నిర్మాతపై ఒత్తిడి పెంచేస్తున్న దర్శకుడి తప్పిదం
అదనంగా మరో వంద కోట్లు ఖర్చు
సంక్రాంతి పండక్కి ఆదిపురుష్ రావడం లేదు. అందుకు కారణం చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ పై పెద్ద ఎత్తున వ్యక్తిరేకత వ్యక్తమయింది. దాంతో వేసవిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రచారం సాగింది. అప్పటికి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఎంతో కొంత రిపేర్లు చేసి సమ్మర్ లో శ్రీరామనవమి లేదా మేలో రిలీజ్ చేయాలనుకున్నారు. కాని దర్శకుడు ఓం రౌత్ చేసిన తప్పిదం వల్ల సినిమాలోని ప్రముఖ పాత్రలను అన్నిటిని యూనిట్ తిరిగిమార్చాలి అనుకుంటోంది. అందుకు ఆరు నెలల సమయం కూడా సరిపోయేలా లేదు. పేరుకి వంద కోట్ల బడ్జెట్ తో రిపేర్లు అని యూనిట్ చెబుతున్నప్పటికీ, ఆ బడ్జెట్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
గతంలో బాలీవుడ్ తానాజీ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు ఓం రౌత్. రామాయణం నేపథ్యంలో టీసిరీస్ సంస్థ వారి కోరికపై సినిమా తీసాడు. అదే ఆదిపురుష్. తానాజీ చిత్రంలో తనదైన గ్రాఫిక్స్ తో అద్భుతం చేసాడు దర్శకుడు. ఆ నమ్మకంతోనే టీసిరీస్ వారు ఆదిపురుష్ కు 500 కోట్ల బడ్జెట్ కేటాయించారు.తమకు ఉన్న అనుబంధంతో ప్రభాస్ డేట్స్ ఇప్పించారు. ఇంతా చేస్తే దర్శకుడు అంచనాలకు దూరంగా సినిమాను తెరకెక్కించాడు. కొత్తతరం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమా తీసాను అని వివరణ ఇచ్చుకున్నప్పటీ, అది సరిపోలేదు. పైగా నిర్మాతపై ఒత్తిడి అంతకంతూ పెరుగుతోంది.