2004లో తమిళంలో విడుదలై, అలాగే తెలుగులోనూ విడుదలై సంచలన విజయం సాధించింది 7/G బృందావన్ కాలనీ.
అప్పట్లో యూత్ ను వెరెక్కించింది. రవి కృష్ణ యాక్టింగ్ హైలైట్ గా నిలిచింది.
సోనియా అగర్వాల్ ఓవర్ నైట్ డ్రీమ్ గర్ల్ గా మారింది. ఇక యువన్ శంకర్ రాజా పాటలు
దక్షిణాది ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఇంత పెద్ద చరిత్ర ఉన్న ఈ సినిమాకు సీక్వెల్ తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా కాలంగా ఇదే సీక్వెల్ పై ఏ.ఎం.రత్నం సీరియస్ గా ట్రై చేస్తున్నాడు.
మొదటి భాగం తెరకెక్కించిన దర్శకుడు సెల్వరాఘవన్ తో మీటింగ్ జరుపుతున్నాడు.
ఈ మథ్యే సీక్వెల్ కు సంబంధించిన స్టోరీలైన్ లాక్ అయిందట. త్వరలోనే సీక్వెల్ ఎనౌన్స్ మెంట్ ఉంటుందట.
సీక్వెల్ మూవీలో రవికృష్ణ నటిస్తాడా లేక మరో యంగ్ హీరోను 7/G బృందావన్ కాలనికి పంపిస్తారా అనేది ఆశక్తికరంగా మారింది. ఎందుకంటే గత పుష్కర కాలంగా ఈ సినిమా హీరో రవికృష్ణ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.
తన వ్యక్తిగత జీవితం తాను గడుపుతున్నాడు. ఈ దశలో ఈ సినిమా సీక్వెల్ కోసం తాను బయటికి వస్తాడా రాడా అనేది చూడాల్సి ఉంది.