మాస్ కా దాస్ తీరు చాలా తప్పు
40 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నాడు యాక్షన్ కింగ్ అర్జున్. నాలుగు దశాబ్ధాలుగా ఎన్నడూ లేని విధంగా
ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఓ యువ నటుడి వల్ల తన కొత్త సినిమా ఆగిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేసాడు.
దక్షిణాది మొత్తం అభిమానులను సంపాదించుకున్న అతికొద్ది మంది నటీ నటుల్లో అర్జున్ ఒకడు. ఆయన ఇటీవల టాలీవుడ్ వరకు వచ్చి విశ్వక్ సేన్ తో సినిమా తీయాలి అని అనుకున్నాడు. అనుకున్నదే మొదలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఘనంగా సినిమాను ప్రారంభించాడు. అయితే ఈ సినిమా కథ విషయంలో, పాటల విషయంలో, డైలాగ్స్ విషయంలో, సంగీతం విషయంలో దర్శకుడు అర్జున్ కు హీరో విశ్వక్ సేన్ మధ్య కొన్ని ఇష్యూస్ ఉన్నాయి.
దాంతో సినిమా షూటింగ్ యూనిట్ అంతా రెడీ అయిన తర్వాత 6 గంటలకు హీరో అడుగు పెట్టాల్సిన వేళ 5 గంటలకు విశ్వక్ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ కు నేను షూట్ కు రాలేను అంటూ మెసేజ్ వచ్చింది. దాంతో తమకు అవమానం జరిగినట్లు అర్జున్ భావించాడు. ఇది చాలా తప్పు. హీరోకు తనకు అభిప్రాయభేదాలు ఉన్న విషయం సరైనదే.
కాని మొత్తానికి మొత్తం తను చెప్పినట్లు జరగాలి అనుకోవడం వల్లే ఇన్ని సమస్యలు. ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయింది. త్వరలో మరో హీరోతో మూవీ చేస్తాను అన్నాడు అర్జున్.మరోవైపు ఈ వివాదం పై విశ్వక్ సేన్ స్పందించాల్సి ఉంది. సెట్ లో ఇబ్బంది పడటం వల్లే సినిమా నుంచి ఆయన తప్పుకున్నట్లు విశ్వక్ మేనేజర్ చెప్పుకొస్తున్నాడట.