రాజధాని మంటల్లో వైసీపీ !

By KTV Telugu On 17 February, 2024
image

KTV TELUGU :-

రాజకీయ లబ్ది కోసం తాను పెట్టిన మూడు రాజధానుల మంటలో వైసీపీ కాలిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు రాజధాని అనే ప్రస్తావన చేయడానికి జగన్ రెడ్డికి కూడా ధైర్యం చాలడంలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మొదటి అంశంగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ప్రజుల ఎవరికి ఓటేయాలన్న ఎజెండాలో ఖచ్చితంగా రాజధాని ఉంటుంది. ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రంగా ఇప్పటికే ఏపీపై దేశవ్యాప్తంగాసెటైర్లు పడుతున్నాయి. కానీ ఈ మంటలను రాజేసిన వైసీపీకి దారీ తెన్నూ తెలియడం లేదు.

టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా ఉంది. కానీ  గత ఐదేళ్ల కాలంలో మూడు రాజధానులు పేరుతో వైసీపీ రాజకీయం చేసింది. ఇప్పుడు ఎన్నికలకు ముందు మూడు రాజధానుల గురించి మాట్లాడటం లేదు. విశాఖ  గురించి చెప్పడం లేదు. అమరావతి గురించీ స్పందించడం లేదు.  దీంతో అసలు ఏపీ రాజధాని అంశంపై వైసీపీ స్పందనేమిటన్నది ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది.  గతంలో సీఎం జగన్ ఉత్తరాంధ్రలో బటన్ నొక్కుడు సభలు పెట్టినప్పుడు విశాఖలో కాపురం పెట్టేస్తున్నానని ప్రకటనలు చేసేవారు. అంటే.. విశాఖ నుంచి పాలనకు  వచ్చేస్తున్నా అని చెప్పేవారు. కానీ ఇటీవల సిద్ధం సభను భీమిలీలో పెట్టారు. రాజధాని గురించి ఒక్క  మాట కూడా మాట్లాడలేదు. ఆడుదాం ఆంధ్రా ఫైనల్స్ ముగింపు కార్యక్రమానికి వెళ్లారు.. అక్కడా మాట్లాడలేదు. దీంతో మూడు రాజధానుల నినాదంతో ఎన్నికలకు  వెళ్తుందనుకున్న  వైసీపీ.. ఇప్పుడు  నోరెత్తలేకపోతోంది.

పాలన వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ది అంటూ తెగ హడావుడి చేసినా.. నాలుగేళ్ల నుంచి ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. ఆ ఎఫెక్ట్‌తో ఏపీకి రాజధానే లేకుండా చేసిందనే అప్రతిష్ట మూటగట్టుకుంది. ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. రాజధానిపై డిఫెన్స్‌లో పడకుండా ఉండటానికి కేపిటల్‌పై కొత్త హడావుడి మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానని కొత్త పల్లవి ఎత్తుకుంది. వైవీ కామెంట్స్‌పై రెండు రాష్ట్రాల్లో విమర్శలు వెల్తువెత్తడంతో వెంటనే యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఆ క్రమంలో అసలు కేపిటల్ విషయంలో వైసీపీ స్టాండ్ ఏంటో ఎవరికీ అంతుపట్టకుండా తయారైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏపీ రాజధానిగా అమరావతికి ఆమోదం తెలిపిన జగన్. అధికారంలోకి రాగానే కేపిటల్‌పై యూటర్న్ తీసుకున్నారు.

ఏళ్లు గడుస్తున్నా 3 రాజధానుల దిశగా ఒక్క అడుగు కూడా వేయలేకపోయింది ప్రభుత్వం. ఉన్న రాజధాని అమరావతిలో అభివ‌ృద్దిని అటకెక్కించేసింది. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చారని విమర్శలు ఎదుర్కొంటోంది. రానున్న ఎన్నికల్లో విపక్షాలకు అది ప్రధాన విమర్శనాస్త్రంగా మారింది. ఆ క్రమంలో కేపిటల్ విషయంలో డిఫెన్స్‌లో పడినట్లు కనిపిస్తున్న వైసీపీ. సడన్‌గా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటూ కొత్త పల్లవి ఎత్తుకుంది.    వైవీ సుబ్బారెడ్డి మాటలు వక్రీకరించారని ఆయన కవర్ చేశారు. వైసీపీ నేతలు మళ్లీ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ గురించి మాట్లాడటం లేదు. వైసీపీలో నిర్ణయాలు తీసుకునే అత్యుంత ముఖ్యుల్లో ఒకరైనవైవీ సుబ్బారెడ్డి ఉమ్మడి రాజధాని అంశాన్ని తనకి తానుగా ప్రస్తావిస్తారని ఎవరూ అనుకోలేదు.  పెద్దిరెడ్డి అది వైవీ సొంత అభిప్రాయం అంటుంటే.. బొత్స సత్యనారాయణ మాత్రం వైవీ వ్యాఖ్యలను వక్రీకరించారని తేల్చేస్తున్నారు. వైవీ ఉమ్మడి రాజధాని ప్రస్తావన  మీడియా ముందే స్పష్టంగా మాట్లాడారు.   న్నాళ్లు మూడు రాజధానుల రాగం ఆలపించిన అధికార పార్టీ.. ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను మరికొన్నాళ్లు కొనసాగించాలని డిమాండ్ చేయడం అందులో భాగమే అంటున్నారు. కానీ వర్కవుట్ అయ్యే సూచనలు లేకపోవడంతో వెనక్కి  తగ్గినట్లుగా భావిస్తున్నారు.

ఎన్నికలకు టీడీపీ తమది అమరావతే రాజధాని అనే విధానాన్ని ప్రకటించింది. అందులో మరో సందేహం లేదు. అ పార్టీకి చెందిన అన్ని ప్రాంతాల నేతలూ అదే చెబుతున్నారు. వైఎస్ఆర్సీపీ తన విధానాన్ని స్పష్టం చేయాల్సి ఉంది. విశాఖ రాజధాని అనేది రాజ్యాంగపరంగా సాధ్యం కాదు. అమరావతి రైతులకు రూ. లక్ష కోట్ల వరకూ నష్టపరిహారాన్ని ఇస్తే..సెటిల్ చేసుకుని రాజధానిని తరలించవచ్చు.  లేకపోతే మళ్లీ గెలిచినా  రాజధాని పెట్టలేరు. న్యాయస్థానాలూ కూడా చట్టాలు ఉల్లంఘించి  రైతులకు అన్యాయం చేయమని ఎక్కడా చెప్పవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మూడు రాజధానులు చేయాలనుకుంటే.. అదే విషయాన్ని ప్రజలకు చెప్పాలని.. సాధ్యాసాధ్యాలను కూడా వివరించాలని అంటున్నారు. ఒకే  రాజధాని అయితే.. ఆ పాలసీ ఎందుకో కూడా ప్రజలకు చెప్పాల్సి ఉంటంది.  లేకపోతే తాను పెట్టిన రాజధాని మంటల్లోనే తన పార్టీని బూడిద చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడవచ్చు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి