్నప్పటికీ ఆయన సతీమణి బైబిల్ పట్టుకుని తిరుగుతారని చంద్రబాబు గుర్తుచేశారు.
చంద్రబాబు వ్యూహాత్మకంగానే వైఎస్ భారతి పేరును ప్రస్తావించారనుకోవాలి. జగన్ హయాంలో తెరవెనుక మంత్రాంగం అంతా భారతి చేసేవారని మామూలు జనానికి ఇప్పుడిప్పుడే తెలుస్తున్నప్పటికీ టీడీపీ, జనసేన ఆ సంగతి ఎప్పుడో కనిపెట్టింది. భారతి శాసిస్తారు…సజ్జల పాటిస్తారూ.. అన్నట్లుగా ఐదేళ్లు పాలన గడిచిందని తాడేపల్లి ప్యాలెస్ గురించి బాగా తెలిసిన వాళ్లు చెబుతారు. జగన్ పబ్జీ ఆడుకోవడం తప్పితే చేసిందేమీ లేదని, అన్ని వ్యవహారాలు భారతి చూసేవారని కూడా అంటారు. ఫైనాన్షియల్ మేటర్స్ ఏమైనా సరే అప్పటి సీఎం సతీమణి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే జరిగేవని కూడా వార్తలు వస్తున్నాయి. ప్రతీ పంచాయతీకి విధిగా సాక్షిపేపర్ వేయించి.. పేపర్ బిల్లును ప్రభుత్వ ఖజానా నుంచి కట్టించిన ఘనత కూడా భారతీదేనని అంటుంటారు. అమ్మగారి ఆదేశాలు లేనిదే ఏ పనీ జరగదని అర్థమైన తరుణంలో తిరుమల నెయ్యి కాంట్రాక్ట్ కూడా ఆమె చలవేనా అని కనిపెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ప్రయత్నిస్తోంది. కాంట్రక్ట్ సంస్థ భారతి రూట్లో నరుక్కుని వచ్చి.. యద్ధచ్ఛగా తాను అనుకున్నది సాధించిందన్న కోణంలో ఇప్పుడు దర్యాప్తు చేయాలని కూడా విచారణాధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆ సంగతి తెలిసే ఇంతకాలం మౌనంగా ఉన్న సజ్జల ఇప్పుడు నోరు తెరిచారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఎవరి తప్పూ లేదని చెప్పేందుకు నానా తంటాలు పడుతున్నారు. అది ఆయనకు సంబంధించిన అంశం కాకపోయినా భుజాలు తడుముకుంటున్నారు. ఏదేమైనా విచారణ నిష్పక్షపాతంగా సాగితేనే పెద్ద లింకులు బయటపడతాయన్నది నిజం….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…